/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/marriege-jpg.webp)
mp
ఇటీవలి కాలంలో పెళ్లి పీటల వరకు వచ్చిన తరువాత క్యాన్సిల్ అయిన పెళ్లిళ్లు చాలానే ఉన్నాయి. వధువు, వరుడు ఇద్దరిలో ఎవరో ఒకరికి ముందే ప్రేమ వ్యవహారం ఉండడం...పెద్దల బలవంతం మీద పీటల వరకు రావడం, ఆ తరువాత రెప్పపాటు కాలం దొరికిన నచ్చినవారితో జంప్ అయిపోవడం ఇటీవల కాలంలో చాలా సార్లు చూశాం.
Also Read: Adani: లక్ష కోట్లు పోగొట్టుకున్న అదానీ..అధిక సంపద కోల్పోయిన వారిలో సెకండ్
కానీ ఇక్కడ మాత్రం పెళ్లి చేసుకున్న యువతి.. రిసెప్షన్ కంటే ముందే తన బాయ్‌ఫ్రెండ్‌తో వెళ్లిపోవడం సంచనలంగా మారింది. అయితే పెళ్లి అయిన తర్వాత బయటికి వెళ్లేందుకు ఆ నవవధువు.. బ్యూటీపార్లర్‌కు వెళ్తున్నా అని నాటకం ఆడింది. మధ్యప్రదేశ్‌లో జరిగిన ఈ సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Also Read: IOCL Recruitment : గుడ్ న్యూస్.. గడువు పొడిగింపు.. 246 పోస్టులు, లక్షల్లో జీతం
బ్యూటీపార్లర్‌కు వెళ్లి వస్తానని..
మధ్యప్రదేశ్‌లోని గంజ్‌బసోడా జిల్లాలో ఈ సంఘటన చోటు చేసుకుంది. టీటీనగర్‌కు చెందిన ఆశిష్ రాజక్‌కు, గంజ్‌బసోడాకు చెందిన రోష్ని సోలంకికి పెళ్లి కుదిరింది. ఈ క్రమంలోనే మంగళవారం వారిద్దరి పెళ్లిని వైభవంగా జరిపించారు. అనంతరం పెళ్లి కుమార్తెను వరుడి ఇంటికి తీసుకెళ్లారు. బుధవారం వారికి రిసెప్షన్ చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే తాను మేకప్ అయ్యేందుకు బ్యూటీపార్లర్‌కు వెళ్లి వస్తానని చెప్పి వరుడి ఇంటి నుంచి బయటికి వెళ్లింది. కానీ ఆమె ఎంతకూ తిరిగిరాకపోవడంతో.. భర్త, అత్తింటివారు వెతికారు. చివరికి ఆమె కిడ్నాప్ అయిందని.. టీటీ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అయితే కేసు నమోదు చేసి రంగంలోకి దిగిన పోలీసులు.. అసలు విషయం తెలిసి ముక్కున వేలేసుకున్నారు. తన భార్య రోష్ని సోలంకిని ఎవరో కొందరు బలవంతంగా కారులో ఎక్కించుకుని వెళ్లినట్లు భర్త ఫిర్యాదు చేశాడు. అంతేకాకుండా తన పెళ్లి రోజున గంజ్‌బసోడాలో తన కారు నాలుగు టైర్లను ఎవరో పంక్చర్ చేశారని కూడా చెప్పాడు. ప్రాథమిక విచారణ ప్రకారం ఆ నవవధువు స్వయంగా కారులోకి ఎక్కి వారితో వెళ్లిపోయినట్లు తెలిసింది.
దీంతో ఆమె కాల్ రికార్డులు సేకరించగా.. ఆమె ఇంటి పక్కనే ఉండే అనికేత్ మాలవీయతో ప్రేమాయణం నడిపినట్లు గుర్తించారు. అయితే రిసెప్షన్ జరిగే బుధవారం కూడా రోష్ని సోలంకి, అనికేత్ మాలవీయతో చాలాసార్లు ఫోన్‌లో మాట్లాడినట్లు తెలిపారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు పారిపోయిన రోష్ని సోలంకి, అనికేత్ మాలవీయల జాడ కోసం వెతుకుతున్నారు. ఇందుకోసం రెండు టీమ్‌లు సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం రోజున రోష్ని సోలంకి ఒక ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ చేసింది.
అందులో అసలు విషయాలు వెల్లడించింది. తాను అనికేత్ మాలవీయను ప్రేమిస్తున్నానని.. ముందుగానే తన తల్లిదండ్రులకు చెప్పానని.. అయితే వారు తమకు పెళ్లి చేయకుండా ఆశిష్ రాజక్‌కు ఇచ్చి పెళ్లి జరిపించారని పేర్కొంది. తనకు ఆశిష్ రాజక్‌ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని,అందుకే అతనితో కలిసి వెళ్లిపోయినట్లు తెలిపింది. ఈ క్రమంలోనే తనకు, తన ప్రియుడికి భద్రత కల్పించాలని కోరింది.
Also Read: Holidays: విద్యార్థులు ఎగిరి గంతేసే వార్త...ఇకపై ప్రతి నెలా నాలుగో శనివారం సెలవు
Also Read: Horoscope: ఈరోజు ఈ రాశివారు డబ్బు నష్టపోయే అవకాశాలున్నాయి..జాగ్రత్త!