/rtv/media/media_files/2025/01/12/sZypfw6tf2qbeb8YafCV.jpg)
Bijapur Maoist Photograph: (Bijapur Maoist )
Encounter: ఒడిశా - ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో మంగళవారం భారీ ఎన్‌కౌంటర్ జరిగిన విషయం తెలిసిందే. అందులో మృతి చెందిన మావోయిస్టుల సంఖ్య 27కు చేరింది. చనిపోయిన వారిలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. కోబ్రా, డీఆర్జీ, సీఆర్పీఎఫ్ బలగాలు గరియాబంద్ ప్రాంతంలో మావోయిస్టు ఏరివేత ఆపరేషన్ నిర్వహించాయి. ఈ ఎన్కౌంటర్లో మంగళవారం మధ్యాహ్నాన్నికి 20 మంది మవోస్టుల మృతదేహాలు లభ్యమవ్వగా.. సాయంత్రానికి మరో 7 మృతదేహాలు పోలీసులు గుర్తించారు.
Read also ; ఛత్తీస్‌ఘడ్ ఎన్‌కౌంటర్‌లో నల్గొండ వాసి మృతి.. ఆ గ్రామంలో విషాద ఛాయలు!
ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు అగ్రనేతలు మృతి చెందినట్లుగా తెలుస్తోంది. సెంట్రల్ కమిటీ సభ్యుడు మనోజ్, ఛత్తీస్‌గఢ్ మావోయిస్ట్ పార్టీ ఇంఛార్జ్ జయరాం అలియాస్ చలపతి పాటు మరో కీలక అగ్రనేత వీరిలో ఉన్నారని సమాచారం. ఎన్‌కౌంటర్ అనంతరం.. భారీగా ఆయుధాలు, వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టుల అంతమే లక్ష్యంగా కోబ్రా, డీఆర్జీ, సీఆర్పీఎఫ్ (CRPF), ఒడిశా SOG బలగాలు చేపట్టిన ఈ ఆపరేషన్‌లో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు మృతిచెందారని అధికారులు తెలిపారు.