DGP WARNING: డ్యూటీలో ఉంటే బొట్టు పెట్టుకోవద్దు.. పోలీసులకు DGP వార్నింగ్!

బీహార్ పోలీస్ శాఖలో సరికొత్త నిబంధనలు ఇప్పుడు ఆ రాష్ట్రంలో పెను సంచలనం రేపుతున్నాయి. డీజీపీ వినయ్ కుమార్ జారీ చేసిన తాజా ఉత్తర్వుల ప్రకారం  ఆ రాష్ట్రంలో ప్రకంపనలు రేపుతున్నాయి.

New Update
dgp

బీహార్ పోలీస్(Bihar police) శాఖలో సరికొత్త నిబంధనలు ఇప్పుడు ఆ రాష్ట్రంలో పెను సంచలనం రేపుతున్నాయి. డీజీపీ(dgp) వినయ్ కుమార్ జారీ చేసిన తాజా ఉత్తర్వుల ప్రకారం  ఆ రాష్ట్రంలో ప్రకంపనలు రేపుతున్నాయి. పోలీసుల లుక్ మార్చడానికి డీజీపీ తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు పెద్ద చర్చకు దారితీశాయి. ఇంతకు అందులో ఏముంది అంటే.. ఇకపై పోలీసులు డ్యూటీలో ఉన్నప్పుడు నుదుటన తిలకం, చందనం వంటి ఎలాంటి మతపరమైన చిహ్నాలను ధరించకూడదు. ఇది పోలీస్ మ్యాన్యువల్ నియమాలకు విరుద్ధమని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.

కేవలం ఇది ఒక్కటే కాదు.. డ్యూటీలో ఉన్నప్పుడు పోలీసులు తప్పనిసరిగా టోపీ, బెల్ట్ ధరించాలి. ఇవి లేకపోతే యూనిఫాం అసంపూర్తిగా ఉన్నట్లే పరిగణిస్తామని డీజీపీ తన ఉత్తర్వుల్లో వెల్లడించారు. ఇక మహిళా పోలీసులు విధి నిర్వహణలో ఉన్నప్పుడు మితిమీరిన మేకప్ వేసుకోకూడదని ఆదేశించారు. పోలీసు బలగాల్లో వ్యక్తిగత గుర్తింపు కంటే ప్రభుత్వ గుర్తింపునకే ప్రాధాన్యత ఉండాలని ఆయన పేర్కొన్నారు. యూనిఫాం వేసుకుని రీల్స్ చేయడం, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంపై కఠిన నిషేధం విధించారు. ఇది శాఖా పరమైన గోప్యతకు, ప్రతిష్టకు భంగం కలిగిస్తుందని భావిస్తున్నారు.

Also Read :  జేబులో ఉల్లిపాయ ఉంటే ఎండ దెబ్బ ఖతం.. కేంద్ర మంత్రి చెప్పినదాంట్లో నిజమెంత?

హిందూ సంఘాలు, నెటిజన్లు ఫైర్

డీజీపీ ఆదేశాలు సంచలనంగా మారడంతో  హిందూ సంఘాలు, నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. పోలీసుల నిజాయితీని తిలకం నిర్ణయిస్తుందా? అవినీతి ఏమైనా చందనం పూసుకుని వస్తుందా? అని కొందరు ప్రశ్నిస్తుండగా.. మరికొందరు యూనిఫాంలో క్రమశిక్షణ ఉండాల్సిందే, కానీ పోలీస్ స్టేషన్లలో ఉదయాన్నే దేవుడికి పూజ చేసుకోవచ్చు కదా? దానివల్ల అయినా లంచాలు తీసుకోకుండా ఎఫ్ఐఆర్ రాస్తారేమో అంటూ చురకలు అంటిస్తున్నారు. ఒక యూజర్ అయితే ఏకంగా డీజీపీ గారు కూడా కళ్ళజోడు పెట్టుకున్నారు కదా, అది యూనిఫాం నిబంధనల్లోకి వస్తుందా? అంటూ ఎద్దేవా చేశారు.  

Also Read :  నాసిక్ TCS మతమార్పిడి కేసులో బిగ్‌ ట్విస్ట్.. సిట్‌ విచారణలో విదేశీ లింకులు బట్టబయలు

Advertisment
తాజా కథనాలు