/rtv/media/media_files/2025/02/18/NYw9GbjK9rGNHASayA9V.jpg)
Coliform bacteria Photograph: (Coliform bacteria)
Kumbh Mela: మహా కుంభమేళాలో నీళ్లు కలుషితమైయ్యాయని సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్(Central Pollution Control Board) తెలిపింది. ఉత్తరప్రదేశ్ ప్రయాగ్‌రాజ్(Uttar Pradesh Prayagraj)లో నెల రోజులుగా మహాకుంభమేళా జరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది హిందువులు, సాధువులు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ప్రయాగ్‌రాజ్‌లో గంగా, యమునా నదుల్లో మురుగు నీటిని, వ్యర్థాలను వదలకుండా నిరోధించాలని కోరుతూ పిటిషన్ దాఖలైంది.
Some one should culture the water pre and post kumbh mela… they will find zillions of germs …. pic.twitter.com/Q6fNzHsHZo
— unitetheworld (@jasmvk) February 11, 2025
Also Read : నాకు రోజుకో అమ్మాయి.. ఇప్పటికే 400 మందితో చేశా.. కిరణ్ రాయల్ సంచలన ఆడియో!
పిటిషన్‌లపై జస్టిస్ ప్రకాష్ శ్రీవాస్తవ, జస్టిస్ శ్రీధర్ అగర్వాల్, జస్టిస్ ఎ సెంథిల్ వేల్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈక్రమంలో కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి జాతీయ హరిత ట్రిబ్యునల్‌కు సమర్పించిన నివేదికలోని విషయాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రయాగ్‌రాజ్‌లోని పలు చోట్ల నదీ జలాలు కలుషితమయ్యాయని.. ఆ నీళ్లలో మానవ, జంతు సంబంధిత మల వ్యర్థాల్లో ఉండే కోలీఫామ్ బ్యాక్టీరియా విపరీతంగా పెరిగిపోయిందని తెలిపింది.
AI or Real??? 🤢
— Dhruv Rathee (Parody) (@dhruvrahtee) February 18, 2025
pic.twitter.com/nnaYJGpZeN
Also Read: సీఈసీగా జ్ఞానేష్ వద్దు.. కాంగ్రెస్ అభ్యంతరం చెప్పడానికి కారణం ఇదే?
తదుపరి విచారణను ఫిబ్రవరి 19కి వాయిదా..
ప్రయాగ్‌రాజ్ ప్రాంతంలోని గంగా, యమునా నదీ నీళ్లు స్నానం చేయడానికి పనికిరావని, కావాల్సిన ప్రమాణాలు లేవని NGT కి సమర్పించిన నివేదికలో CPCB పేర్కొన్నది. ఒక 100 మిల్లీలీటర్ల నీటిలో 2,500 కోలిఫామ్ బ్యాక్టీరియా ఉన్నా ఆ నీటితో స్నానం చేయవచ్చిన పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ చెబుతోంది. అయితే అంతకుమించి ఉంటే చర్మ సంబంధ అనారోగ్యాలు తలెత్తుతాయని హెచ్చరించింది. ఈ నెల 3న CPCB సమర్పించిన నివేదికను NGT బెంచ్ పరిశీలించింది. కాలుష్యాన్ని నియంత్రించడంలో ఉత్తరప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు విఫలమైందని బెంచ్ వ్యాఖ్యానించింది. పిటిషన్‌పై తదుపరి విచారణను ఫిబ్రవరి 19కి వాయిదా వేశారు.
Also Read: కుంభమేళా నీళ్లలో కోలీఫామ్ బ్యాక్టీరియా.. బాంబు పేల్చిన పొల్యుషన్ కంట్రోల్ బోర్డ్
Also Read: సీఈసీగా జ్ఞానేష్ వద్దు.. కాంగ్రెస్ అభ్యంతరం చెప్పడానికి కారణం ఇదే?