CM Reavnth Reddy : ఏ ఆడబిడ్డ ఇందిరమ్మ చీర రాలేదని అనొద్దు : సీఎం రేవంత్ రెడ్డి

ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేసులతో కాంగ్రెస్ అగ్ర నాయకత్వం రాహుల్ గాంధీ కుటుంబాన్ని భయభ్రాంతులకు గురిచేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని తెలంగాణ సీఎం  రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.

New Update
CM Revanth

CM Revanth

ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేసులతో కాంగ్రెస్ అగ్ర నాయకత్వం రాహుల్ గాంధీ(Rahul Gandhi) కుటుంబాన్ని భయభ్రాంతులకు గురిచేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని తెలంగాణ సీఎం  రేవంత్ రెడ్డి(cm reavnth reddy latest news) సంచలన ఆరోపణలు చేశారు. గాంధీభవన్లో మంగళవారం జరిగిన టీపీసీసీ కార్యవర్గ సమావేశంలో ఆయన కీలక ప్రసంగం చేశారు. దేశం కోసం గాంధీ కుటుంబం త్యాగం చేసిందని.  వారు దేశం కోసం తమ ఆస్తులను కూడా అమ్ముకున్నారు. అలాంటి కుటుంబాన్ని కేసులు, వేధింపులతో లొంగదీసుకోవాలని చూడడం దారుణం అని సీఎం రేవంత్ మండిపడ్డారు.

సొంత ఆస్తులతో నేషనల్ హెరాల్డ్ పత్రిక(National Herald Case) ప్రారంభించి దేశ స్వాతంత్ర్యంలో గాంధీ కుటుంబం కీలకపాత్ర పోషించింది. నేషనల్ హెరాల్డ్ ఉద్యోగుల కుటుంబాలను ఆదుకునేందుకు ఆర్థికంగా నిలబడేందుకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కృషి చేశారని చెప్పారు. తిరిగి పత్రికను పునరుద్ధరించడానికి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు అవసరమైంది. అందుకే మల్లికార్జున ఖర్గే లాంటి కాంగ్రెస్ ముఖ్య నాయకులను బోర్డు డైరెక్టర్లుగా నియమించి పత్రికను పునరుద్ధరించిందని వెల్లడించారు. ఇందులో ఏ ఒక్క రూపాయి ప్రభుత్వానికి సంబంధం లేదన్నారు సీఎం రేవంత్. నెహ్రూ వారసత్వంగా వచ్చిన ఆస్తులతో పత్రికను నడిపారని మండిడ్డారు. దీన్ని మనీ ల్యాండరింగ్ కేసు పెట్టి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ లను వేధిస్తున్నారని తెలిపారు. 

నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్ గాంధీ, సోనియా గాంధీని వేధించడం మోడీ ప్రభుత్వ వైఖరికి నిదర్శనమని చెప్పారు.  ఈ సందర్భంగా, గాంధీ కుటుంబానికి అండగా నిలబడదాం, మోడీ వైఖరిని తీవ్రంగా ఖండిద్దాం అని టీపీసీసీ కార్యవర్గానికి ఆయన పిలుపునిచ్చారు. బీహార్‌లో లక్షలాది ఓట్లను తొలిగించారు అని సీఎం రేవంత్ ఆరోపించారు. ఓట్ల చోరీని మళ్లించడం కోసమే రాహుల్‌పై అక్రమ కేసులు పెడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు.

Also Read :  పవన్ కల్యాణ్‌ తలతిక్క మాటలు మానుకో.. సినిమాలు ఆడనివ్వం.. తెలంగాణ మంత్రుల ఫైర్

కోటి మంది ఆడబిడ్డలకు

కాంగ్రెస్ ప్రభుత్వం ఆడబిడ్డల సంక్షేమానికి కట్టుబడి ఉందని సీఎం పునరుద్ఘాటించారు. కోటి మంది ఆడబిడ్డలకు ఇందిరమ్మ చీరలు ఇవ్వాలనే లక్ష్యంతో ఉన్నామని తెలిపారు. "ఏ ఆడబిడ్డ కూడా నాకు ఇందిరమ్మ చీర రాలేదని అనకూడదు. కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయడమే ఈ ప్రభుత్వం లక్ష్యం" అని ఆయన స్పష్టం చేశారు. గతంలో కేసీఆర్ ఇచ్చిన చీరలను ఆనాడు ప్రజలు తిట్టుకున్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. పార్టీ సంస్థాగత పనితీరును మెరుగుపరుచుకోవాల్సిన ఆవశ్యకత ఉందని కార్యవర్గానికి సూచించారు. చివరగా, అందరి కృషితోనే తెలంగాణ వచ్చింది అని గుర్తుచేస్తూ, పార్టీ పటిష్టతకు అందరూ కృషి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు.

సంక్షోభం, అప్పులతో ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్‌ మనకు అప్పగించారని సీఎం రేవంత్ ఆరోపించారు.అభివృద్ధి, సంక్షేమం దిశగా మనం రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పుకొచ్చారు.. ఆనాడు ఎలా ఉందో.. ఈ రోజు ఎలా ఉందో చర్చకు పెట్టండని సీఎం రేవంత్‌ రెడ్డి సవాల్ చేశారు. ఇక డిసెంబర్‌ 7న తాను ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్తున్నానని .. ఉద్దండులను అందించిన ఓయూను కేసీఆర్‌ కాలగర్భంలో కలిపారని చెప్పారు. ఓయూను ప్రపంచస్థాయిలో నిలబెడతాం.. ఉస్మానియా యూనివర్సిటీకి ఎంతైనా ఖర్చు పెడతామని చెప్పుకొచ్చారు. 

Also Read :  సమంతను వివాహమాడిన రాజ్‌.. ఎవరో తెలుసా? ఆయన నేపథ్యం ఇదీ..

Advertisment
తాజా కథనాలు