Rajinikanth : చెన్నైలో భారీ వర్షాలు.. వరదల్లో చిక్కుకున్న రజినీకాంత్! భారీ వర్షాల కారణంగా చెన్నై అతలాకుతలం అయింది. నగరంలోని కొన్ని ఇల్లు, రోడ్లు నీటమునిగాయి. రావణ వ్యవస్థ స్తంభించింది. ఈ వర్షాలకు నటుడు రజినీకాంత్ నివాసం కూడా నీటమునిగింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. By V.J Reddy 16 Oct 2024 in నేషనల్ సినిమా New Update షేర్ చేయండి Rajinikanth Home: చెన్నైలో వర్షాలు బాంబేలిస్తున్నాయి. రెండ్రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు చెన్నైలో 300 ప్రాంతాలు జలమయం అయ్యాయి. తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో చెన్నైలో రెడ్ అలర్ట్ కొనసాగుతోంది. వరద తాకిడితో చెన్నై-వేళచ్చేరి ఫ్లైఓవర్‌పై కారులు పార్కింగ్ చేశారు. కాగా ఈ వర్షాలకు చెన్నై నగరంలో మొత్తం నీటమునిగింది. పేదోడి గుడిసే నుంచి ప్రముఖుల విలాసవంతమైన భవనాలను కూడా వర్షాలు నీటితో కప్పేశాయి. #ChennaiRainsUpdate :तमिलनाडु में भारी बारिश से जनजीवन अस्त-व्यस्त! चेन्नई की सड़कों पर पानी भर गया है, जिससे स्कूलों को बंद करना पड़ा और लोगों को वर्क फ्रॉम होम की सलाह दी गई है। प्रशासन ने #RedAlert जारी किया है। #ChennaiRains #ChennaiFloods#Chennai #chennairain2024… pic.twitter.com/t8e0kS8TWQ — Shankar Dayal 🇮🇳 (@shankarverma39) October 16, 2024 ఇది కూడా చదవండి: మహా ఎన్నికలకు మోగనున్న నగారా! వరదల్లో చిక్కుకున్న రజినీకాంత్... ప్రముఖ నటుడు రజినీకాంత్ కూడా ఈ వర్షాలకు తలవంచాల్సి వచ్చింది. చెన్నైలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఆయన నివాసం నీటమునిగింది. రజనీకాంత్ నివాసం చుట్టూ ఉన్న నీటిని పంపింగ్ చేయడానికి పౌర అధికారులు త్వరగా అత్యవసర చర్యలను ప్రారంభించారు. రజినీకాంత్ సిబ్బంది కూడా పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నారు. కాగా చెన్నై నగరంలోని కొందరి రాజకీయ, సినీ ప్రముఖుల ఇండ్లు కూడా వర్షాలతో నీటమునిగాయి. Also Read : భారత్ గడ్డపై 36 ఏళ్లుగా.. ఆ జట్టు విజయం కోసం ఎదురుచూపు #JUSTIN | சென்னை போயஸ் கார்டனில் உள்ள ரஜினி இல்லத்தை சூழ்ந்த மழை நீர்#Rajinikanth #PoesGarden #Chennai #Rain #weatherupdates #ThanthiTV pic.twitter.com/cvjXGzTZkm — Thanthi TV (@ThanthiTV) October 15, 2024 ఇది కూడా చదవండి: నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి... ఆరోజే కీలక ప్రకటన! అధికారిక హెచ్చరికలు... కురుస్తున్న వర్షాలకు ప్రతిస్పందనగా, చెన్నై కార్పొరేషన్ నివాసితులకు సహాయం చేయడానికి హెల్ప్‌లైన్ నంబర్ 1913ను ఏర్పాటు చేసింది. అదనంగా, విద్యార్థుల భద్రత కోసం 2024 అక్టోబర్ 16న చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు జిల్లాల్లోని పాఠశాలలు, కళాశాలలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. తమిళనాడు స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ కూడా అత్యవసర పరిస్థితుల కోసం హెల్ప్‌లైన్ (1070)ని ఏర్పాటు చేసింది. సహాయ కేంద్రాలతో పాటు వరద వాలంటీర్ల గురించి సమాచారం కోసం WhatsApp నెంబర్ 9445869848 ను ప్రకటించింది. Let's face it: No corporation commissioner, mayor, or minister can tackle road issues while Chennai is a maze of underground metro construction. Many choke points are linked to these areas, causing waterlogging. While KK Nagar has avoided inundation this time, some pockets still… pic.twitter.com/0hDyCQcsEp — Sriram (@SriramMadras) October 15, 2024 ఇది కూడా చదవండి: తెలుగు రాష్ట్రాలకు కేంద్రం గుడ్ న్యూస్ #chennai #heavy-rains #rajinikanth #actor మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి