/rtv/media/media_files/2025/02/11/R1SSbk4mo9pScNPb93cM.jpg)
Maha Kumbh Mela
Maha Kumbh Mela : యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాకు భక్తుల రద్దీ కొనసాగుతోంది. మహా కుంభమేళాను సందర్శించి, త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వెళుతున్నారు. ఫిబ్రవరి 26తో కుంభమేళా ముగియనుండటంతో భక్తులు పెద్ద ఎత్తున ప్రయాగ్‌రాజ్ చేరుకుంటు న్నారు. దీంతో ప్రయాగ్‌రాజ్ కు వెళ్లే మార్గాల్లో భారీ ట్రాఫిక్ జాం నెలకొంటున్నది. రోడ్లపై వాహనాలు బారులు తీరాయి. ఎక్కడికక్కడ వాహనాలు కదలకుండా నిలిచిపోవడంతో భక్తులు గంటల కొద్ది నడి రోడ్ల మీదనే వేచి చూడాల్సి వస్తుంది. ట్రాఫిక్ ను అదుపు చేసేందుకు అధికారులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ముఖ్యంగా జబల్‌పుర్ -ప్రయాగ్‌రాజ్ మార్గంలో వాహనాలు పెద్ద ఎత్తున నిలిచిపోయాయి.
ఇది కూడా చూడండి: Maha Kumbh mela: మహా కుంభమేళాకు భారీగా తరలి వచ్చిన భక్తులు...కాశీలోనే ఆంక్షలు విధించిన అధికారులు!
మరోవైపు రైళ్లు కూడా ప్రయాణీకులతో నిండిపోయాయి. బీహార్‌లో రైళ్లన్నీ పూర్తిగా నిండిపోయాయి. రైల్లో కూర్చునేందు కు స్థలం దొరకకపోవడంతో భక్తులు రైళ్లపై దాడులు చేస్తున్నారు. రైలులో ఎలాగైనా ఎక్కాలనే ఆతృతతో స్వతంత్ర సేనాని సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలులోని ఏసీకోచ్‌ల అద్దాలు పగుల గొట్టారు. ఈ సందర్భంగా పలువురికి గాయాలు కూడా అయ్యాయి. జయనగర్ నుంచి న్యూఢిల్లీ్కి వెళ్లే ఈ సూపర్ ఫాస్ట్ రైలు జనరల్ బోగినుంచి ఏసీ బోగి వరకూ అన్ని నిండిపోయాయి. కనీసం కాలు పెట్టేందుకు కూడా ఖాళీ లేకుండా పోవడంతో ప్రయాణీకులు ఇబ్బందులు పడ్డారు.
ఇది కూడా చూడండి: Telangana Beers : పెరిగిన బీర్ల ధరలు.. లైట్, స్ట్రాంగ్ ఎంత? .. ప్రభుత్వానికి ఎంత ఆదాయం ?
బయటి ప్రయాణీకుల రద్దీని గమనించిన రైలులో ఉన్నవారు తలుపులు మూసి వేశారు. మధుబని స్టేషన్‌లో రైలుకోసం ఎదురు చూస్తున్న ప్రయాణీకులకు ఈ ఘటన కోపం తెప్పించింది. అసహనంతో ఏసీ బోగిల అద్దాలు పగలుగొట్టి కిటీకిల గుండా రైల్లోకి ఎక్కారు.. ఈ ఘటనతో రైలు ఆలస్యంగా బయలుదేరింది.
Also Read: Dhanush: 'జాలిగా రండీ.. జాలీగా వెళ్లండి'.. ధనుష్ మూవీ ట్రైలర్ భలే ఉందిగా.. చూశారా?
కుంభమేళాకు వెళ్తున్నవారు పక్కనే ఉన్న వారణాసి, అయోధ్యలకు భక్తులు పోటెత్తుతున్నారు. లక్షల మంది భక్తులు ఈ రెండు దేవాలయాలకు క్యూ కట్టారు. దీంతో కాశీలో పలు ప్రాంతాల్లో వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించారు. ఇదిలా ఉండగా.. వాహనాల రద్దీని దృష్టిలో ఉంచుకొని రెండు రోజుల పాటు ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లొద్దని, మధ్యప్రదేశ్ సీఎం మోహన్‌యాదవ్ ప్రజలకు సూచించారు. ట్రాఫిక్ జాం దృష్ఠ్యా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుందని, ప్రయాగ్ రాజ్ వెళ్లే భక్తులు దయచేసి ఆలోచన చేయాలని ముఖ్యమంత్రి సలహా ఇచ్చారు. కాగా ప్రయాగ్ రాజ్‌లో ఇప్పటివరకు 44 కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించినట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 26 నాటికి ఈ సంఖ్య 50 కోట్లకు చేరుకోవచ్చని అంచనా వేస్తున్నారు.
Also Read: మావోయిస్టులపై లాస్ట్ ఆపరేషన్.. PLGA ఆవాసంలోకి చొచ్చుకెళ్లిన భద్రతా బలగాలు!