మా నాన్న చనిపోతే ఏం చేశారు.. కాంగ్రెస్‌పై ప్రణబ్ ముఖర్జీ కూతురు సంచలన ఆరోపణలు..

భారత దివగంత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కూతురు శర్మిష్ట ముఖర్జీ కాంగ్రెస్‌ పార్టీపై తీవ్ర ఆరోపణలు చేశారు. తన తండ్రి మరణించిన తర్వాత ఆయనకు నివాళులర్పించేందుకు కనీసం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయలేకపోయారని విమర్శించారు.

New Update
sharmistha mukherjee

sharmistha mukherjee

భారత దివగంత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కూతురు శర్మిష్ట ముఖర్జీ కాంగ్రెస్‌ పార్టీపై తీవ్ర ఆరోపణలు చేశారు. తన తండ్రి మరణించిన తర్వాత ఆయనకు నివాళులర్పించేందుకు కనీసం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయలేకపోయారని విమర్శించారు. ఈ మేరకు ఎక్స్‌ వేదికగా దీనికి సంబంధించి ట్వీట్ చేశారు. '' మా నాన్న మరణించిన సమయంలో కాంగ్రెస్.. సీడబ్యూసీ సమావేశాన్ని ఏర్పాటు చేయలేదు. ఓ సీనియర్ నేత రాష్ట్రపతులకు ఇలా సీడబ్యూసీ మీటింగ్‌లో నివాళులు అర్పించడం లేదని చెప్పారు. కానీ మా నాన్న డైరీని చదివినప్పుడు అది అబద్ధమని తెలిసింది. 

Also Read: 2024లో అంతర్జాతీయంగా ప్రభావితం చేసిన ముఖ్య విషయాలు..

మాజీ రాష్ట్రపతి కేఆర్‌ నారాయణ మరణించాక సీడబ్యూసీ మీటింగ్ ఏర్పాటు చేసి ఆయనకు నివాళులర్పించినట్లు ఆ డైరీలో రాసుంది. ఇది మా నాన్న ఆధ్వర్యంలోనే జరిగిందని'' శర్మిష్ట రాసుకొచ్చారు.  అంతేకాదు ఆ సమయంలో ఈ అంశంపై కాంగ్రెస్ తనను తప్పుదోవ పట్టించిందని కూడా ఆరోపించారు.  మరోవైపు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ కోసం స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కాంగ్రెస్ కోరడాన్ని శర్మిష్ట సమర్థించారు. ''మన్మోహన్ సింగ్ కోసం స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేయడం గొప్ప ఆలోచన. ఇందుకు ఆయన అర్హుడు. మా నాన్న రాష్ట్రపతిగా ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్‌కు భారత రత్న ఇవ్వాలని కూడా కోరారు. కానీ పలు కారణాల వల్ల ఇది జరగలేదని'' తెలిపారు.  

Also Read: వామ్మో చలి.. మరోవైపు భారీ వర్షం..15ఏళ్ల రికార్డు బద్దలు.. ఢిల్లీలో చాలా కష్టం భయ్యా!

ఇదిలాఉండగా.. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌(92) గురువారం మరణించిన సంగతి తెలిసిందే. ఆ రోజు సాయంత్రం ఆయన తీవ్ర అస్వస్థకు గురికావడంతో కుటుంబ సభ్యులు ఢిల్లీలో ఎయిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. చికిత్స తీసుకుంటుండగానే ఆయన తుదిశ్వాస విడిచారు. శనివారం ఆయనకు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. మరోవైపు దేశవ్యాప్తంగా ప్రజలు ఆయనకు సంతపం తేలియజేస్తున్నారు. కేంద్ర ఆర్థికశాఖ మంత్రిగా, ప్రధానిగా ఉన్నప్పుడు ఆయన చేసిన సేవలను స్మరించుకుంటున్నారు.  

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Nitish Kumar: డిప్యూటీ ప్రధానిగా నితీశ్‌ కుమార్ !.. బీజేపీ సీనియర్ నేత సంచలన వ్యాఖ్యలు

జేడీయూ అధినేత నితీశ్‌ కుమార్‌ను తాను ఉప ప్రధానమంత్రిగా చూడాలని కోరుకుంటున్నాని బీజేపీ సీనియర్ నేత అశ్వినీ కుమార్ చౌబే అన్నారు. ఎన్డీయే ఆయన చేసిన సేవలను గుర్తించి ఈ పదవి ఇవ్వాలన్నారు. దీంతో నితీశ్‌ ఉప ప్రధాని అవుతారా అనే వార్తలు చర్చనీయాంశవుతున్నాయి.

New Update
Nitish Kumar

Nitish Kumar

బీహార్‌ సీఎం నితీశ్‌ కుమార్‌ ఉప ప్రధాని అవుతారా అనే వార్తలు చర్చనీయాంశవుతున్నాయి. దీనికి కారణం బీజేసీ సీనియర్ నేత చేసిన వ్యాఖ్యలే. మాజీ కేంద్రమంత్రి అయిన అశ్వినీ కుమార్ చౌబే తాజాగా మీడియాతో మాట్లాడారు.  జేడీయూ అధినేత నితీశ్‌ కుమార్‌ను తాను ఉప ప్రధానమంత్రిగా చూడాలని కోరుకుంటున్నాని తెలిపారు. '' NDAకు నితీశ్‌ కుమార్ ఎంతో సేవ చేశారు. సంకీర్ణ ప్రభుత్వంలో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సేవలను గుర్తించి ఆయనకు డిప్యూటీ పీఎం పదవి ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. 

Also Read: రేప్ కేసులో ట్విస్ట్.. అంతా ఆమె ఇష్టపూర్వకంగానే జరిగిందని నిందితుడికి బెయిల్ ఇచ్చిన హైకోర్టు

ఇలాంటిది జరిగిదే బీహార్‌ నుంచి ఆ స్థానానికి చేరిన రెండో వ్యక్తిగా నితీశ్‌ కుమార్‌ నిలుస్తారని'' అశ్వినీ కుమార్ చౌబే అన్నారు. అయితే గతంలో బీహార్‌ నుంచి ఉప ప్రధానమంత్రిగా బాబు జగ్జీవన్ రామ్ పనిచేశారు.  ఇదిలాఉండగా ఈ ఏడాది చివర్లో బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. నీతిశ్ ఈసారి కూడా ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నారు. గత రెండు దశాబ్దాలుగా నితీశ్‌ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే సీఎం పదవిపై ఆశతో ఆయన మళ్లీ కూటమి నుంచి వెళ్లిపోయే ప్రయత్నం చేస్తారనే విమర్శలు వస్తున్నాయి. 

Also Read: మరో పరువు హత్య.. వేరే కులం వ్యక్తితో పారిపోయిందని కూతుర్ని హతమార్చిన తండ్రి

ప్రస్తుతం బీహార్‌ రాజకీయాల్లో బీజేపీ రెండో స్థానంలో ఉంది. దీంతో ఆ పార్టీ నితీశ్ కుమార్‌ను పక్కన పెట్టాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే నితీశ్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించేందుకు బీజేపీ ఆసక్తి చూపించడం లేదని ఇటీవల ఎన్నికల స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యానించారు. ఈ పరిణామాల మధ్య బీజేపీ నేత తాను నితిశ్‌ కుమార్‌ను డిప్యూటీ పీఎంగా చూడాలనుకుంటున్నాని చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది. 

Also Read: తెలంగాణలో భారీ వర్షం.. ఈదరు గాలులతో హైదరాబాద్‌ అతలాకుతలం

Advertisment
Advertisment
Advertisment