డేంజర్ జోన్‌లో దేశ రాజధాని.. తాత్కాలికంగా స్కూళ్లు, కాలేజీలు బంద్

ఢిల్లీలో వాయు కాలుష్యం పెరిగిపోవడంతో తాత్కాలికంగా స్కూళ్లను మూసివేశారు. 10, 12వ తరగతి విద్యార్థులకు ఆన్‌లైన్‌లో క్లాసులు నిర్వహించాలని ఢిల్లీ సీఎం అతిశీ ఆదేశాలు జారీ చేశారు.

New Update
air

దేశ రాజధాని ఢిల్లీ ప్రస్తుతం డేంజర్ జోన్‌లో ఉంది. ఢిల్లీలో రోజురోజుకి గాలి నాణ్యత పడిపోతుంది. ఈ రోజు ఎయిర్‌ క్వాలిటీ సివియర్ ప్లస్ కేటగిరీలోకి పడిపోయింది. దీంతో ఢిల్లీ ప్రభుత్వం స్కూళ్లకు సెలవులు ప్రకటించింది. గతంలో ప్రాథమిక విద్యార్థుల స్కూళ్లు మూసివేయగా.. ఇప్పుడు 10, 12 వ తరగతి విద్యార్థులకు కూడా సెలవులు ప్రకటించింది. మళ్లీ ఆదేశాలు జారీ చేసే వరకు ఆన్‌లైన్ క్లాస్‌లు నిర్వహించాలని సీఎం అతిశీ ఆదేశించారు.

ఇది కూడా చూడండి: BIG BREAKING: వైసీపీ ఎమ్మెల్యేకు నోటీసులు

ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్..

ఇప్పుడు ప్రైవేట్ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం ప్రకటించారు. కూల్చివేతలు, నిర్మాణ పనులను ఆపివేయాలని ఆదేశించారు. అలాగే అవసరం లేని భారీ వాహనాలను కూడా సిటీలో నిషేధం విధించారు. కొన్ని ప్రాంతాల్లో వాయు నాణ్యత సూచీ 1000 కంటే ఎక్కువగా ఉంది. అధిక కాలుష్యం వల్ల ఢిల్లీ ప్రజలు అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. కాలుష్యా్న్ని నియంత్రించేందుకు కూడా ప్రభుత్ం ప్రయత్నిస్తోంది. 

ఇది కూడా చూడండి: కేజ్రీవాల్‌కు బిగ్ షాక్.. బీజేపీలో చేరిన కీలకనేత

ఇదిలా ఉండగా ఇటీవల ప్రభుత్వ కార్యాలయాల్లో పనివేళలను కూడా మార్చారు. ఢిల్లీ మున్సిపాలిటీ పరిధిలోని కార్యాలయాలు ఉదయం 8.30 నుంచి 5 గంటల వరకు, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు ఉదయం 9 నుంచి సాయంత్రం 5.30 వరకు, దిల్లీ ప్రభుత్వ ఆఫీసులు ఉదయం 10 నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు పనిచేయాలని సీఎం అతిశీ ఆదేశించారు.

ఇది కూడా చూడండి:  BIG BREAKING: హైదరాబాద్‌లో ఐటీ దాడులు

అలాగే వాయు కాలుష్యం పెరిగిపోతున్న కారణం వల్ల అవసరం లేని నిర్మాణాలు చేపట్టకూడదని ప్రభుత్వం ప్రకటించింది. అలాగే కూల్చివేతలపై కూడా నిషేధం విధించింది. వీటితో పాటు బీఎస్‌-3 పెట్రోల్, బీఎస్‌-4 డీజిల్‌ వాహనాల ప్రయాణాలను నిషేధించాయి. త్వరలో 106 క్లస్టర్ బస్సులు,  మెట్రో సేవలను కూడా మరింత పెంచుతామని ప్రభుత్వం తెలిపింది. 

ఇది కూడా చూడండి:  అతి తక్కువ టైంలో లక్ష లైక్స్ అందుకున్న టాలీవుడ్ ట్రైలర్స్

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Marriage: పెళ్లికి ముందు కాబోయే అల్లుడితో అత్త జంప్‌..

తన కూతురి పెళ్లికి మరో 9 రోజుల సమయం ఉందనగా.. ఓ మహిళ కాబోయే అల్లుడితో లేచిపోవడం కలకలం రేపింది. పెళ్లి షాపింగ్‌కు వెళ్తున్నామని చెప్పి అత్తా, అల్లుడు.. 2.5 లక్షల నగదు, బంగారంతో జంప్ అయ్యారు. దీంతో మహిళ భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

New Update
Woman Elopes With To Be Son-in-Law Days Before Wedding

Woman Elopes With To Be Son-in-Law Days Before Wedding

ఉత్తరప్రదేశ్‌లో అందరూ నొరెళ్లబెట్టే సంఘటన చోటుచేసుకుంది. తన కూతురి పెళ్లికి మరో 9 రోజుల సమయం ఉందనగా.. ఓ మహిళ కాబోయే అల్లుడితో లేచిపోవడం కలకలం రేపింది. పెళ్లి షాపింగ్‌కు వెళ్తున్నామని చెప్పి అత్తా అల్లుడు ఇద్దరూ జంప్ అయిపోయారు. అలాగే 2.5 లక్షల నగదు, బంగారం కూడా ఎత్తుకెళ్లారు. ఇరు కుటుంబాలు ఒక్కసారిగా కంగుతిన్నాయి. చివరికీ పారిపోయిన మహిళ భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 

Also Read: బీహార్ లో దారుణం కేంద్రమంత్రి మనమరాలి దారుణ హత్య

ఇక వివరాల్లోకి వెళ్తే ఉత్తరప్రదేశ్‌లోని అలీగర్ జిల్లాలో ఓ కుటుంబం నివాసం ఉంటోంది. కూతురికి పెళ్లి చేసేందుకు తల్లిదండ్రులు సిద్ధమయ్యారు. వరుడు దొరకడంతో పెళ్లి సంబంధం ఖాయమైపోయింది. ఏప్రిల్ 16న పెళ్లి ముహూర్తం పెట్టుకున్నారు. అయితే కాబోయే పెళ్లి కొడుకు తరచుగా తన అత్తవారింటికి వచ్చేవాడు. అయితే ఓసారి అతడు తనకు కాబోయే అత్తకు మొబైల్ ఫోన్‌ను గిఫ్ట్‌గా ఇచ్చాడు. ఆ తర్వాత వీళ్లద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. 

Also Read: ఓరి కామాంధుడ.. ఆవుని కూడా వదల్లేదు కదరా.. ఛీ ఛీ- వీడియో వైరల్

మరో 9 తొమ్మిది రోజుల్లో పెళ్లి జరగాల్సి ఉండగా.. అంతలోనే ఎవరూ ఊహించని సంఘటన జరిగింది. పెళ్లి షాపింగ్‌కు వెళ్లొస్తామని చెప్పి అత్త, అల్లుడు పారిపోయారు. 2.5 లక్షల నగదు, బంగారాన్ని కూడా ఎత్తుకెళ్లారు. చివరికి ఆ పారిపోయిన మహిళ భర్త దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.  

Also Read: ట్రంప్‌ టారిఫ్‌ దెబ్బకి మెరుగుపడుతున్న భారత్-చైనా సంబంధాలు

telugu-news | rtv-news | national-news | uttar-pradesh

 

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు