/rtv/media/media_files/2025/02/13/Rt47ytBA5Ug42nJo0DFm.jpg)
Dalai Lama gets Z-category security
కేంద్ర హోం మంత్రిత్వశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు దలైలామా (89)కు జడ్ కేటగిరి భద్రతను ఏర్పాటు చేసింది. చైనా మద్దతుదారుల నుంచి ఆయనకు ముప్పు ఉన్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి సమాచారం అందింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ క్రమంలోనే ఆయనకు జడ్ కేటగిరి భద్రతను ఏర్పాటు చేసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
Also Read: అయోధ్య ప్రధాన అర్చకులు సత్యేంద్ర దాస్ అంత్యక్రియలు.. సరయూ నదిలో జల సమాధి
ఇక వివరాల్లోకి వెళ్తే.. హిమాచల్‌ప్రదేశ్‌లోని ధర్మశాలలో ఉన్న దలైలామా నివాసం ఉంటుంది. అక్కడే జడ్ కేటగిరి భద్రతను కేంద్రం ఏర్పాటు చేసింది. దీంతో పాటుగా అదనంగా ట్రైనింగ్ తీసుకున్న డ్రైవర్లు, నిఘా సిబ్బంది ఉంటారు. అయితే చైనా పాలనను వ్యతిరేకించిన దలైలామా 1959 నుంచి భారత్‌తోనే ఉంటున్నారు. భౌగోళిక, రాజకీయాల ఉద్రిక్తతల అంశాన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్రం ఆయనకు భారీ భద్రతను కల్పించింది.
Also Read: యూట్యూబర్ వివాదాస్పద వ్యాఖ్యలు.. పార్లమెంటరీ ప్యానెల్ కీలక నిర్ణయం
మరో విషయం ఏంటంటే చైనా మద్దతు గల వ్యక్తులు, సంస్థలతో దలైలామాకు ముప్పు ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే భిన్న సంప్రదాయాల ప్రాముఖ్యతను చైనా అర్థం చేసుకోలేదని గతంలో దలైలామా విమర్శించిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా అక్కడ హాన్ వర్గ ఆధిపత్యం ఎక్కువగా ఉంటందని ఆయన విమర్శించారు. అలాగే తోటి వ్యక్తిగా తనకు చైనా ప్రజలపై ఎలాంటి వ్యతిరేకత లేదని అన్నారు. ఇకనుంచి భారత్‌లోనే ఉంటానంటూ తేల్చిచెప్పారు. అయితే ఆయనకు భద్రతకు ముప్పు పొంచిఉన్న నేపథ్యంలో కేంద్రం భద్రతా ఏర్పాట్లు చేసింది.
Also Read: ‘నాన్న క్షమించండి.. మీ కలల్ని నెరవేర్చలేకపోయా’: జేఈఈ విద్యార్థిని సూసైడ్!
Also Read: ఢిల్లీ సీఎం ఎంపిక అప్పుడే.. ఇద్దరికి డిప్యూటీ సీఎంలుగా ఛాన్స్..!