/rtv/media/media_files/2024/11/05/id8litA7yPAhjlG9maZX.jpg)
హిమాచల్‌ప్రదేశ్‌లోని కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే బంబర్ ఠాకూర్‌పై కాల్పులు జరిగాయి. ఆయనపై దుండగులు 12 రౌండ్లు కాల్పులు జరిపి పరారయ్యారు. ఈ కాల్పుల్లో బంబర్ ఠాకూర్ తీవ్రంగా గాయాలపాలయ్యారు. ఈ ఘటనలో ఆయన కాలుకు బుల్లెట్ దిగినట్లు తెలుస్తోంది. ఆయన సెక్యురిటీ అధికారి కూడా గాయపడ్డారు. బంబర్ ఠూకూర్ ఇంటి వద్దే ఈ కాల్పులు చోటుచేసుకున్నాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ దాడి ఎవరు చేశారనేదానిపై ఇంకా క్లారిటీ లేదు. రంగంలోకి దిగిన పోలీసులు దీనిపై దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజ్‌ల ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు.
बंबर ठाकुर पर गोली लगने का CCTV आया सामने#Bilaspur #BumberThakur #CCTVVideo #HimachalPradesh pic.twitter.com/PEdY1VMye9
— Punjab Kesari-Himachal (@himachalkesari) March 14, 2025
ఇదిలాఉండగా..ఇటీవల గోవా మాజీ ఎమ్మెల్యే లావూ మావ్లేదార్ (68) కూడా ఓ ఆటో డ్రైవర్ దాడి చేసిన అనంతరం కుప్పకూలి మరణించారు. ఇక వివరాల్లోకి వెళ్తే గత నెలలో లావూ మావ్లేదార్ కర్ణాటకలోని బెలగావిలో పర్యటించారు. ఖడేబజార్‌లోని ఓ హోటల్‌లో సూట్ రూం బుక్ చేసుకున్నారు. హోటల్ వైపు వెళ్తుండగా.. ఆయన కారు ఓ ఆటోను ఢీకొంది. దీంతో ఆ ఆటోడ్రైవర్ మావ్లేదార్‌తో గొవడకు దిగాడు. ఆయనపై దాడి కూడా చేశాడు.
Also Read: తమిళనాడులోనూ లిక్కర్ స్కామ్.. మొత్తం వేయి కోట్లు.. షాకింగ్ విషయాలు!
తన ఆటోకు జరిగిన ప్రమాదంపై డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశాడు. కానీ ఇందుకు మావ్లేదార్ ఒప్పుకోలేదు. హోటల్ వైపు తన ప్రయాణాన్ని కొనసాగించారు. అనంతరం హోటల్‌కు చేరుకున్నాక ఆ ప్రాంగణంలోనే మావ్లేదార్ కుప్పకూలిపోయారు. ఆయన్ని వెంటనే ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
Also Read: రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో హోలికా దహన్ ..లక్షలాది కొబ్బరికాయలతో...