Bengaluru: కండోమ్స్‌ సేల్స్‌లో బెంగళూరు టాప్

భారత్ అన్ని రంగాల్లో దూసుకుపోతోంది దాంతో పాటూ కండోమ్ సేల్స్‌లో కూడా. ఐటీ, సాఫ్ట్‌ వేర్‌‌లకు ప్రసిద్ధి అయిన బెంగళూరు ఇప్పుడు కండోమ్స్ వాడకంలో కూడా టాప్‌లో నిలిచింది.  దీంతో ఇప్పుడు టెక్ సిటీ కాస్తా కండోమ్ సిటీగా మారుతోంది. 

author-image
By Manogna alamuru
New Update
bengaluru

condoms

భారతదేశం అభివృద్ధిలో దూసుకుపోతోంది. అన్ని రంగాల్లో ప్రపంచానికి పోటీ ఇస్తోంది. బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్ లాంటి నగరాలు అయితే అన్ని విషయాల్లోనూ నువ్వా నేనా అన్నట్టు సాగుతున్నాయి. ఐటీ, సాఫ్ట్వేర్ లాంటి వాఇల్లో అయితే ఒకదానిని మించి మరొకటి పోటీ పడుతున్నాయి. అయితే ఎన్ని వచ్చినా ఈ విషయంలో బెంగళూరును బీట్ చేసేవారే లేరు. ఇప్పుడు బెంగళూరు మర విషయంలో కూడా టాప్‌గా నిస్తోందిట. ఇది వినడానికి కొంత వింతైన విషయమే అయినా చెప్పుకోక తప్పదు. టెక్ సిటీ ఇప్పుడు కండోమ్ సిటీగా మారుతుందని చెబుతున్నారు. 

రాత్రి 10 నుంచి 11 మధ్యలో..

ఏటీ కండోమ్ సిటీనా...ఏంటీ అని ఆశ్చర్యపోతున్నారా...అందులో ఆంత ఆశ్చర్యపోవడానికి ఏమీ లేదండి. దేశంలో అత్యంత ఎక్కువగా కండోమ్స్ బెంగళూరులో అమ్ముడుపోతున్నాయని చెబుతోంది స్విగ్గీ. స్విగ్గీ ఇన్స్టా మార్ట్‌లో రాత్రి 10 నుంచి 11 గంటల మధ్యలో అత్యంత రహస్యంగా ఇకడ కండోమ్స్ సేల్ అవుతున్నాయి చెప్పింది. దీని తర్వాత స్థానంలో ఢిల్లీ, హైదరాబాద్‌ నగరాలు ఉన్నాయి. రాత్రి 10 గంటల తర్వాత కస్టమర్లు ఎక్కువగా కండోమ్‌లే కొనుగోలు చేస్తున్నట్లుగా తెలిపింది ఇన్స్టామార్ట్. ఆన్‌లైన్ షాపింగ్‌లో ఇవే ఎక్కువగా కొంటున్నట్లుగా వెల్లడించింది. 140 ఆర్డర్స్‌లో ఒక సెక్స్ వెల్నెస్ ఐటెమ్ ఉంటుందని తెలిపింది. బెంగళూరు వాసులు కండోమ్స్ ఎక్కువగా కొనుగోలు చేసినట్లు స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ వార్షిక నివేదికలో తెలిపింది. కండోమ్స్‌తో పాఊ రాత్రి పదిగంటల తర్వాత మసాలా ఫ్లేవర్ చిపస్ కుర్కురేల ఆర్డర్లు ఎక్కువగా వస్తాయి అని చెబుతోంది స్విగ్గీ ఇన్స్టామార్ట్.

Also Read: Mumbai: ఇండిగో విమానం 16గంటలు లేట్..ఎయిర్పోర్ట్‌లో ప్రయాణికులు పాట్లు

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Muda case: ముడా స్కామ్ కేసులో సిద్దరామయ్యకు కోర్టు షాక్..!

ముడా కేసులో కర్ణాటక సీఎం సిద్దరామయ్యకు ఎదురుదెబ్బ తగిలింది. విచారణను కొనసాగించేందుకు లోకాయుక్త పోలీసులకు ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు అనుమతించింది. లోకాయుక్త పోలీసులు దాఖలు చేసిన బిరిపోర్ట్ విభేదిస్తూ ఈడీ దాఖలు చేసిన పిటిషన్‌పై తీర్పును వాయిదా వేసింది.

New Update
MUDA Scam: కర్ణాటకలో ముడా స్కామ్ కలకలం.. సిద్ధరామయ్య భార్యపై కేసు

కర్ణాటక సీఎం సిద్ధరామయ్యను ముడా స్కామ్ కేసు వేంటాడుతోంది. మైసూరు అర్బన్ డవలప్‌మెంట్ అథారిటీ కేసులో ఆయనకు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ముడా కేసులో విచారణను కొనసాగించేందుకు లోకాయుక్త పోలీసులకు బెంగళూరు ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు మంగళవారం అనుమతించింది. కర్ణాటక లోకాయుక్త పోలీసులు దాఖలు చేసిన బి రిపోర్ట్ తో విభేదిస్తూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసిన పిటిషన్‌పై తీర్పును ప్రత్యేక కోర్టు వాయిదా వేసింది.

Also read: ఖమ్మం వరదల్లో చనిపోయిన అగ్రికల్చర్ సైంటిస్ట్‌కు అరుదైన గౌరవం

ముడా భూముల కేటాయింపులో సిద్ధరామయ్య అవినీతికి పాల్పడలేదని లోకాయుక్త పోలీసులు ఇటీవల క్లీన్‌చిట్ ఇచ్చారు. అయితే దీనిని ఈడీ, హక్కుల కార్యకర్త స్నేహమయి కృష్ణ సవాలు చేశారు. ఈ కేసులో కొన్ని కీలక కోణాల్లో విచారణ జరగలేదని ఈడీ, స్నేహమయి కృష్ణ వాదించారు. మరింత లోతుగా దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. దీనిపై న్యాయమూర్తి సంతోష్ గజానన్ భట్‌ విచారణ చేపట్టారు. లోకాయుక్త పోలీసులు పూర్తి దర్యాప్తు నివేదిక సమర్పించిన తర్వాతే బి రిపోర్ట్ పై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేస్తూ, తదుపరి విచారణను మే 7న తేదీకి వాయిదా వేశారు. దీనికి ముందు, సిద్ధరామయ్య, మరో ముగ్గురిపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి మైసూరు డివిజన్ లోకాయుక్త పోలీసులు ప్రాథమిక నివేదకను సమర్పించారు. అయితే విచారణ కేవలం నలుగురు వ్యక్తులకే పరిమితం కాదని, ఇందులో ప్రమేయమున్న అందరికీ దర్యాప్తు జరపాలని, సమగ్ర నివేదిక సమర్పించాలని కోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది.

Also read: Mirabhai Chanu: ఒలంపిక్స్ విజేత మీరాభాయ్ చానుకు కీలక పదవి

Advertisment
Advertisment
Advertisment