వీగిపోయిన మహిళా రిజర్వేషన్ బిల్లు.. విజయం సాధించామన్న సీఎం రేవంత్, స్టాలిన్

లోక్‌సభలో 131వ రాజ్యంగ సవరణ బిల్లు వీగిపోయిన సంగతి తెలిసిందే. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. భారత చరిత్రలో గుర్తిండిపోయే క్షణమని ఎక్స్ వేదికగా తెలిపారు.

New Update
CM Revanth, Stalin Responds on Women reservation bill

CM Revanth, Stalin Responds on Women reservation bill

లోక్‌సభలో 131వ రాజ్యంగ సవరణ బిల్లు వీగిపోయిన సంగతి తెలిసిందే. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. భారత చరిత్రలో గుర్తిండిపోయే క్షణమని ఎక్స్ వేదికగా తెలిపారు. రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే నాయకత్వంలో విపక్షాలు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకున్నాయని పేర్కొన్నారు. స్టాలిన్, అఖిలేశ్ యాదవ్, మమత బెనర్జీ, శరద్‌ పవార్, ఉద్ధవ్, అరవింద్ కేజ్రీవాల్, ఫరూక్ అబ్దుల్లా, నవీన్ పట్నాయక్, కమ్యూనిస్టు పార్టీల నేతలకు సీఎం రేవంత్ ధన్యవాదాలు తెలిపారు. 

మరోవైపు ఈ బిల్లు వీగిపోవడంపై తమిళనాడు సీఎం స్టాలిన్ కూడా స్పందించారు. తమిళనాడుకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన బిల్లు పార్లమెంటులో ఓడిపోయిందన్నారు. ఈ విజయం చిన్న ట్రైలర్ మత్రమేనన్నారు. త్వరలో ఎన్నికల్లో కూడా విజయం సాధించనున్నామని తెలిపారు.    

Advertisment
తాజా కథనాలు