Assam Electins: అసోం ఎన్నికల పోరు.. హిమంత వ్యూహం ఫలించేనా?

అసోంలో ఏప్రిల్ 9న అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. 126 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో సుమారు 81.5 ఓటింగ్ శాతం నమోదైంది.  నేషనల్ డెమోక్రటిక్ అలియన్స్ (NDA), అసోం సన్మిలితో మోర్చా కూటముల మధ్య ప్రధాన పోటీ ఉంది.

New Update
Assam elections

Assam elections

అసోంలో ఏప్రిల్ 9న అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. 126 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో సుమారు 81.5 ఓటింగ్ శాతం నమోదైంది.  నేషనల్ డెమోక్రటిక్ అలియన్స్ (NDA), అసోం సన్మిలితో మోర్చా కూటముల మధ్య ప్రధాన పోటీ ఉంది. ఈ కూటముల బలాలు, బలహీనతలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.

NDA కూటమి పార్టీలు

బీజేపీ (BJP), అసోం గణ పరిషత్ (AGP), బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ (BPF).

NDA బలాలు: 

1.హిమంత బిస్వా శర్మ నాయకత్వం రాష్ట్రవ్యాప్తంగా బలంగా ఉండటం
2. అరుణోదోయ్' లాంటి పథకాల ద్వారా మహిళల ఖాతాల్లోకి నేరుగా నగదు బదిలీ చేయడంతో పేద వర్గాల్లో ఆదరణ
3. గత ఐదేళ్లలో అస్సాంలో నిర్మించిన వంతెనలు, రహదారులు ప్రజలకు మెరుగైన కనెక్టివిటీ ఇవ్వడం
4. మిలిటెంట్ గ్రూపులతో శాంతి ఒప్పందాలు చేసుకోని రాష్ట్రంలో హింసను తగ్గించడం
5. మియా ముస్లిం రాజకీయాలకు వ్యతిరేకంగా హిందూ ఓటర్లను తమవైపు తిప్పుకోవడం
6. కేంద్రంలో, రాష్ట్రంలో ఒకే పార్టీ ఉండటం వల్ల నిధుల రాక, ప్రాజెక్టులు త్వరగా పూర్తి కావడం
7. బిజేపీకి గ్రామ స్థాయి వరకు ఉన్న పటిష్టమైన కేడర్ వ్యవస్థ 
8. అస్సాం ప్రజల్లో ప్రధాని మోదీ పట్ల ఉన్న గౌరవం, కేంద్ర ప్రభుత్వ పట్ల నమ్మకం కలిసొచ్చే అవకాశం

బలహీనతలు: 

1.నిత్యావసర వస్తువుల ధరల పెరగడం వల్ల మధ్యతరగతి ప్రజల్లో అసంతృప్తి
2. యువతకు ప్రభుత్వ రంగంలో, పరిశ్రమల్లో ఆశించిన స్థాయిలో ఉద్యోగాలు రాకపోవడం
3. ఏటా వచ్చే బ్రహ్మపుత్ర వరదలకు శాశ్వత పరిష్కారం చూపలేకపోయారనే విమర్శలు
4. కొన్ని ప్రభుత్వ కాంట్రాక్టుల్లో అధికార పార్టీ నేతలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని విపక్షాల ఆరోపణ
5. 2016, 2021లో వరుసగా గెలిచి పదేళ్లు అధికారంలో ఉండటం వల్ల ఈసారి ప్రజల్లో పెరిగిన అసంతృప్తి 
6. తేయాకు కార్మికుల వేతనాల పెంపు హామీ పూర్తిస్థాయిలో నెరవేరలేదనే విమర్శ
7. కొందరు మంత్రులు, ఎమ్మెల్యేల తీరు పట్ల తీవ్ర వ్యతిరేకత


అసోం సన్మిలితో మోర్చా (ASM) కూటమి పార్టీలు

కాంగ్రెస్, రైజోర్ దల్ (అఖిల్ గొగోయ్ పార్టీ), అసోం జాతీయ పరిషత్ (AJP), వామపక్ష పార్టీలు (CPI, CPM).

అసోం సన్మిలితో మోర్చా (ASM) బలాలు:

 1.గతంలో విడివిడిగా పోటీ చేసిన కాంగ్రెస్, రైజోర్ దల్ (అఖిల్ గొగోయ్), అస్సాం జాతీయ పరిషత్ (AJP), వామపక్షాలు ఈసారి కలిసి పోటీ చేయడం
2. మాజీ సీఎం తరుణ్ గొగోయ్ కొడుకు, ఎంపీ గౌరవ్ గొగోయ్‌కు యువత నుంచి సపోర్ట్ 
3. బీజేపీ హయాంలో పెరిగిన నిరుద్యోగం, నిత్యావసర ధరలను ప్రజల్లోకి తీసుకెళ్లడం
4. పౌరసత్వ సవరణ చట్టం (CAA)పై వ్యతిరేకత వల్ల  మైనార్టీల ఓట్‌ బ్యాంక్ ASM వైపు వెళ్లడం 
5. అస్సాం జాతీయ పరిషత్ (AJP) లాంటి పార్టీలు కూటమిలో ఉండటం వల్ల "అస్సామీయుల ఆత్మగౌరవం" అనే అంశం ప్రజల్లోకి వెళ్లడం
6.  తేయాకు కార్మికుల వేతనాలు పెంచుతామని, రైతులకు మద్దతు ధర కల్పిస్తామని ASM హామీ ఇవ్వడం
7. వరద నివారణ లాంటి రాష్ట్ర స్థాయి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని హామీ ఇవ్వడం
8. కూటమిలోని పార్టీలన్నీ సమన్వయంతో క్షేత్రస్థాయిలో బలంగా ప్రచారం చేయడం 

బలహీనతలు: 

1. CM అభ్యర్థిపై స్పష్టత లేకపోవడం.
2. గ్రామస్థాయిలో కేడర్ వ్యవస్థ బలహీనంగా ఉండటం
3. సీట్ల సర్దుబాటు సమయంలో కాంగ్రెస్, రైజోర్ దల్ మధ్య విభేదాలు తలెత్తడం
4. కాంగ్రెస్ జాతీయ నాయకత్వం అస్సామీ అజెండా కన్నా జాతీయ అజెండాకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారనే విమర్శ
5. అధికార పార్టీతో పోలిస్తే ఎన్నికల ఖర్చు, ప్రచార వనరుల తక్కువగా ఉండటం 
6. మైనారిటీల మద్దతు కోరడం వల్ల మెజార్టీ హిందూ ఓట్లు ఏకీకృతమై బిజెపికి వెళ్లే ప్రమాదం

Advertisment
తాజా కథనాలు