West Bengal Free Bus: మహిళలకు ఫ్రీ బస్సు.. జూన్ 1 నుంచి అమలు

పశ్చిమ బెంగాల్‌లో మొదటిసారిగా బీజేపీ ప్రభుత్వం కొలువుదీరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అక్కడి మహిళలలకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. జూన్ 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ప్రభుత్వ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించనున్నట్లు ప్రకటించింది.

New Update
Bengal to roll out Ayushman Bharat, free bus travel for women from June 1

Bengal to roll out Ayushman Bharat, free bus travel for women from June 1

West Bengal Free Bus: పశ్చిమ బెంగాల్‌లో మొదటిసారిగా బీజేపీ ప్రభుత్వం కొలువుదీరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అక్కడి మహిళలలకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. జూన్ 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ప్రభుత్వ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించనున్నట్లు ప్రకటించింది. పెరుగుతున్న జీవన వ్యయాల నేపథ్యంలో సామాన్య, మధ్యతరగతి కుటుంబాలపై ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు . ఈ ఫ్రీ బస్సు సౌకర్యం ద్వారా ప్రజా రవాణాపై ఆధారపడి ప్రయాణించే లక్షలాది మంది మహిళా ఉద్యోగులు, విద్యార్థినులకు ఇది మేలు చేకూరనుందని పేర్కొన్నారు.

Also Read: కేంద్రం కీలక ప్రకటన.. వీబీ జీ రామ్‌ జీ చట్టం ఎప్పటి నుంచి అమల్లోకంటే ?

ఫ్రీ బస్సుతో పాటు  ఆరోగ్య బీమా పథకమైన 'ఆయుష్మాన్ భారత్'ను కూడా జూన్ 1 నుంచి రాష్ట్రంలో పక్కాగా అమలు చేయాలని బీజేపీ నిర్ణయించింది. ఈ స్కీమ్‌ను టీఎంసీ ప్రభుత్వం అమలు చేయలేదు. కమలం పార్టీ అధికారంలోకి రావడంతో ఈ స్కీమ్‌ మరికొన్ని రోజుల్లో అమలు కానుంది. అయితే ఆయుష్మాన్ భారత్ అమల్లోకి వచ్చినప్పటికీ.. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న ఇతర సామాజిక ఆరోగ్య, సంక్షేమ పథకాలు యథావిధిగా ప్రజలకు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు. 

Also Read: ఏంటీ ఈ పోక్సో చట్టం? : అరెస్ట్ తప్పదు.. బెయిల్ దొరకదు.. శిక్ష ఏంటో తెలుసా?

ఇదిలాఉండగా నిరుద్యోగ యువతకు కూడా బీజేపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. పాఠశాలల్లో ఉపాధ్యాయ, సిబ్బంది ఉద్యోగాల భర్తీకి సంబంధించి అభ్యర్థుల గరిష్ట వయో పరిమితిని మరో అయిదేళ్ల పాటు పొడిగించే ప్రతిపాదనకు మంత్రివర్గం అధికారికంగా ఆమోదించింది. ఈ నిర్ణయంతో ఎన్నో ఏళ్లుగా నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్న వేలాది మంది నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగం సాధించేందుకు మరో మంచి లభించినట్లయింది. తాము ఎన్నికల్లో ఇచ్చిన ఇతర హామీలను కూడా త్వరలోనే దశలవారీగా అమలు చేస్తామని బీజేపీ ప్రభుత్వం పేర్కొంది. 

Advertisment
తాజా కథనాలు