/rtv/media/media_files/2026/04/10/manifesto-2026-04-10-13-13-43.jpg)
BJP Manifesto: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా శుక్రవారం బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో సంకల్ప పత్రంను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన అధికార తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ మేనిఫెస్టో కేవలం హామీల పత్రం కాదని, బెంగాల్‌ను అభివృద్ధి పథంలో నడిపించే ఒక రోడ్ మ్యాప్ అని ఆయన అభివర్ణించారు.
#BJP releases Sankalp Patra - election manifesto for #WestBengal polls. pic.twitter.com/4isWs4QH7s
— Pooja Mehta (@pooja_news) April 10, 2026
ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని గత 15 ఏళ్ల పాలన బెంగాల్ ప్రజలకు ఒక పీడకలలా మిగిలిపోయిందని అమిత్ షా విమర్శించారు. "కమ్యూనిస్టుల పాలనను అంతం చేయాలని బెంగాల్ ప్రజలు దీదీకి అధికారం ఇచ్చారు, కానీ ఆమె ప్రజల నమ్మకాన్ని వమ్ము చేశారని ఆయన మండిపడ్డారు. ప్రస్తుతం బెంగాల్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, ఆ మార్పు కేవలం బీజేపీతోనే సాధ్యమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
మమతా బెనర్జీ కోటను బద్దలు కొట్టడమే
ప్రధాని మోదీ వికసిత భారత్ లక్ష్యానికి అనుగుణంగానే ఈ మేనిఫెస్టోను రూపొందించినట్లు అమిత్ షా తెలిపారు. గత పదేళ్లలో బెంగాల్‌లో ఒక బలమైన ప్రతిపక్షంగా బీజేపీ ప్రజల నమ్మకాన్ని గెలుచుకుందని అమిత్ షా గుర్తుచేశారు. "ప్రజలకు ఇప్పుడు మాపై నమ్మకం ఉంది, మేము చెప్పింది చేసి చూపిస్తాం" అని ఆయన పేర్కొన్నారు. బెంగాల్ సంస్కృతిని కాపాడుతూనే, రాష్ట్రాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలబెడతామని హామీ ఇచ్చారు. మమతా బెనర్జీ కోటను బద్దలు కొట్టడమే లక్ష్యంగా బీజేపీ అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంది. ఈ 'సంకల్ప పత్రం' బెంగాల్ ఓటర్లను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.
ఇక వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల విషయానికి వచ్చేసరికి రెండు దశల్లో జరగనున్నాయి. మొత్తం 294 స్థానాల్లోనూ ఏప్రిల్ 23, 29న రెండు విడతలుగా జరగనున్నాయి. మే 4న ఓట్ల లెక్కింపు ఉండనుంది.
Follow Us