CBSC క్వశ్చన్‌ పేపర్‌పై QR కోడ్‌.. స్కాన్‌ చేస్తే యూట్యూబ్‌లో వీడియో సాంగ్

సెంట్రల్ బోర్డ్ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSC) క్లాస్‌ 12 మ్యాథ్స్‌ పేపర్‌పై సోషల్ మీడియాలో వివాదం నెలకొంది. ప్రశ్నాపత్రంపై ఉన్న క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్ చేస్తే యూట్యూబ్‌లో ఓ వీడియో సాంగ్ ఒపెన్ అవ్వడం విస్మయానికి గురిచేస్తోంది.

New Update
CBSE Class 12 Maths Paper QR Code Leads To 'Rickroll

CBSE Class 12 Maths Paper QR Code Leads To 'Rickroll

సెంట్రల్ బోర్డ్ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSC) క్లాస్‌ 12 మ్యాథ్స్‌ పేపర్‌పై సోషల్ మీడియాలో వివాదం నెలకొంది. ప్రశ్నాపత్రంపై ఉన్న క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్ చేస్తే యూట్యూబ్‌లో ఓ వీడియో సాంగ్ ఒపెన్ అవ్వడం విస్మయానికి గురిచేస్తోంది. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. సోమవారం ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు గణితం, అప్లయిడ్ మ్యాథెమెటిక్స్ పరీక్ష జరిగింది. ఆ తర్వాత ఈ ప్రశ్నపత్రం ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 

క్వశ్చన్ పేపర్‌పై ఉన్న క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్ చేస్తే యూట్యూబ్‌లో 1987 నాటి ఓ ఇంగ్లీష్ సాంగ్‌ ఒపెన్ అవుతోందని యూజర్లు కామెంట్లు చేస్తున్నారు. వాస్తవానికి 2018లో CBSC బోర్డు.. పరీక్ష ప్రశ్నా పత్రాలు లీక్ కాకుండా ఉండేందుకు ఈ క్యూఆర్‌ కోడ్‌ను తీసుకొచ్చింది. కానీ ఈసారి ఆ పేపర్‌పై ఉన్న కోడ్‌ను స్కాన్ చేస్తే సాంగ్ ఒపెన్ కావడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ప్రశ్నాపత్రాల్లో ఇలాంటి పొరపాట్లు చేయడం ఏంటని సోషల్ మీడియాలో నెటిజన్లు నిలదీస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యంపై మండిపడుతున్నారు. 

Also Read: బంగ్లాదేశ్‌కు భారత్ భరోసా.. పైప్‌లైన్ ద్వారా 5,000 టన్నుల డీజిల్ సప్లై

సాధారణంగా ఈ క్యూఆర్‌ కోడ్‌లను డిజిటల్ లెర్నింగ్ మెటీరియల్ లేదా అదనపు సమాచారం కోసం ఇస్తుంటారు. క్వశ్చన్ పేపర్ ఒరిజినల్ కాదా అనేది నిర్ధారించేందుకు ఇది ఉపయోగపడుతుంది. ఇన్విజిలేటర్లు లేదా అధికారులు ఆ కోడ్‌ను స్కాన్ చేయడం చేసి అది బోర్డు జారీ చేసిన అధికారిక పత్రమేనని ధృవీకరించుకోవచ్చు. అలాగే ఒకవేళ ఎవరైనా పేపర్‌ను ఫోటో తీసి బయట సోషల్ మీడియాలో షేర్ చేస్తే.. ఆ కోడ్ ద్వారా అది ఏ సెంటర్ నుంచి లేదా ఏ గది నుంచి లేదా ఏ విద్యార్థికి వచ్చిన పేపర్ అనేది గుర్తించవచ్చు. 

ఇలా పేపర్ లీకేజీని అరికట్టేందుకు, భద్రత కోసం సీబీఎస్‌ఈ ఈ విధానాన్ని తీసుకొచ్చింది. అయితే తాజాగా మ్యాథ్స్‌ క్వశ్చన్‌ పేపర్‌పై ఉన్న కోడ్‌కు మ్యూజిక్ వీడియో లింక్ అవ్వడం అనేది సాంకేతిక లోపమా లేదా మరేదైనా కారణమా అనేది తెలియాల్సి ఉంది. అయితే దీనిపై సీబీఎస్ఈ ఇంకా స్పందించలేదు. 

Also Read:  దేశంలో వంట గ్యాస్‌ కొరత.. అక్కడ హోటల్స్‌ అన్ని క్లోజ్‌

Advertisment
తాజా కథనాలు