గ్యాస్ వినియోగదారులకు బిగ్ షాక్.. కమర్షియల్ సిలిండర్ ధర రూ.993 పెంపు

పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ ప్రభావం భారత్‌పై కూడా పడింది. చమురు సంక్షోభం వల్ల కేంద్ర ప్రభుత్వం మరోసారి కమర్షియల్ ధరలు భారీగా పెంచేసింది. 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధరపై ఏకంగా రూ.993 పెరిగింది.

New Update
Commercial LPG Prices Hiked By Rs 993 Amid War

Commercial LPG Prices Hiked By Rs 993 Amid War

పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ ప్రభావం భారత్‌పై కూడా పడింది. చమురు సంక్షోభం వల్ల కేంద్ర ప్రభుత్వం మరోసారి కమర్షియల్ ధరలు భారీగా పెంచేసింది. 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధరపై ఏకంగా రూ.993 పెరిగింది. పెరిగిన ధరలు శుక్రవారం నుంచే అమల్లోకి వస్తాయని కేంద్రం తెలిపింది. దీంతో ఢిల్లీలో కమర్షియల్ సిలిండర్ ధర రూ.3,071కు చేరింది. ఈ ఏడాది జనవరి 1 నుంచి ఇప్పటిదాకా కమర్షియల్ సిలిండర్ ధరలు పెరగడం ఇది ఆరోసారి. తాజా పెంపు వల్ల హోటళ్లు, రెస్టారెంట్లపై తీవ్రంగా ఎఫెక్ట్ చూపించనుంది. దీంతో పుడ్ ఐటెమ్స్ ధరలు కూడా భారీగా పెరిగే అవకాశాలున్నాయి. 

19 కేజీల కమర్షిల్ సిలిండర్‌ ధర రూ.993 పెరగడంతో ఢిల్లీలో దీని ధర 3,071కి చేరగా.. ముంబైలో 3,024కు పెరిగింది. ఫిబ్రవరి 28న ఇరాన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఈ సిలిండర్‌ ధరలను మూడుసార్లు పెంచారు. మార్చిల1 చమురు సంస్థలు రూ.114 పెంచగా, ఏప్రిల్‌ 1న రూ.195 పెంచాయి. తాజాగా రూ.993 పెరిగింది. దీంతో కేవలం మూడు నెలల వ్యవధిలోనే వాణిజ్య సిలిండర్ ధర రూ.1,303 పెరగడం గమనార్హం. 

Also Read: తమిళనాడు రాజకీయాల్లో సంచలనం.. కింగ్‌ మేకర్‌గా మారనున్న విజయ్..

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOC)  ప్రకారం.. 2008లో ఢిల్లీలో కమర్షియల్ LPG సిలిండర్ ధర రూ. 831 ఉండేది. ఆ తర్వాతి ఏడాది 2009లో అనూహ్యంగా రూ.658.22 తగ్గింది. అప్పటి నుంచి క్రమంగా కమర్షియల్ సిలిండర్ ధరలు పెరుగుతూ వస్తున్నాయి. ప్రతి నెలా చమురు కంపెనీలు ఈ ధరలను సమీక్షిస్తుంటాయి. ప్రస్తుతం పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధం వల్ల ఇంధన సరఫరా గొలుసులు దెబ్బతిన్నాయి. దీంతో గ్లోబల్ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు 50 శాతం పైగా పెరిగిపోయాయి. తాజా గ్యాస్ ధరలు కూడా అమాంతం పెరడానికి ఇదే కారణం.

వాణిజ్య సిలిండర్ల ధరల పెంపుపై హోటళ్లు, రెస్టారెంట్ల యాజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంత పెద్ద మొత్తంలో ధరలు పెంచడం వల్ల తాము ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తుందని వాపోతున్నారు. ప్రభుత్వం వీటి ధరలను తగ్గించే దిశగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మరోవైపు పెట్రోల్, డీజిల్ ధరల్లో మాత్రం ఎలాంటి మార్పులు లేవు. ప్రస్తుతం ఈ ధరలు యథాతథంగా కొనసాగుతున్నాయి. దేశీయ విమానయాన సంస్థలకు సైతం ఊరటనిచ్చేలా ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ATF) ధరల్లో కూడా ఎలాంటి మార్పులు లేవని ప్రభుత్వం స్పష్టం చేసింది. 

Also Read: శత్రువుల గుండెల్లో వణుకు పుట్టిస్తున్న Iran హూట్ టార్పెడో..  నీటి అడుగున బుల్లెట్ వేగంతో అటాక్!

Advertisment
తాజా కథనాలు