AAP: పెళ్లికి రూ.లక్ష, ఉచిత ప్రయాణం.. 15 గ్యారెంటీలతో ఆప్ మేనిఫెస్టో విడుదల

ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్నికలకు సంబంధించి మేనిఫెస్టోను విడుదల చేసింది. మొత్తం 15 గ్యారెంటీలతో ఈ మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. ఉద్యోగాల కల్పన, మహిళా సమ్మాన్ యోజన, సంజీవని పథకం వంటి వివిధ హామీలు ఇందులో ఉన్నాయి. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

New Update
Arvind Kejriwal

Arvind Kejriwal

AAP: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అధికార, విపక్ష పార్టీలు ఓటర్లకు ఆకట్టుకునేందుకు వరాల జల్లులు కురిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్నికలకు సంబంధించి మేనిఫెస్టోను విడుదల చేసింది. మొత్తం 15 గ్యారెంటీలతో ఈ మేనిఫెస్టోను విడుదల చేశారు. ఉద్యోగాల కల్పన, మహిళా సమ్మాన్ యోజన, సంజీవని పథకం వంటి వివిధ హామీలు ఇందులో ఉన్నాయి. 

Also Read: ఇవ్వాల్టితో ఉత్తరాఖండ్‌లో మారనున్న రూల్స్ ఇవే.. పెళ్లికి రిజిస్ట్రేషన్ ఇంకా..

ఆటో, టాక్సీ, ఈ-రిక్షా డ్రైవర్ల కుమార్తెల వివాహాలకు రూ.లక్ష అందజేయడం, వారి పిల్లకు ఫ్రీ కోచింగ్, జీవిత బీమా కల్పించడం వంటివి కూడా తాజాగా తమ మేనిఫెస్టోలో చేర్చారు. తాము అధికారంలోకి వచ్చాక ఐదేళ్లలో ఈ హామీలన్ని అమలు చేస్తామని అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) హామీ ఇచ్చారు. 

Also Read: Daaku Maharaaj: దబిడి దిబిడే.. ఓటీటీలోకి బాలయ్య డాకు మహారాజ్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

మేనిఫెస్టోలో హామీలు ఇవే..

  • మహిళా సమ్మాన్ యోజన పథకం కింద మహిళలకు నెలకు రూ.2,100.
  • నిరుద్యోగులు లేని రాజధానికి ఢిల్లీని మార్చడం. అధికారంలోకి వచ్చాక యువతకు ఉద్యోగాల కల్పన.
  • సంజీవని స్కూమ్ కింద 60 ఏళ్లు నిండిన వారికి ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఉచితంగా వైద్యం.
  • నీటీ సరఫరా బిల్లులు మాఫీ, 24 గంటలు నీటిని సరఫరా చేయడం.
  • యూరప్‌ లాగా రోడ్ల నిర్మాణం చేయడం, యమునా నదిని శుభ్రం చేయడం.
  • డా.అంబేద్కర్ స్కాలర్‌షిప్‌ పతకంతో విద్యార్థులకు ఫ్రీ బస్సు సౌకర్యం. ఢిల్లీ మెట్రో ప్రయాణంలో 50 శాతం రాయితీ కల్పించడం.
  • ఆలయ పూజరులు, గ్రంథీలకు నెలకు రూ.18 వేలు అందించడం.
  • కౌలుదారులకు ఫ్రీ కరెంట్‌తో పాటు ఫ్రీగా నీటి సైకర్యం, మురుగు నీటివ్యవస్థను పరిష్కరించడం, అర్హులందరికీ రేషన్ కార్డులు జారీ చేయడం.
  • ఆటో,టాక్సీ, ఈ-రిక్షా డ్రైవర్ల కుమార్తెల పెళ్లిల్ల కోసం ఒక్కో కుటుంబానికి రూ.లక్ష అందించడం, వాళ్ల పిల్లలకు ఉచిత కోచింగ్, జీవిత బీమా కల్పించడం.
  • రెసిడెంట్ వెల్ఫెర్ అసోసియేషన్ (RWA)లకు ప్రైవేటు గార్డులను అందించడం.  

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు