/rtv/media/media_files/2025/03/24/70vJCkgjlF50x2T5EEQt.jpg)
Rahul Gandhi
కాంగ్రెస్ అగ్రనేత, విపక్ష నేత రాహుల్ గాంధీ పౌరస్వంపై వివాదం నెలకొంది. నాలుగు వారాల్లో ఆయన పౌరసత్వం అంశం తేల్చాలని అలహాదాబ్ హైకోర్టు కేంద్రానికి ఆదేశించింది. నాలుగు వారాల్లోనే పౌరసత్వం అంశం తేల్చాలని సూచనలు చేసింది. అనంతరం విచారణను ఏప్రిల్ 21కి వాయిదా వేసింది. ఈ గడువు లోపల కేంద్రం న్యాయస్థానానికి రిపోర్టును సమర్పించాల్సి ఉంటుంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. రాహుల్ గాంధీ పౌరసత్వానికి సంబంధించి గత కొన్నేళ్లుగా వివాదం జరుగుతూనే ఉంది.
Also Read: రాహుల్ గాంధీతో డేటింగ్ చేయడం ఇష్టం : కరీనా కపూర్
రాహుల్ గాంధీ బ్రిటన్ పౌరుడని, భారత పౌరసత్వాన్ని రద్దు చేయాలని కోరుతూ బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి, కర్ణాటకకు చెందిన బీజేపీ నేత విఘ్నేశ్ శిశిర్ కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. విదేశీయుడైన ఆయనకు భారత్‌లో ప్రభుత్వ పదవులు చేపట్టే అధికారం లేదని ఆరోపణలు చేశారు. ఈ క్రమంలోనే దీనిపై విచారించిన ధర్మాసనం తాజాగా ఆదేశాలు జారీ చేసింది. బ్రిటన్‌లో నమోదైన ఓ కంపెనీకి రాహుల్ గాంధీ డైరెక్టర్, సెక్రటరీగా ఉన్నట్లు సుబ్రహ్మణ్య స్వామి గత కొంతకాలంగా చెబుతూ వస్తున్నారు. అంతేకాదు ఆ కంపెనీ వార్షిక నివేదికలో రాహుల్ తనను బ్రిటిష్ పౌరుడిగా చెప్పుకున్నట్లు తెలిపారు.
Also Read: కేంద్రం కీలక నిర్ణయం.. పార్లమెంటు సభ్యుల జీతాలు, అలవెన్సులు పెంపు!
భారత చట్టాల ప్రకారం.. ద్వంద్వ పౌరసత్వానికి అనుమతి లేదని, ఎవరైనా ఇతర దేశానికి చెందిన పౌరసత్వం పొందితే భారత పౌరసత్వం రద్దవుతుందని పేర్కొన్నారు. వేరే దేశంలో పౌరుడిగా ఉండే వ్యక్తి భారత పౌరసత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకోవాల్సి ఉంటుందని అన్నారు. ఇలా చేయకపోతే రాజ్యాంగంలోని ఆర్టికల్ 9, భారతీయ పౌరసత్వ చట్టం, 1955ను ఉల్లంఘించడమే అవుతుందని చెప్పారు. ఈ విషయంపై గతంలో ఆయన కేంద్ర ప్రభుత్వానికి కూడా లేఖ రాశారు. విఘ్నేశ్ మాట్లాడుతూ.. తన దగ్గర రాహుల్ గాంధీ పౌరసత్వానికి సంబంధించి యూకే ప్రభుత్వం సమర్పించిన రికార్డులు ఉన్నట్లు చెబుతున్నారు.
telugu-news | rtv-news