జైల్లో నన్ను చంపేందుకు ప్రయత్నించారు.. కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జైల్లో తనకు ఇన్సులిన్ ఇవ్వకుండా చంపేందుకు బీజేపీ కుట్రకు పాల్పడిందని ఆరోపించారు. అయితే తీహార్ జైలు అధికార వర్గాలు ఈ ఆరోపణలను ఖండించాయి. By B Aravind 16 Oct 2024 in నేషనల్ Latest News In Telugu New Update షేర్ చేయండి ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టయిన మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇటీవల జైలు నుంచి విడుదలైన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన బీజేపీపై సంచలన ఆరోపణలు చేశారు. జైల్లో తనకు ఇన్సులిన్ ఇవ్వకుండా చంపేందుకు బీజేపీ కుట్రకు పాల్పడిందని ఆరోపణలు చేశారు. బుధవారం జనసంపర్క్ కార్యక్రమంలో కేజ్రీవాల్ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే తీహార్ జైలు అధికార వర్గాలు మాత్రం ఈ ఆరోపణలను ఖండించాయి. ఆయనకు అన్నిరకాల వైద్య సౌకర్యాలు కల్పించినట్లు పేర్కొన్నాయి. Also Read: కేంద్ర ఎన్నికల కమిషనర్‌కు తప్పిన ప్రమాదం.. హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్! కుట్రకు పన్నాగం కేజ్రీవాల్ మాట్లాడుతూ '' నాకు షుగర్ లెవెల్స్ పెరిగాయి. రోజూ నాలుగు ఇన్సులిన్ ఇంజెక్షన్లు తీసుకుంటాను. జైల్లో ఉన్న నేను ఇన్సులిన్ తీసుకోలేకపోతే కిడ్నీలు పాడైపోతాయి. నన్ను చనిపోయేలా చేసేందుకు వాళ్లు (బీజేపీ పెద్దలు) కుట్రలకు పాల్పడ్డారు. మీ అందరి ఆశీస్సుల వల్లే నేను క్షేమంగా బయటకు వచ్చాను. గత 10 ఏళ్లలో లెఫ్టినెంట్ గవర్నర్‌ను అడ్డం పెట్టుకొని ఢిల్లీలో అనేక అభివృద్ధి పనులను ఆపేందుకు ప్రయత్నాలు చేశారు. కానీ నేను వారి ప్రయత్నాలను తిప్పికొట్టగలిగాను. Also Read: కొత్తగా పెళ్లయిందా? ఈ మూడు పాటిస్తే మీ భార్య మిమల్ని ఎప్పటికీ వదలదు! భయపడుతున్నారు పంజాబ్‌లో ఆప్ గెలిచాక ఢిల్లీలో పనులు ఆపకపోతే దేశవ్యాప్తంగా ఆప్ అధికారంలోకి వస్తోందని వాళ్లు భయపడుతున్నారు. నేను జైల్లో ఉన్నప్పుడు కూడా ఢిల్లీ అభివృద్ధి పనులను ఆపేశారు. నేను జైలు నుంచి బయటికి వచ్చాక మా పార్టీ ఆ అభివృద్ధి పనులను మళ్లీ ప్రారంభించిందని'' కేజ్రీవాల్ తెలిపారు. మరోవైపు ఢిల్లీ సీఎంగా రాజీనామా చేయడానికి గల కారణాలు వివరిస్తూ కూడా ఢిల్లీ ఓటర్లకు కేజ్రీవాల్ లేఖ రాశారు. Also Read: రైతులకు మోదీ సర్కార్ అదిరిపోయే దీపావళి గిఫ్ట్.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు! ఇదిలాఉండగా.. ఈ ఏడాది మార్చి 21న మద్యం విధానం కేసులో మనీలాండరింగ్ ఆరోపణలపై అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆయన బెయిల్ కోసం కోర్టులో పిటిషన్ వేయగా విచారణ పలు దఫాలుగా వాయిదా పడుతూ వచ్చింది. ఇక చివరికి ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఆయన తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో తన నిజాయతీని నిరూపించుకునేందుకు సీఎం పదవికి రాజీనామా చేస్తున్నానని.. వచ్చే ఎన్నికల్లో ప్రజలు గెలిపించాకే మళ్లీ సీఎం కూర్చీపై కూర్చుంటానని కేజ్రీవాల్ ప్రకటించిన సంగతి తెలసిందే. ఆయన రాజీనామా తర్వాత ఢిల్లీలో పలు శాఖలకు మంత్రిగా ఉన్న అతిషి సీఎంగా బాధ్యతలు తీసుకున్నారు. వచ్చే ఎన్నికల వరకు ఈమెనే ఢిల్లీ సీఎంగా ఉండనున్నారు. Also Read: ఖగోళ అద్భుతం.. మరో 80 వేల ఏళ్ల వరకు రాదు! #telugu-news #delhi #national-news #arvind-kejriwal మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి