ఇజ్రాయెల్‌ను చూసి మనం నేర్చుకోవాలి.. సీఎం హిమంత బిశ్వ శర్మ సంచలన వ్యాఖ్యలు

అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. మన చుట్టూ శత్రువులు ఉన్నాకూడా మనుగడ ఎలా సాగించాలో ఇజ్రాయెల్‌ను చూసి నేర్చుకోవాలని అన్నారు. అస్సాం సరిహద్దులు ఎప్పుడూ కూడా సురక్షితంగా లేవని తెలిపారు.

New Update
Himantha Bishwa Sharma

అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. మన చుట్టూ శత్రువులు ఉన్నాకూడా మనుగడ ఎలా సాగించాలో ఇజ్రాయెల్‌ను చూసి నేర్చుకోవాలని అన్నారు. అస్సాం సరిహద్దులు ఎప్పుడూ కూడా సురక్షితంగా లేవని తెలిపారు. రాష్ట్రంలో చాలా జిల్లాల్లో అస్సామీలు మైనార్టీలుగా ఉన్నారంటూ వ్యాఖ్యానించారు. '' బంగ్లాదేశ్‌, పశ్చిమబెంగాల్, మయన్మార్‌తో మనకు సరిహద్దులు ఉన్నాయి. 

Also Read: మనోజ్ నువ్వు నా గుండెల మీద తన్నావ్..మోహన్ బాబు

12 జిల్లాల్లో అస్సామీలు ఇంకా మైనార్టీలుగానే ఉన్నారు. మనచుట్టూ శత్రువులు ఉన్నప్పటికీ విజ్ఞానం, టెక్నాలజీని వినియోగించుకొని ఇజ్రాయెల్ బలమైన దేశంగా ఎదిగింది. ఇలాంటి దేశాల చరిత్రలు తెలుసుకోవాలి. అప్పుడే ఒక జాతిగా మనం మనుగడ సాగించగమని'' హిమంత బిశ్వ శర్మ అన్నారు. 

Also Read: అమెరికాకు వెళ్లాలనుకునేవారికి షాక్.. భారీగా తగ్గిన వీసాలు

మరోవైపు అస్సాం ఒప్పందం జరిగి 40 ఏళ్లు గడిస్తున్న కూడా బయటి శక్తుల నుంచి రాష్ట్రానికి ముప్పు తొలగిపోలేదని పేర్కొన్నారు. అలాగే ప్రతీరోజూ జనాభాలో మార్పు జరుగుతోందని.. రాష్ట్రంలో స్థానిక ఆదివాసీలు తమ హక్కులను కోల్పోతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అస్సాం ప్రజలకు మరింత రక్షణ కల్పించే అస్సాం క్లాజ్ 6పై అత్యున్నత స్థాయి కమిటీ సిఫార్సు చేసిన ప్రతిపాదనలు అమలుచేయడంతో పాటు మరిన్ని చర్యలపై ప్రభుత్వం దృష్టిసారించిందని పేర్కొన్నారు. 

Also Read: బెళగావిలో రణరంగం..రిజర్వేషన్ల కోసం ఆందోళన

Also Read: హైదరాబాద్‌కు రానున్న ద్రౌపది ముర్ము.. సీఎస్ శాంతి కుమారీ కీలక ఆదేశాలు

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

India: పాకిస్తానీయులకు ముగిసిన డెడ్ లైన్..537 మంది వెనక్కు..

టెంపరరీ వీసాలతో భారత్ కు వచ్చిన పాక్ పౌరులకు భారత ప్రభుత్వం ఇచ్చిన గడువు ఈ రోజు తో ముగిసింది. దీంతో ఇప్పటి వరకు 537 మంది అట్టారీ-వాఘా సరిహద్దు మార్గంలో పాకిస్థాన్‌కు వెళ్ళారని తెలుస్తోంది. వీరిలో తొమ్మది మంది దౌత్య వేత్తలు, అధికారులు ఉన్నారు.

New Update
pak

Pakistan People

పాకిస్తానీయులు ఇండియాలో ఉండటంపై భారత ప్రభుత్వం సీరియస్ గా ఉంది. పహల్గామ్ లో దాడి జరిగిన తర్వాత పాక్ పౌరులు తమ దేశం నుంచి వెళ్ళిపోవాలని ఆదేశాలను జారీ చేసింది. ఏప్రిల్ 24న ఈ ఉత్తర్వులను ఇచ్చింది. దీంతో పాకిస్తానీయులు దేశం విడిచి వెళ్ళడం ప్రారంభించారు. ఇప్పటివరకు నాలుగు రోజుల్లో 537 మంది అట్టారీ-వాఘా సరిహద్దు మార్గంలో పాకిస్థాన్‌కు  వెళ్లిపోయినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఒక్క ఆదివారం రోజునే 287 మంది వెళ్ళారని సమాచారం . ఇందులో తొమ్మిది మంది దౌత్యవేత్తలు, అధికారులు ఉన్నట్లు చెప్పారు. కొంతమంది ఫ్లైట్స్ ద్వారా వెళ్ళారని..అయితే నేరుగా పాక్ కు విమాన సర్వీసులు లేవు కాబట్టి..ఇతర దేశాలకు వెళ్ళి అక్కడ నుంచి వెళ్ళిపోయి ఉండవచ్చని చెప్పారు. ఇదే సరిహద్దు ద్వారా 850 మంది భారతీయులు పాకిస్థాన్‌ నుంచి స్వదేశానికి తిరిగి వచ్చినట్లు చెప్పారు.

మూడు లక్ష జరిమానా..

పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్‌లో ఉంటున్న పాకిస్థానీయులను నిర్ణీత గడువులోగా వెళ్లిపోవాలని కేంద్రం ఆదేశించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ ఆదేశాలు ఉల్లంఘించి ఎవరైనా గడువు దాటినా కూడా ఇంకా భారత్‌లోనే ఉంటే చట్టం ప్రకారం వాళ్లని అరెస్టు చేయవచ్చు. దీనిపై దర్యాప్తు చేపట్టి.. మూడేళ్ల వరకు జైలు శిక్ష లేదా రూ.3 లక్షల జరిమానా, లేదా రెండు విధించే ఛాన్స్ కూడా ఉంటుంది.  సార్క్‌ వీసాల కింద ఇండియాలో ఉంటున్న పాకిస్థానీయులు ఏప్రిల్ 26లోగా దేశం విడిచి వెళ్లిపోవాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే మెడికల్ వీసాల కింద వచ్చినవాళ్లకు మాత్రం ఏప్రిల్ 29 వరకు గడువు ఇచ్చింది. స్టూడెంట్, బిజినెస్, విజిటర్ తదితర 12 విభాగాల్లో వీసాలు ఉన్నవాళ్లు మాత్రం ఏప్రిల్ 27 నాటికి వెళ్లిపోవాలని ఆదేశించింది. ఏప్రిల్ 4 నుంచి ఇమిగ్రేషన్ అండ్ ఫారినర్స్‌ యాక్ట్‌-2025 అమల్లోకి వచ్చింది. 

 today-latest-news-in-telugu | india | pakistan 


Also Read: Sitakka: నీ బిడ్డ కార్లలో తిరిగితే.. మా ఆడబిడ్డలు బస్సులో కూడా తిరగొద్దా?: కేసీఆర్ కు సీతక్క స్ట్రాంగ్ కౌంటర్!

Advertisment
Advertisment
Advertisment