Actress Ranya Rao:గోల్డ్ స్మగ్లింగ్ కేసులో బిగ్ ట్విస్ట్...రన్యారావు వెనుక ప్రముఖులు., పెళ్లి వీడియో పై సీబీఐ కన్ను!

కన్నడ నటి రన్యా రావు.. గోల్డ్ స్మగ్లింగ్ కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసు విచారణను చేపట్టిన సీబీఐ అధికారులు దర్యాప్తును మరింత వేగవంతం చేస్తున్నారు. ఈ క్రమంలోనే సీబీఐ ఆమె పెళ్లి వీడియోను పరిశీలిస్తున్నారు.పూర్తి వివరాలు ఈకథనంలో..

New Update
Ranya Rao

Ranya Rao

దుబాయ్ నుంచి అక్రమంగా బంగారం తీసుకువస్తూ.. అధికారులకు అడ్డంగా దొరికిపోయిన కన్నడ నటి రన్యా రావు కేసులో ట్విస్టులు మీద ట్విస్టులు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటివరకు ఆమెను విచారణ జరపగా.. తాజాగా ఈ కేసులోకి సీబీఐ అధికారులు ఎంటర్‌ అయ్యారు. దీంతో ఈ కేసు శరవేగంగా దర్యాప్తు జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఈ బంగారం స్మగ్లింగ్‌ వ్యవహారంలో రన్యారావుతో పాటు ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయి అనేది గుర్తిచేందుకు సీబీఐ రకరకాల ప్రయత్నాలు చేస్తోంది. 

Also Read: Trudeau:కుర్చీ చేత పట్టుకుని..నాలుక బయటపెట్టి..ట్రూడో ఫొటో వైరల్‌!

పెళ్లి వీడియోను...

అందుకు ఆమె పెళ్లికి సంబంధించిన వీడియో ఫుటేజ్‌ను సీబీఐ అధికారులు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక సీబీఐ అధికారులు రన్యారావు ఇల్లు, ఆమెకు సంబంధించిన అన్ని ప్రాంతాలు, ఆమె పెళ్లి చేసుకున్న హోటల్‌కు వెళ్లి విచారణ జరుపుతున్నారు. అయితే రన్యారావు పెళ్లి వేడుకకు హాజరైన వారు, అతిథులు ఇచ్చిన ఖరీదైన కానుకలపైనా సీబీఐ దృష్టి సారించనుంది. ఇందుకోసమే రన్యారావు పెళ్లి వీడియోను సీబీఐ అధికారులు పరిశీలిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. 

Also Read: Supreme Court: కలెక్టర్లకు ఆ ఛాన్స్ ఇవ్వలేం.. సుప్రీంకోర్టు కీలక తీర్పు

మరోవైపు రన్యారావు దాఖలు చేసుకున్న బెయిల్‌ పిటిషన్‌పై కోర్టులో విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే.. రన్యారావు బెయిల్‌పై అభ్యంతరాలను సమర్పించాలని డీఆర్‌ఐ అధికారులకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది.మరోవైపు.. గోల్డ్ స్మగ్లింగ్‌ చేసే సమయంలో ఎయిర్‌పోర్టులో వీఐపీ ప్రొటోకాల్‌ను రన్యారావు దుర్వినియోగం చేసినట్లు తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ ఆరోపణలపై విచారణ జరపాలని సిద్ధరామయ్య నేతృత్వంలోని కర్ణాటక ప్రభుత్వం ఆదేశించింది. 

ఎయిర్‌పోర్టులో సెక్యూరిటీ చెకింగ్స్‌ను తప్పించుకునేందుకు ఆమె సవతి తండ్రి, సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి కె.రామచంద్రరావు పేరును ఆమె వాడుకున్నారని ఆరోపణలు వచ్చాయి. దీనిపై పూర్తిస్థాయి దర్యాప్తు చేయాలని కర్ణాటక సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ బంగారం అక్రమ రవాణా వ్యవహారంలో రన్యారావు తండ్రి కె.రామచంద్రరావు పాత్ర ఉందా లేదా అనే విషయంపైనా దృష్టి పెట్టాలని తెలిపింది. ఇక ఈ రన్యరావు గోల్డ్ స్మగ్లింగ్ కేసు విచారణ అధికారిగా అదనపు ప్రధాన కార్యదర్శి గౌరవ్‌ గుప్తాను సిద్ధరామయ్య ప్రభుత్వం నియమించింది.

ఇక 4 నెలల క్రితం రన్యా రావును జితిన్‌ హుక్కేరి అనే ఆర్కిటెక్ట్‌ను బెంగళూరులోని తాజ్ వెస్ట్ ఎండ్‌లో ఘనంగా పెళ్లి చేసుకుంది. ఈ నేపథ్యంలోనే ఆ పెళ్లి వచ్చిన అతిథుల లిస్ట్‌ను తీసుకున్న సీబీఐ అధికారులు.. వారు ఎలాంటి ఖరీదైన బహుమతులు ఇచ్చారు అనేది ఆరా తీస్తోంది. మరోవైపు.. రన్యా రావు గోల్డ్ స్మగ్లింగ్ కేసు గురించి కర్ణాటక అసెంబ్లీలో తీవ్ర రచ్చకు దారి తీసినట్లు తెలుస్తుంది. అధికార కాంగ్రెస్ పార్టీపై.. ప్రతిపక్ష బీజేపీ ఈ కేసు గురించి ప్రశ్నల వర్షం కురిపించింది.

Also Read: Arvind Kejriwal: అరవింద్ కేజ్రీవాల్‌కు బిగ్‌ షాక్‌.. కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశాలు

Also Read: పాక్‌లో ట్రైన్‌ హైజాక్.. బలూచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) డిమాండ్స్‌ ఏంటి?.. ఆ సంస్థ బ్యాగ్రౌండ్ ఏంటి?

Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Wife killed Husband: ప్రియుడితో శృంగారం మోజు.. భర్త గొంతు కోసి చంపిన భార్య!

యూపీలో మరో భర్త భార్య చేతిలో బలయ్యాడు. బోడ్లాకు చెందిన నీతు తన ప్రియుడు విష్ణుతో కలిసి జితేంద్రను గొంతుకోసి చంపింది. గ్రామానికి 65 కిలోమీటర్ల దూరంలో మృతదేహాన్ని పడేసి మిస్సింగ్ కేసు పెట్టింది. మృతుడి బంధువుల ఫిర్యాదుతో నిందితులను అరెస్ట్ చేశారు.  

New Update
wife killed

Uttar Pradesh Wife killed Husband

Wife killed Husband: అంబులెన్స్ డ్రైవర్‌తో డ్రైవర్‌తో అక్రమ సంబంధం పెట్టుకున్న ఓ వివాహిత దారుణానికి పాల్పడింది. ప్రియుడితో రాసలీలలు చేసేందుకు అడ్డుగా ఉన్నాడనే కోపంతో భర్తను దారుణంగా కడతేర్చింది. ఉంచుకున్న వాడితో కలిసి గొంతుకోసి చంపేసింది. అంతేకాదు భర్త మృతదేహాన్ని ఒక ఆటోలో మధుర జిల్లాలో 65 కి.మీ దూరంలో పడేసి తనకు ఏమీ ఎరుగనట్లు నటించింది. పోలీసులకు భర్త కనిపించట్లేదని ఫిర్యాదు చేయడంతో అలసు బాగోతం బయటపడింది. ఈ భయంకరమైన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా జిల్లాలో జరిగగా వివరాలు ఇలా ఉన్నాయి. 

Also Read: రా కి రా.. సార్ కి సార్..! గ్రోక్‌ ఏఐ దెబ్బ అదుర్స్ కదూ!

వస్తువులు తీసుకురావడానికి వెళ్లి..

ఈ మేరకు పోలీసుల వివరాల ప్రకారం.. వెదురు కర్రల వ్యాపారి జితేంద్ర బాగెల్ జగదీష్‌పురా పోలీస్ స్టేషన్‌లోని బోడ్లా ప్రాంతం లాల్ మసీదు సమీపంలో కుటుంబంతో నివసిస్తున్నాడు. అయితే మార్చి 11వ తేదీ సాయంత్రం దుకాణం మూసివేసి జితేంద్ర ఇంటికి వచ్చాడు. కొంత సమయం తర్వాత కొన్ని వస్తువులు తీసుకురావడానికి ఇంటి నుండి బయటకు వెళ్లిన అతను.. రాత్రంతా ఇంటికి తిరిగి రాలేదు. అయితే మార్చి 12న తన భర్త అదృశ్యం గురించి జితేంద్ర భార్య నీతు పోలీసులకు సమాచారం ఇచ్చింది. కుటుంబ సభ్యులు కూడా జితేంద్ర కోసం వెతకడం ప్రారంభించారు.

Also Read: పూరీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విజయ్ సేతుపతి..!

ఆటోలోంచి విసిరేసి..

5 రోజులుగా భర్త జాడ లేకపోవడంతో కుటుంబ సభ్యులు భార్యపై అనుమానం ఉందంటూ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నీతను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించింది. తన భర్త తనను కొడుతుండేవాడని, అందుకే అతన్ని చంపేశానని పోలీసులకు చెప్పింది. ఆ తర్వాత ఆమె మృతదేహాన్ని మధురలోని నిర్జన ప్రాంతంలో ఆటోలోంచి విసిరేశానని తెలిపింది. అయితే ఆ మహిళ ఒంటరిగా హత్య చేసి ఉండకపోవచ్చని పోలీసులు అప్పటికే అనుమానించారు. కుటుంబ సభ్యుల సమాచారంతో ఆమె ప్రేమికుడు అంబులెన్స్ డ్రైవర్‌ను కూడా అరెస్టు చేశారు. 

 Also Read: అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణవాసుల మృతి..

ఈ కేసు గురించి లోహా మండి అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ మయాంక్ తివారీ మాట్లాడుతూ.. మార్చి 11న జితేంద్ర మిస్సింగ్ కేసు జగదీష్‌పురా పోలీస్ స్టేషన్‌లో నమోదైందని తెలిపారు. జితేంద్ర హత్యకు అతని భార్యే పథకం వేసినట్లు దర్యాప్తులో తేలింది. జితేంద్ర భార్య స్నేహితుడు విష్ణు బాఘేల్, అతని స్నేహితుడు అనిల్ కలిసి జితేంద్రను ఆల్టో కారులో కూర్చోబెట్టారు. మార్గమధ్యలో అతని మెడను టవల్ అదిమి పట్టి గొంతు కోసి చంపారు. ఆ తర్వాత మృతదేహాన్ని మధుర జిల్లాలోని ఫరా ప్రాంతంలో విసిరేశారు. ప్రేమ వ్యవహారం కారణంగా ఈ హత్య ఒక పథకం ప్రకారం జరిగింది. ప్రస్తుతం నిందితులను అరెస్టు చేశామని చెప్పారు. 

Also Read: నేడు ఈ రాశివారు నమ్మిన వారే మోసం చేసే అవకాశాలున్నాయి..జర జాగ్రత్త!

Advertisment
Advertisment
Advertisment