Delhi Elections: మా స్కీమ్స్‌తో ప్రతి ఇంటికి నెలకు రూ.25 వేల ప్రయోజనం: కేజ్రీవాల్‌

అరవింద్ కేజ్రీవాల్‌ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. మా పథకాల వల్ల ఢిల్లీలో ప్రతీ ఇంటికి నెలకు రూ.25 వేల ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. ఈ ఎన్నికలను దేశానికి జరుగుతున్న రాజకీయ పోరుగా భావించాలన్నారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

New Update
Arvind Kejriwal on Employment

Arvind Kejriwal on Employment

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి.  ఈ సందర్భంగా అరవింద్ కేజ్రీవాల్‌ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. మా పథకాల వల్ల ఢిల్లీలో ప్రతీ ఇంటికి నెలకు రూ.25 వేల ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. ఈ ఎన్నికలను దేశానికి జరుగుతున్న రాజకీయ పోరుగా భావించాలన్నారు . కేంద్ర ప్రభుత్వం గత ఐదేళ్లలో 400 నుంచి 500 మంది పారిశ్రామికవేత్తలకు రూ.10 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేసిందని విమర్శించారు.    

Also Read: తేనెకళ్ల సుందరి మోనాలిసా ఇల్లు చూశారా ? వీడియో వైరల్

'' బీజేపీ వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని తన సన్నిహితులకు రుణాలుగా ఇచ్చి వాటిని మాఫీ చేస్తోంది. ఆమ్ ఆద్మీ పార్టీ సామాన్యులకు ఉచిత విద్యుత్, విద్య, వైద్యం, రవాణా సౌకర్యాలపై దృష్టి సారించింది. ఢిల్లీలో ప్రతి ఇంటికి నెలకు దాదాపు రూ.25 వేల విలువైన ప్రయోజనాలు అందిస్తుంది. బీజేపీ అధికారంలోకి వస్తే స్థానికంగా ఆప్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను నిలిపివేస్తుందని'' కేజ్రీవాల్ అన్నారు. 

Also Read: జైలులో తమ్ముడు.. మరదలిపై కన్నేసిన అన్న: ఫ్రెండ్స్‌తో కలిసి 31 గంటలపాటు!

అలాగే ఆప్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను బీజేపీ ఉచితాలుగా పేర్కొనడాన్ని కేజ్రీవాల్ ఖండించారు. ఓవైపు బడా వ్యాపారవేత్తలకు భారీ రాయితీలు కల్పిస్తూ.. మధ్యతరగతి ప్రజల్లో అపరాధ భావనను సృష్టించేందుకు యత్నిస్తోందని విమర్శలు చేశారు. ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్ సౌకర్యం వంటి పథకాలను ఆపేస్తామని ఇప్పటికే బీజేపీ చెప్పిందని గుర్తుచేశారు. బీజేపీ గెలిస్తే ఈ ఖర్చులను మీరు భరించగలరా అంటూ ప్రశ్నించారు. ఇదిలాఉండగా.. ఫిబ్రవరి 5న ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 8న ఓట్ల లెక్కింపు జరగనుంది. 

Also Read: ఆస్తులమ్మి భార్యను చదివిస్తే.. జాబ్ వచ్చాక భర్తను వదిలేసింది.. అబ్బో చివరికి ట్విస్ట్ అదుర్స్!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు