/rtv/media/media_files/2024/12/22/2XNYN5inHCX8VGx1IXNp.jpg)
child marriage
Child Marriage: అస్సాం ప్రభుత్వం బాల్య వివాహాలపై కఠిన చర్యలను కొనసాగిస్తుంది. అయితే గతంలో 2023లో ఫిబ్రవరి, అక్టోబర్‌లో రెండు దశల్లో బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ఒక డ్రైవ్‌ను ప్రారంభించింది. ఈ డ్రైవ్ మూడో దశలో భాగంగా డిసెంబర్ 21 రాత్రి నుంచి 22వరకు మొత్తం 335 కేసులు నమోదు చేసిన పోలీసులు 416మందిని అరెస్టుచేశారు. ఈ విషయాన్ని అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ తెలిపారు. అరెస్ట్ చేసిన వారిని ఈరోజు కోర్టులో హాజరుపరచనున్నారు. ఇలాంటి సాంఘిక దురాచారాలను అంతం చేయడానికి సాహసోపేతమైన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి ఎక్స్ పోస్టులో తెలిపారు.
గతంలో..
2023 ఫిబ్రవరిలో నిర్వహించిన మొదటి డ్రైవ్ లో.. 4,515 కేసులు నమోదు చేయగా.. 3,483 మందిని అరెస్టు చేశారు. ఆ తర్వాత అక్టోబర్ రెండవ దశలో 710 కేసులు నమోదవగా..915 మందిని అరెస్టు చేశారు. ముఖ్యమంత్రి శర్మా 2026లోపు దీన్ని ఆపేస్తానని రాజకీయంగా సవాల్ చేస్తున్నానని తెలిపారు.
🚨 BREAKING NEWS
— THESingh (@IamVishnu_Singh) December 22, 2024
Assam's massive crackdown upon people indulging in Child Marriage
416 people arrested in Assam in special drive against child marriages.
Child Marriage is a crime in India and Assam is spearheading to uproot this menace.
This is the third phase of crackdown. pic.twitter.com/A6VELvvrVM
ఇది కూడా చదవండి: అల్లు అర్జున్ కు బిగుసుకుంటున్న ఉచ్చు.. మరికొద్ది సేపట్లో ఏసీపీ కీలక ప్రెస్ మీట్!