BIG BREAKING: ముగ్గురు MLAలను బహిష్కరించిన కాంగ్రెస్!

ఒడిశాలోని కాంగ్రెస్‌ పార్టీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీజేపీ బలపరిచిన స్వతంత్ర అభ్యర్థికి రాజ్యసభలో ఓటు వేసిన ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను పార్టీ సస్పెండ్ చేసింది.

New Update
Congress suspends 3 Odisha MLAs for voting for BJP-backed Rajya Sabha candidate

Congress suspends 3 Odisha MLAs for voting for BJP-backed Rajya Sabha candidate

ఒడిశాలోని కాంగ్రెస్‌ పార్టీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీజేపీ బలపరిచిన స్వతంత్ర అభ్యర్థికి రాజ్యసభలో ఓటు వేసిన ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను పార్టీ సస్పెండ్ చేసింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలులు రమేశ్ చంద్ర జెనా, దశరథి గోమాంగో, సోఫియా ఫిర్డోస్‌ అనే ముగ్గురు ఎమ్మెల్యేలు సోమవారం జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ మద్దతుతో బరిలోకి దిగిన అభ్యర్థి దిలీప్‌ రాయ్‌కు ఓటు వేశారు. 

Also Read: మహారాష్ట్ర అసెంబ్లీ కీలక నిర్ణయం..మత మార్పిడికి పాల్పడితే 7 ఏళ్ల జైలు శిక్ష!

ఈ క్రమంలోనే ఒడిశాలోని కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ ముగ్గురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసింది. పార్టీ ప్రయోజనాలకు విరుద్ధంగా పనిచేసినందుకు వారిపై ఈ చర్యలు తీసుకున్నామని రాష్ట్ర కాంగ్రెస్ మీడియా సెల్‌ ఛైర్‌పర్సన్ అరబిందా దాస్‌ వెల్లడించారు. అసెంబ్లీ నుంచి వాళ్లపై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌ కూడా తెలయజేస్తామని పేర్కొన్నారు. మరోవైపు ఒడిశా కాంగ్రెస్ అధ్యక్షుడు భక్త చరణ్ దాస్ మాట్లాడుతూ.. ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు ఇంతటి మోసపూరిత చర్యలకు పాల్పడతారని ఊహించలేదన్నారు. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్‌ ప్రకారం వాళ్లపై అసెంబ్లీ నుంచి అనర్హత వేటు వేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే తాము తీసుకున్న నిర్ణయాన్ని హైకమాండ్‌ అభినందించనట్లు పేర్కొన్నారు. 

Also Read: కేరళ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. రంగంలోకి LDF యోధులు.. పినరయి విజయన్ పోటీ ఇక్కడే!

ఈ ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాత్రమే కాకుండా 8 బీజేడీ ఎమ్మెల్యేలు కూడా దిలీప్ రాయ్‌కు అనుకూలంగా ఓటు వేశారు. దీంతో బీజేడీ అభ్యర్థి అయిన దత్తేశ్వర్ హోటాపై దిలీప్‌ రాయ్‌ రాజ్యసభ ఎంపీగా గెలిచారు. వాస్తవానికి కాంగ్రెస్ బీజేడీ అభ్యర్థికి సపోర్ట్ చేసింది. కానీ కాంగ్రెస్‌లోని ముగ్గురు ఎమ్మెల్యేలు, బీజేడీ నుంచి 8 మంది ఎమ్మెల్యేలు బీజేపీ అభ్యర్థికి ఓటు వేయడం రాజకీయంగా దుమారం రేపింది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ తమ ముగ్గురు ఎమ్మెల్యేలను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. 

Advertisment
తాజా కథనాలు