/rtv/media/media_files/2025/01/21/KupgkfTOzI5xEOIhhh4H.jpg)
Chalapati Photograph: (Chalapati)
Maoist Encounter: ఒడిశా-ఛత్తీస్‌గఢ్(Chhattisgarh) సరిహద్దులో మంగళవారం భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్ట్‌లకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. దాదాపుగా20 మంది మావోయిస్ట్‌లు చనిపోయారు. 14 మంది మృతుల డెడ్ బాడీలు దొరికాయి. చనిపోయిన మావోయిస్ట్‌లలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. అయితే ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు అగ్రనేతలు మృతి చెందినట్లుగా తెలుస్తోంది. సెంట్రల్ కమిటీ సభ్యుడు మనోజ్, ఛత్తీస్‌గఢ్ మావోయిస్ట్ పార్టీ ఇంఛార్జ్ జయరాం అలియాస్ చలపతి పాటు మరో కీలక అగ్రనేత వీరిలో ఉన్నారని సమాచారం. మావోయిస్టు కార్యదర్శి చలపతిపై రూ. కోటి రివార్డు ఉందని అధికారులు వెల్లడించారు. చలపతి అలియాస్ రాంచంద్రారెడ్డి స్వస్థలం చిత్తూరు జిల్లా. అతని మరణం ఈ ప్రాంతంలో మావోయిస్టు ఉద్యమానికి పెద్ద ఎదురుదెబ్బ అనే చెప్పుకోవచ్చు.
Also Read: Akkineni Akhil: అఖిల్ పెళ్ళి డేట్ ఫిక్స్.. ఆరోజు నుంచి ఘనంగా పెళ్లి వేడుకలు
ఎన్‌కౌంటర్ అనంతరం.. భారీగా ఆయుధాలు, వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టుల అంతమే లక్ష్యంగా కోబ్రా, డీఆర్జీ, సీఆర్పీఎఫ్ (CRPF), ఒడిశా SOG బలగాలు చేపట్టిన ఈ ఆపరేషన్‌లో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు మృతిచెందారని అధికారులు తెలిపారు.
Also Read: జ్యూస్లో విషం కలిపి లవర్ను చంపిన కిలాడీ.. కోర్టు సంచలన తీర్పు
అమిత్ షా(Amit Shah) ప్రసంశలు..
ఇక ఒడిశా ఎన్‌కౌంటర్‌పై కేంద్రహోం మంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు. ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న భద్రతా సిబ్బందికి అమిత్ షా ప్రసంశలు కురిపించారు. మన భద్రతాదళాలు సాధించిన గొప్ప విజయమని పేర్కొన్నారు. నక్సల్స్ లేని భారత్ దిశగా ఇది కీలక అడుగు అని పేర్కొన్నారు. దేశంలో నక్సలిజం కొన ఊపిరితో ఉందన్నారు. దేశంలో నక్సలిజం చివరి దశకు చేరింది- అమిత్ షా అభిప్రాయపడ్దారు.
Also Read: Bigg Boss: ఫ్యాన్స్ కి షాక్! ఇకపై బిగ్ బాస్ కి కొత్త హోస్ట్.. షోకు గుడ్ బై చెబుతూ హీరో పోస్ట్!
తాజా ఎన్‌కౌంటర్‌తో ఛత్తీస్‌గఢ్‌లో ఈ ఏడాది మావోయిస్టుల మరణాల సంఖ్య 28కి చేరగా, గతేడాది వేర్వేరు ఎన్‌కౌంటర్లలో 219 మంది మావోయిస్టులు మరణించారు. అంతేకాకుండా, 2024లో రాష్ట్రంలో 992 మంది వామపక్ష తీవ్రవాదులను అరెస్టు చేయగా, 837 మంది లొంగిపోయారు. ఒడిశాలో మావోయిస్టుల హింస తగ్గుముఖం పట్టగా, చత్తీస్‌గఢ్ నుంచి మావోయిస్టుల రాకపోకలతో కంధమాల్-బౌధ్-కలాహండి-నువాపాడ వంటి ప్రాంతాలు ఆందోళన చెందుతున్నాయని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ఈ ప్రాంతంలో వామపక్ష తీవ్రవాదాన్ని నిర్మూలించేందుకు ఉమ్మడి బలగాలు తమ ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నాయి.
Also Read : ఐఐటీ బాబాను బహిష్కరించిన సొంత అఖాడా.. అసలు కారణం ఏంటంటే!