/rtv/media/media_files/2026/04/06/lpg-2026-04-06-18-59-57.jpg)
centre-makes-key-announcement on essential-commodities-and-gas
పశ్చిమాసియాలో యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించింది. యుద్ధం వల్ల నిత్యావసర వస్తువుల కొరత ఏర్పడుతుందేమోనన్న ఆందోళనలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే కేంద్రం కీలక ప్రకటన చేసింది. దేశంలో ప్రస్తుతం తగినంత 'బఫర్ స్టాక్' (నిల్వలు) అందుబాటులో ఉన్నట్లు భరోసా ఇచ్చింది. ముఖ్యంగా బియ్యం, గోధుమలు, ఉల్లి, టమాట, ఆలుగడ్డల ధరలు స్థిరంగా ఉన్నాయని తెలిపింది. నిత్యావసర వస్తువుల ధరల్లో పెద్దగా ఎలాంటి మార్పులు ఉండవని స్పష్టం చేసింది.
మరోవైపు దేశంలో ఎల్‌పీజీ కొరతపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. అయితే దేశవ్యాప్తంగా గ్యాస్ నిల్వలు సరిపడా ఉన్నాయని తెలిపింది. ప్రస్తుతం రిఫైనరీలు పూర్తి సామర్థ్యంతో పని చేస్తున్నట్లు పేర్కొంది. ముడిచమురు సరఫరాకు ఎలాంటి అంతరాయం లేదని చెప్పింది. అందుకే గ్యాస్ కొరతపై ప్రజలు ఆందోళన పడాల్సిన అవసరం లేదని చెప్పింది. ప్రస్తుతం ఇంధన సరఫరా గొలుసు పటిష్టంగానే ఉన్నట్లు పేర్కొంది.
Also Read: కాంగ్రెస్ - పాకిస్థాన్ బంధం దేశ భద్రతకే ముప్పు.. ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు!
మరోవైపు పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు చక్కదిద్దేందుకు భారత్ దౌత్యపరమైన చర్యలను సైతం వేగవంతం చేసింది. విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ గల్ఫ్ దేశాల ప్రతినిధులతో ఫోన్ ద్వారా చర్చలు జరిపారు. ప్రస్తుత కొనసాగుతున్న పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలోనే ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీతో కూడా మాట్లాడారు. యుద్ధ ఉద్రిక్తతలను తగ్గించి, శాంతిని నెలకొల్పేందుకు భారత్ తన వంతుగా దౌత్య ప్రయత్నాలను కొనసాగిస్తోంది.
Also Read: యుద్ధంలో బిగ్‌ట్విస్ట్.. కాల్పుల విరమణ వైపు ఇరాన్, అమెరికా..!
మరోవైపు ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ బిగ్‌ట్విస్ట్ చోటుచేసుకుంది. అమెరికా-ఇరాన్ మధ్య కాల్పుల విరమణ జరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అమెరికా-ఇరాన్ మధ్య చర్చల జరిపేందుకు పాకిస్థాన్, తుర్కియే, ఈజిప్టు దేశాలు మధ్యవర్తిత్వం వహిస్తున్నాయి. ఇవి ఓ ముసాయిదా ప్లాన్‌ను కూడా అమెరికా-ఇరాన్‌కు అందించినట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. ఈ ప్లాన్‌లో 45 రోజుల పాటు కాల్పుల విరమణ, హర్మూజ్ జలసంధిని తెరవడం లాంటి అంశాలు ఉన్నాయి. అయితే ఈ 45 రోజుల సమయంలో శాశ్వత కాల్పుల విరమణ దిశగా చర్చలు జరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. అయితే ఈ ముసాయిదాను ప్రస్తుతం అమెరికా, ఇరాన్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
Follow Us