/rtv/media/media_files/2025/02/25/mV4sOSJ5f2WxwBTZoS1T.jpg)
Sutandra-Chattopadhyay
Bengal Dancer : ఆడవారిపై అఘాయిత్యాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. మద్యం, మాదకద్రవ్యాల వినియోగంతో తాము ఏం చేస్తున్నామో కూడా తెలియని ఉన్మాదులుగా మారుతున్నారు. ఆ మత్తులో విచక్షణ జ్ఞానాన్ని కోల్పొయి కామాంధులుగా మారుతున్నారు. అలాంటి కామంధులు వికృత చేష్టలకు ఓ లేడీ డ్యాన్సర్ ప్రాణాలు పొగొట్టుకుంది. ఈ విషాద ఘటన పశ్చీమ బెంగాల్ లోని కోల్ కతాలో వెలుగు చూసింది. ఓ లేడీ డ్యాన్సర్ పై అఘాయిత్యం చేయాలనే ప్రయత్నంలో 10 కిలోమీటర్ల దాకా ఆమె ప్రయాణిస్తున్న కారును వెంబడించారు కొందరు ఉన్మాదులు. వారి నుంచి తప్పించుకునే క్రమంలో కారు అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఆమె మృతి చెందింది. ఆమెతో పాటు ఉన్నవారికి తీవ్ర గాయాలయ్యాయి.
ఇది కూడా చూడండి: Breaking News : కాంగ్రెస్ మాజీ ఎంపీకి బిగ్ షాక్.. ఢిల్లీ కోర్టు జీవిత ఖైదు!
బెంగాల్ హూగ్లీ జిల్లాలోని చందర్ నగర్ కు చెందిన లేడీ డ్యాన్సర్ సుతాంద్రా ఛటోపాధ్యాయ, ఈవెంట్ మేనేజర్ పై కొందరు ఆకతాయిలు మద్యం సేవించి లైంగికదాడికి యత్నించారు. ఆమె తన తోటి ఉద్యోగులతో కలిసి ఆదివారం అర్ధరాత్రి తర్వాత బిహార్ లోని గయాకు వెళ్తుండగా.. ఆమెను కొంతమంది దుండగులు చూశారు. మద్యం మత్తులో ఆమెను ఎలాగైనా దక్కించుకోవాలని ఆమె ప్రయాణిస్తున్న కారును వెంబడించారు. కారులో గట్టిగా కేకలు వేస్తూ.. బూతులు తిడుతూ ఛటోపాధ్యాయను ఛేజ్ చేశారు. ఇది గమనించిన డ్రైవర్ స్పీడ్ పెంచాడు. వాళ్లు కూడా వేగం పెంచారు.
ఇది కూడా చూడండి: This Week Movies: మహాశివరాత్రి స్పెషల్.. థియేటర్, ఓటీటీలో సినిమాల జాతర! లిస్ట్ ఇదే
వాళ్లను తప్పించుకునే క్రమంలో డ్రైవర్ కారు వేగాన్ని మరింత పెంచాడు. వాళ్లు కూడా అదే వేగంతో వచ్చి కారును ఢీ కొట్టారు. ఈ క్రమంలో కారులోని సుతాంద్రా ఛటోపాధ్యాయ తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో ఉన్నారు. ఛటోపాధ్యాయ డ్రైవర్ రాజేడియో శర్మ ఇచ్చిన స్టేట్ మెంట్ ను పోలీసులు రికార్డు చేశారు. నిందితులను వీలైనంత త్వరలో పట్టుకుంటామని తెలిపారు.
Also read : ఏపీలో మెగా డీఎస్సీ.. శుభవార్త చెప్పిన సీఎం చంద్రబాబు!
Also read : చంద్రబాబుకు హ్యాట్సాఫ్ ..గవర్నర్కు క్షమాపణలు చెప్పిన పవన్ కల్యాణ్!