/rtv/media/media_files/2026/04/17/constitution-amendment-bill-fails-2026-04-17-20-00-04.jpg)
Constitution Amendment Bill Fails To Pass Lok Sabha Test, 2 Other Bills Dropped
కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయింది. ఓటింగ్‌లో 528 మంది ఎంపీలు పాల్గొనగా కేంద్రానికి అనుకూలంగా 298 ఓట్లు వచ్చాయి. వ్యతిరేకంగా 230 మంది ఓటేశారు. రాజ్యంగ సవరణ బిల్లుకు ఓట్లు రాకపోవడంతో డీలిమిటేషన్, కేంద్రపాలిత ప్రాంతాల చట్ట సవరణ బిల్లులను కూడా వెనక్కి తీసుకున్నట్లు స్పీకర్ ఓం బిర్లా తెలిపారు. దీంతో ఈ మూడు బిల్లులకు ఆమోదం లభించకుండా పోయింది. ఫలితంగా మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ అమలుకు బ్రేక్ పడింది. దేశవ్యాప్తంగా లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇక సీట్ల పెంపు ఉండదు.
Follow Us