/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-2024-08-16T174038.219.jpg)
Kolkata Junior Doctors:
తమ తోటి ట్రైనీ డాక్టర్‌కు న్యాయం చేయాలని..జూనియర్ డాక్టర్ల డ్యూటీల విషయంలో రూల్స్ మార్చాలని డిమాండ్ చేస్తూ జూడాలు నెలరోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. ప్రభుత్వం, సుప్రీంకోర్టు ఎవరు ఎంత చెప్పినా తమకు న్యాయం జరిగే వరకూ నిరసనలు ఆపేది లేదని భీష్మించుకుని కూర్చున్నారు. బెంగాల్ ఛీప్ మినిస్టర్ మమతా బెనర్జీ వీరితో ఐదుసార్లు చర్చలు జరపడానికి ప్రయత్నించారు. చివరకు ఐదోసారి జూడాలు దీదీతో మాట్లాడ్డానికి ఒప్పుకున్నారు. ఈ సందర్భంగా వారి డిమాండ్లకు మమత అంగీకరించారు. కోల్‌కతా నగర పోలీస్ కమిషనర్ వినీత్ గోయల్‌ను బదిలీ చేశారు. నూతన కమిషనర్‌గా మనోజ్ కుమార్ వర్మను నియమించారు. మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ కౌస్తవ్ నాయక్, హెల్ సర్వీస్ డైరెక్టర్ దేవాశిష్ హల్దేర్‌లను వారి పోస్టుల నుంచి తొలిగించనున్నట్లు ప్రకటించారు. దాని తర్వాత ఇప్పుడు తాము ఆందోళనను విరమిస్తున్నట్టు ప్రకటించారు. ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చడంతో ఆందోళన విరమించామని చెప్పారు. శనివారం నుంచి విధుల్లోకి జాయిన్ అవుతామని చెప్పారు.
Also Read: Hezbollah: హెజ్బుల్లా స్థావరాల మీద విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్