Delhi: ఢిల్లీలో ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు

76వ గణతంత్ర వేడుకలను ఢిల్లీలోని కర్తవ్యపథ్ లో ఘనంగా నిర్వహించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ వేడుకలను ఇండోనేషియా అధ్యక్షుడు  ప్రబోవో సుబియాంతో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 

New Update
delhi

Republic day Parade

స్వర్ణిమ్‌ భారత్, విరాసత్‌ ఔర్‌ వికాస్‌ అనే ఇతివృత్తంతో ఈ సారి రిపబ్లిక్ డే కవాతులను నిర్వహించారు. త్రివిధ దళాల సంయుక్తంగా ఒక శకాన్ని తీసుకురావడం ఈ సారి వేడుకల్లో ప్రత్యేకతగా నిలిచింది. ఢిల్లీలోని కర్తవ్యపథ్ లో జరిగిన గణతంత్ర వేడుకల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతీయ జెండాను ఆవిష్కరించారు. దాంతో పాటూ సైనిక బలగాల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. గణతంత్ర వేడుకలకు ఇండోనేషియా ప్రెసిడెంట్ సుబియాంతో ముఖ్య అతిథిగా హాజరవ్వగా...ప్రధాని మోదీ, ఉపరాష్ట్రపతి జగదీప్ దన్ ఖడ్, మరి కొందరు కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. 

కవాతులో పాల్గొన్న 31 శకటాలు..

ఇక సుందర శకటాలతో అన్ని రాష్ట్రాలు కవాతు నిర్వహించాయి. బ్రహ్మోస్‌, ఆకాశ్‌ క్షిపణులు, పినాక మల్టీబ్యారెల్‌ రాకెట్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలవగా.. కర్తవ్య పథ్‌పై హెలికాప్టర్లు పూల వర్షం కురిపించాయి. రాష్ట్రపతి భవన్ నుంచి ఎర్రకోట వరకు 9 కిలోమీటర్లు పరేడ్ నడిచింది. మొత్తం 31 శకటాలను ప్రదర్శనలో పాల్గొన్నాయి. వేలాది మంది రిపబ్లిక్ డే వేడుకలను వీక్షించడానికి వచ్చారు. దీంతో ఢిల్లీ రోడ్లు బిజీబిజీగా మారాయి. 

 

Also Read: India: ఇండోనేషియాతో భారత్ ఐదు కీలక ఒప్పందాలు

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు