BJP: నటిపై బోల్డ్ కామెంట్స్.. ఎమ్మెల్యేను బహిష్కరించిన బీజేపీ!

నటి రన్యారావుపై బోల్డ్ కామెంట్స్ చేసిన బీజేపీ ఎమ్మెల్యే  బసనగౌడ పాటిల్‌కు బిగ్ షాక్ తగిలింది. క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడినందుకు ఆరేళ్లపాటు పార్టీ నుంచి బహిష్కరించినట్లు అధిష్టానం ప్రకటించింది. ఇది తక్షణమే అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. 

New Update
karnaraka ranya

BJP MLA Basanagouda Patil suspended by party ranya rao issue

BJP: నటి రన్యారావుపై బోల్డ్ కామెంట్స్ చేసిన బీజేపీ ఎమ్మెల్యే  బసనగౌడ పాటిల్‌కు బిగ్ షాక్ తగిలింది. క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడినందుకు ఆరేళ్ల పాటు పార్టీ నుంచి బహిష్కరించినట్లు అధిష్టానం ప్రకటించింది. ఇది తక్షణమే అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. 

ప్రతి అంగంలో బంగారమే..

అసలేం జరిగిందంటే.. గోల్డ్ స్మగ్లింగ్ (Gold Smuggling) కేసులో అరెస్టైన నటి రన్యారావు (Ranya Rao) పై కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే వల్గర్ కామెంట్స్ చేశాడు. ఆమె బాడీలోని ప్రతి అంగంలో బంగారం దాచి స్మగ్లింగ్ చేసిందంటూ బీజాపూర్ ఎమ్మెల్యే బసనగౌడ దుమారం రేపాడు. ఈ బ్లాక్ దందాలో పత్ర్యక్షంగా, పరోక్షంగా భాగస్వాములైన మంత్రుల పేర్లను అసెంబ్లీ సమావేశాల్లో బయటపెడతానంటూ సంచలనం సృష్టించాడు. అంతేకాదు రన్యారావు సంబంధించిన సమాచారం మొత్తం తన దగ్గర ఉందని చెప్పడం రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ రేపుతోంది. 

ఇది కూడా చదవండి: Komatireddy Rajagopal Reddy: మా రేవంత్ రెడ్డి చాలా మంచోడు...లేకుంటే....

విదేశాల నుంచి బంగారం అక్రమ రవాణా చేస్తూ కన్నడ నటి రన్యారావు పట్టుబడిన విషయం తెలిసిందే. కాగా రన్యారావు బంగారం స్మగ్లింగ్‌ విషయంలో దర్యాప్తు కొనసాగుతుండగా ఆమెపై రోజుకో ఆరోపణ వస్తోంది. తాజాగా బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాల్  సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో మాట్లాడిన ఆయన కీలక కామెంట్స్‌ చేశారు. ఆయన మాట్లాడుతూ.. సోమవారం సభలో మొత్తం కేసు గురించి మాట్లాడుతానని అన్నారు. రన్యా రావుతో పరిచయం ఉన్న ఇద్దరు మంత్రుల పేర్లను సభలో చెబుతాను. నేను ఇప్పుడు మీడియా ముందు దాని గురించి మాట్లాడను. ఆమెకు ప్రోటోకాల్ ఇచ్చిన వారి గురించి మేము సమాచారాన్ని సేకరించాం. వాళ్ళకి బంగారం ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరి కోసం తెచ్చారో నాకు తెలుసు.” అని యత్నాల్ అన్నారు.


ఇది కూడా చదవండి: CM Revanth Reddy : రాష్ట్రంలో ఏ ఉప ఎన్నికలు రావు.. రేవంత్‌ రెడ్డి కీలక వ్యాఖ్యలు

 

 

 karnataka | Ranya Rao case | bjp-mla | telugu-news  today telugu news

Advertisment
Advertisment
Advertisment