/rtv/media/media_files/2025/03/20/WQJCghAE1GHT8Bg0iTDY.jpg)
Baby selling gang arrested
Children Selling Gang : పసి పిల్లలను ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా తీసుకొచ్చి హైదరాబాద్‌లో విక్రయిస్తున్న ముఠాకు చెందిన నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముఠాతో సంబంధమున్న 11 మంది నిందితులను గత నెలలోనే కటాకటాల్లోకి నెట్టారు. అయితే కస్టడీలో వారిచ్చిన సమాచారం మేరకు తాజాగా మరో 9 మంది దళారులు, చిన్నారులను కొనుగోలు చేసిన 18 మంది తల్లిదండ్రులను అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 21 మంది చిన్నారులను అక్రమంగా విక్రయించినట్లు గుర్తించిన పోలీసులు.. అందులో 10 మందిని రక్షించారు. మిగిలిన వారి ఆచూకీ కోసం వెతుకుతున్నారు. ‘ఈ వ్యవహారంలో తొలుత అరెస్టయిన కృష్ణవేణి, వందనలను విచారించగా.. ప్రధాన నిందితురాలు మలక్‌పేటకు చెందిన ఆశా వర్కర్ సోము అమూల్య (29) పేరు వెలుగులోకి వచ్చింది.
ఇది కూడా చూడండి: PAK Vs BLA: రెండు ముక్కలుగా పాక్.. మరో దేశంగా అవతరించనున్న బలూచ్!
కస్టడీలోకి తీసుకుని కోలా క్రిష్ణవేణి, దీప్తీ, గుజరాత్ కు చెందిన వందనలను విచారించినప్పుడు పోలీసులు అమూల్య పేరు కొత్తగా వినపడింది. దీంతో ఆమె గురించి ఆరా తీశారు. అమూల్య హైదరాబాద్ అజంపుర యూ పిహెచ్ సి లో ఆశా వర్కర్ గా పని చేస్తుంది. 2011 లో వివాహం చేసుకున్న అమూల్య భర్తను వదిలేసి కూతురితో ఒంటరిగా జీవిస్తుంది. ఈ క్రమంలో మలక్ పేట్ ఏరియా ఆస్పత్రిలో సూపర్ వైజర్ గా పనిచేస్తున్న ఇస్మాయిల్ పరిచయమయ్యాడు. అతను ఎవరికైనా పిల్లలు కావాలంటే చెప్పమన్నాడు. దీంతో తన బంధువైన సుగుణమ్మకు అవసరం ఉందని చెప్పడంతో ఇస్మాయిల్ పసి పిల్లను తెచ్చి ఇచ్చాడు. ఇలా అతనితో కొందరిని విక్రయించిన అమూల్యకు దీప్తి, కోలా క్రిష్ణ వేణి లింక్ దొరికింది. దీంతో అమూల్య 8 మంది శిశువులను, దీప్తీ 10 మంది శిశువులను, కోలా క్రిష్ణావేణి 3 శిశువులను అక్రమంగా అమ్మేశారని కస్టడీ విచారణలో తేలింది. దీంతో అమూల్యను బుధవారం అరెస్టు చేసి 10 మంది పసిపిల్లలను కాపాడారు. సోషల్ మీడియా ద్వారా ఇతర రాష్ట్రాల వారినీ పరిచయం చేసుకుని దందా కొనసాగించారు. ఈ నేపథ్యంలోనే వారందరినీ గుర్తించి అరెస్టు చేశాం’ అని సీపీ వివరించారు. చట్టబద్ధంగా శిశువులను దత్తత తీసుకోవాలని సూచించారు. అక్రమంగా శిశువులను కొనుగోలు చేయడం, అమ్మడం నేరమని హెచ్చరించారు.
ఇది కూడా చూడండి: WPL 2025 : ఢిల్లీ బ్యాడ్ లక్.. మూడోసారి కూడా ఫైనల్లో ఓటమే!
కోలా క్రిష్ణ వేణి , దీప్తీ, అమూల్యలు మహరాష్ట్రలోని ముంబాయి, అమరావతి, ఉత్తర్ ప్రదేశ్ లోని కాన్ పూర్, ఛత్తీస్ ఘడ్ లోని రాయ్ పూర్, తెలంగాణలో హైదరాబాద్ లో పసి పిల్లలను కొనుగోలు చేస్తున్నారు. ఆ తర్వాత వెస్ట్ బెంగాల్ లోని కోల్ కత్తా, తమిళ నాడు లో చెన్నై, కర్ణాటక లో బెంగళూరు, హైదరాబాద్, ఏపీ లో గుంటూరు ప్రాంతాల్లో అమ్మేస్తున్నారు. మగ శిశువును 4---5 లక్షలకు కొనుగొలు చేసి 6 లక్షలకు అమ్మేస్తున్నారు. ఆడ శిశువును 3 లక్షలకు కొనుగొలు చేసి 4 లక్షలకు విక్రయిస్తున్నారని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఇలా దేశవ్యాప్తంగా కోలా క్రిష్ణవేణి మూఠా ఏజెంట్ ల నెట్ వర్క్ ను ఏర్పాటు చేసుకుని అక్రమంగా పసి పిల్లలను కొనుగోలు చేసి విక్రయిస్తున్నారు.
Also Read: పూరీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విజయ్ సేతుపతి..!
కోలా క్రిష్ణవేణి గ్యాంగ్ నలుగురిని కాదు ఏకంగా 25 మంది పసిపిల్లలను అమ్మేశారు. దాదాపు నెల రోజుల కిందట చైతన్యపురిలో ఓ మగ శిశువును అమ్మేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో రాచకొండ మాల్కాజిగిరి ఎస్ఓటీ, చైతన్యపురి పోలీసులు కోలా క్రిష్ణవేణి గ్యాంగ్ ను అరెస్ట్ చేసి నలుగురు పిల్లలను కాపాడిన విషయం తెలిసిందే. ఈ నిందితులను తిరిగి కస్టడీలోకి తీసుకుని విచారించినప్పుడు మరో 21 మంది పసిపిల్లల విక్రయాల భాగోతం వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి మరో 10 మంది పసిపిల్లలను కాపాడారు. ఇలా మొత్తం రాచకొండ పోలీసులు ఇప్పటి వరకు 14 మంది పసి పిల్లలను కాపాడి వారిని దత్తతకు తీసుకున్న తల్లిదండ్రులను జైలుకు పంపారు.
Also read: Manipur riots: మణిపూర్‌లో మళ్లీ ఘర్షణ.. ఈసారి హమర్, జోమి తెగల మధ్య గొడవలు
పోలీసులు మరో 11 మంది పసి పిల్లలను కాపాడేందుకు దర్యాప్తును ముమ్మరం చేశారు. బుధవారం అరెస్టైన వారిలో అమూల్య, వైశాలి భీమ్ రావు, జానాపల్లి కార్తీక్ , సజ్జన్ అగర్వాల్ , బానాల మంగయ్య, బోడాసు నాగరాజు, రామారాం అశొక్, షేక్ ఇస్మాయిల్, మాచర్ల వంశీకృష్ణ లు ఉన్నారు. ఇంకా ఈ పసిపిల్లలను కొనుగోలు చేసి దత్తత తీసుకున్న 17 మంది తల్లిదండ్రులను పోలీసులు అరెస్టు చేశారు. పుట్టిన రెండు, మూడు రోజుల పసి శిశువులను వీరు కొనుగోలు చేస్తారని విచారణలో తెలిసింది. వీరికి విక్రయిస్తున్న ఏజెంట్ లు కు ఈ పసి పిల్లలను ఆర్ధికంగా సతమతమవుతున్న వారి నుంచి తీసుకు వస్తున్నారని తెలుస్తోంది. కిడ్నాప్ కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: స్పీడ్ పెంచేసిన డ్రాగన్ బ్యూటీ.. మళ్ళీ ఆ హీరోతో రిపీట్..