/rtv/media/media_files/2026/05/15/big-supreme-court-setback-for-kuldeep-sengar-in-unnao-rape-case-2026-05-15-12-50-30.jpg)
Big Supreme Court Setback For Kuldeep Sengar In Unnao Rape Case
ఉన్నావ్ అత్యాచార కేసులో శిక్ష అనుభవిస్తున్న బీజేపీ మాజీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్‌కు బిగ్ షాక్ తగిలింది. గతంలో అతడిని జీవిత ఖైదు శిక్షను నిలిపివేస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను తాజాగా సుప్రీంకోర్టు రద్దు చేసింది. సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్‌మాల్య బాగ్చీలతో కూడిన ధర్మాసనం ఈ కీలక తీర్పునిచ్చింది. సెంగార్ శిక్షాకాలాన్ని నిలిపివేయాలా వద్దా అనే అంశంపై జూన్‌లో కోర్టులకు వేసవి సెలవులు ప్రారంభమయ్యేలోపు నిష్పక్షపాతంగా నిర్ణయం తీసుకోవాలని ఢిల్లీ హైకోర్టును ఆదేశాలు జారీ చేసింది. ఈ ప్రక్రియలో బాధితురాలి తరఫు న్యాయవాదితో సహా అన్ని పక్షాల వాదనలను వినాలని స్పష్టం చేసింది.
Also Read: వచ్చే ఏడాది నుంచి ఆన్‌లైన్‌లో నీట్ పరీక్ష.. కేంద్రం సంచలన ప్రకటన
గతేడాది డిసెంబర్‌లో హైకోర్టు సెంగార్‌కు బెయిల్ మంజూరు చేసింది. కానీ సుప్రీంకోర్టు ఆ ఉత్తర్వుల అమలుపై అప్పట్లోనే స్టే విధించింది. తాజా విచారణ సందర్భంగా సెంగార్ తరఫు న్యాయవాది ఎన్. హరిహరన్ వాదనలు వినిపించారు. అప్పట్లో బాధితురాలు మైనర్ కాదని చెప్పారు. 2017లో ఉద్యోగం ఇప్పిస్తామనే సాకుతో 15 ఏళ్ల మైనర్ బాలికపై సెంగార్ తన నివాసంలో అఘాయిత్యానికి పాల్పడ్డారని.. అందుకే ఆ చిన్నారికి న్యాయం జరగాల్సిందేనని సీబీఐ కూడా బలంగా వాదించింది. అలాగే బాధితురాలి తండ్రి కస్టడీ మరణం కేసులో కూడా సెంగార్ దోషిగా తేలిన విషయాన్ని కూడా ప్రత్యేకంగా ప్రస్తావించింది.
ఈ కేసులో చట్టపరమైన అంశాలను పరిశీలించాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. కుల్దీప్ సింగ్ సెంగార్‌పై పోక్సో చట్టంలోని సెక్షన్ 5(c) ప్రకారం 'ప్రజా సేవకుడి చేత తీవ్రమైన లైంగిక దాడి' కింద జీవిద ఖైదు ఎందుకు విధించలేదు అనే విషయాన్ని తాము పరిశీలిస్తామని పేర్కొంది.సెంగార్‌కు గతంలో లభించిన ఉపశమనాన్ని తాజాగా సుప్రీంకోర్టు రద్దు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. దీంతో అతడు జైలు నుంచి బయటకు వచ్చే దారులన్నీ మూసుకుపోయాయి. ఇక అతడు జీవిత ఖైదుగా జైల్లోనే శిక్ష అనుభవించనున్నారు.
Follow Us