/rtv/media/media_files/2026/03/10/team-india-2026-03-10-12-39-24.jpg)
ICC Men's T20 World Cup 2026 champions
ICC Men's T20 World Cup 2026 : టీమిండియా మరోసారి తన సత్తా చాటింది. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో అహమ్మదాబాద్ వేదికగా నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఫైనల్లో న్యూజిలాండ్ ను ఊచకోత కోసింది. తొలుత భారత బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడారు. ఆ తరువాత బౌలర్లు నిప్పులు చెరిగే బంతులతో కివీస్ బ్యాటర్లకు చుక్కలు చూపించారు. ICC Men's T20 World Cup 2026 ఫైనల్‌లో భారీ విజయాన్ని నమోదు చేసి విజేతగా నిలిచారు. దీంతో టీ20 వరల్డ్‌కప్-2026 విజేత అయిన భారత జట్టుకు బీసీసీఐ భారీ నగదు బహుమతిని ప్రకటించింది. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని టీమిండియాకు రూ.131 కోట్ల రివార్డును అందజేయనున్నట్లు బోర్డు ఎక్స్ వేదికగా వెల్లడించింది.
మరోవైపు ఐసీసీ ప్రకటించిన వివరాల ప్రకారం.. టీ20లో ఛాంపియన్‌గా నిలిచిన భారత్‌కు టోర్నమెంట్ ప్రైజ్ పూల్ నుండి 3 మిలియన్ డాలర్లు అంటే దాదాపు రూ. 27.48 కోట్లు లభించే అవకాశం ఉంది. రన్నరప్‌గా నిలిచిన న్యూజిలాండ్‌కు 1.6 మిలియన్ డాలర్లు (సుమారు రూ.14.65 కోట్లు) బహుమతిగా అందుతాయి. మొత్తం టోర్నమెంట్ ప్రైజ్ పూల్ సుమారు 13.5 మిలియన్ డాలర్లు.. అంటే దాదాపు 120 కోట్లకు పైగా ఉంది. టోర్నమెంట్‌లో పాల్గొన్న ప్రతి జట్టుకు ఐసీసీ వారి ప్రదర్శన ఆధారంగా బహుమతులను కేటాయించింది.
కేవలం గెలిచిన జట్టుకే కాకుండా సెమీ ఫైనల్స్ వరకు చేరి ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయిన జట్లకు కూడా భారీ మొత్తాన్ని ప్రకటించారు. ఈ దశలో ఓడిపోయిన South Africa national cricket team, England national cricket team ఒక్కొక్కటి 790,000 డాలర్లు (దాదాపు రూ.7.24 కోట్లు) కేటాయించింది. అలాగే సూపర్-8 దశకు చేరుకుని సెమీ ఫైనల్స్‌కు వెళ్లలేని జట్లు ఒక్కొక్కటి 380,000 (సుమారు 3.48 కోట్లు) సంపాదించాయి. గ్రూప్ దశలోనే నిష్క్రమించిన జట్లకు కూడా 250,000 డాలర్లు (దాదాపు రూ. 2.29 కోట్లు) అందుకున్నాయి.
బీసీసీఐ రూ. 131 కోట్ల క్యాష్ రివార్డు
సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని టీమిండియాకు రూ.131 కోట్ల రివార్డును అందజేయనున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. ఈ విషయాన్ని బోర్డు ఎక్స్ వేదికగా వెల్లడించింది. "టీ20 ప్రపంచకప్ చరిత్రలో టైటిల్‌ను రిటైన్ చేసుకున్నతొలి జట్టుగా భారత్ రికార్డు సృష్టించడం విశేషం. అంతేకాదు, టీ20 ప్రపంచకప్ ట్రోఫీని మూడుసార్లు గెలిచిన ఏకైక జట్టుగా టీమిండియా నిలిచింది. అందుకే రూ. 131 కోట్ల క్యాష్ రివార్డు ఇవ్వాలని నిర్ణయించాము. ఈ అద్భుత విజయానికి కారకులైన ఆటగాళ్లు, సపోర్ట్ స్టాఫ్, సెలెక్టర్లకు అభినందనలు" అని బీసీసీఐ ఒక ప్రకటన విడుదల చేసింది.
ఇదిలా ఉండగా రోహిత్ శర్మ నేతృత్వంలో గతంలో టీ20 ప్రపంచకప్-2024ను భారత్ గెలిచినప్పుడు బీసీసీఐ రూ. 125 కోట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే వరుసగా రెండోసారి ఛాంపియన్లుగా నిలిచినందుకు ఆ మొత్తాన్ని పెంచి రూ. 131 కోట్లు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. కాగా ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ నుంచి కూడా భారత జట్టుకు భారీ మొత్తం అందిన విషయం తెలిసిందే. ఛాంపియన్‌గా నిలిచినందుకు ఐసీసీ భారత్‌కు సుమారు రూ. 27.48 కోట్ల ప్రైజ్‌మనీనీ అందజేసింది. దీంతో పాటు గ్రూపు స్టేజి, సూపర్-8 దశల్లో గెలిచిన ప్రతీ మ్యాచ్‌కు అదనంగా సుమారు రూ. 28.6 లక్షల చొప్పున భారత్‌కు బోనస్ లభించే అవకాశం ఉంది.
Follow Us