బంగ్లాదేశ్‌ అల్లర్లే TMCని గద్జె దించాయా ?

పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాలు మమతా బెనర్జీ ఏకఛత్రాధిపత్యాన్ని తలకిందులు చేశాయి. బీజేపీ గెలుపు వెనుక బంగ్లాదేశ్‌ అంతర్గత సంక్షోభం కూడా ప్రధాన పోత్ర పోషించినట్లు కనిపిస్తోంది.

New Update
Bangladesh played a big role in BJP’s West Bengal win

Bangladesh played a big role in BJP’s West Bengal win

పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాలు మమతా బెనర్జీ ఏకఛత్రాధిపత్యాన్ని తలకిందులు చేశాయి. బీజేపీ గెలుపు వెనుక బంగ్లాదేశ్‌ అంతర్గత సంక్షోభం కూడా ప్రధాన పోత్ర పోషించినట్లు కనిపిస్తోంది.  ఆ దేశంలో షేక్ హసీనా ప్రభుత్వం పతనం, ఆ తర్వాత మైనార్టీ హిందువులపై దాడులు పెరగడం లాంటి పరిస్థితులు పశ్చిమ బెంగాల్‌పై కూడా తీవ్ర ప్రభావం చూపించాయి. ఈ అస్థిరతను నివారించడంలో, సరిహద్దుల నుంచి అక్రమ చొరబాట్లను నియంత్రించడంలో టీఎంసీ విఫలమైందనే భావన బెంగాల్‌ ఓటర్లు భావించారు. 

2025 చివర్లో బంగ్లాదేశ్‌లో హిందూ వస్త్ర కార్మికుడు దీపు చంద్ర దాస్ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ ఘటన తర్వాత పశ్చిమ బెంగాల్‌లో పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. కోల్‌కతాలోని బంగ్లాదేశ్ డిప్యూటీ హైకమిషన్ ఎదుట హిందూ సన్యాసులు ఆందోళన చేపట్టారు. వీళ్లపై మమతా బెనర్జీ సర్కార్ లాఠీఛార్జ్ చేయించడం రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది. కాషాయ వస్త్రాలు ధరించిన వారిపై పోలీసుల దాడులను బీజేపీ తన ప్రచార అస్త్రంగా మార్చేసుకుంది. టీఎంసీ ప్రభుత్వం కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే బంగ్లాదేశ్ చొరబాటుదారులకు సపోర్ట్ చేస్తోందని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లగలిగింది. అలాగే బెంగాల్‌లోని హిందువులకు భద్రత లేదనే సందేశాన్ని ప్రచారం చేసింది. 

Also Read: మీ సపోర్ట్ కావాలి మోదీజీ.. విజయ్ సంచలన ట్వీట్!

ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యంగా బీజేపీ నేతలు 'అక్రమ వలసలు' అనే పదం ఎక్కువగా వాడారు. దీంతో అక్కడ భద్రతాపరమైన ఆందోళనలు పెరిగిపోయాయి. బెంగాల్ ఓటర్ల జాబితాలో ఏకంగా కోటికి పైగా అక్రమ వలసదారులు చేరిపోయారని బీజేపీ నేతలు ప్రచారం చేశారు. స్థానికుల ఉపాధికి, భద్రతకు ముప్పు ఉంటుందనే వాదనను ప్రజల్లోకి తీసుకెళ్లారు. దీంతో సరిహద్దుల గుండా జరుగుతున్న అక్రమ రవాణాలు, జనాభా మార్పుల అంశాలు క్షేత్రస్థాయిలో చర్చలకు దారితీశాయి. 

బెంగాల్ ఫలితాల్లో 'మతువా' సామాజిక వర్గం కీలక పాత్ర పోషించింది. బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చిన ఈ వర్గ ప్రజలు.. తమ పౌరసత్వం, భద్రత విషయంలో ఎటూ తేల్చుకోలేని స్థితిలో ఉన్నాయి. దీంతో బీజేపీ మాత్రమే తమకు అండగా నిలుస్తుందని భావించారు. బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులు ఈ కమ్యూనిటీలో భయాందోళనలను పెంచాయి. దీంతో వాళ్లకి పౌరసత్వ హామీ ఇవ్వడం, రక్షణ కల్పించడం లాంటి అంశాలు బీజేపీకి లాభం చేకూర్చాయి. ఇలా స్థానిక సమస్యలతో పాటు అంతర్జాతీయ పరిణామాలు తోడవ్వడం వల్ల టీఎంసీ ప్రభుత్వాన్ని బీజేపీ విజయవంతంగా పడగొట్టగలిగింది. 

Also Read: పశ్చిమ బెంగాల్ సీఎం ఎవరు ?.. రేసులో ముగ్గురు నేతలు

Advertisment
తాజా కథనాలు