/rtv/media/media_files/2025/02/27/Q49GGPFemFLWKenpqpss.jpg)
Arvind Kejriwal
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఓడిపోయిన సంగతి తెలిసిందే. దీంతో అప్పటినుంచి ఆ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కు అడుగడుగున అడ్డంకులు ఎదురవుతున్నాయి. మద్యం కుంభకోణానికి సంబంధించిన కాగ్ (CAG) నివేదికను రేఖా గుప్తా సర్కార్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (PAC)కు పంపించింది. అంతేకాదు ఢిల్లీలో సీసీటీవీ కెమెరాల అంశం కూడా ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్న ప్రాంతాల్లో గత ప్రభుత్వం సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయకపోవడంపై మంత్రి పర్వేశ్ వర్మ దర్యాప్తునకు ఆదేశించారు. అలాగే ఇప్పుడు సీసీటీవీ లేని ప్రాంతాల్లో వాటిని ఏర్పాటు చేస్తామన్నారు.
Also Read: ఎన్నికల కమిషన్ ముందు దీక్ష చేస్తా.. మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు
దీనిపై మరో మంత్రి డాక్టర్ పంకజ్ కుమార్ కూడా మాట్లాడారు. ఆప్ ప్రభుత్వం బీజేపీ ఎమ్మెల్యేలపై వివక్ష చూపిందని ఆరోపించారు. 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్న ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయలేదని విమర్శించారు. మరోవైపు ఆప్ ఎమ్మెల్యే జర్నైల్ సింగ్ బీజేపీ ఆరోపణలు ఖండించారు. అరవింద్ కేజ్రీవాల్ ప్రతీ విధిలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారన్నారు.
అంతేకాదు ఢిల్లీ ఎన్నికల ముందు సీఎం అధికారిక నివాసం (శీష్ మహల్-బీజేపీ పెట్టిన పేరు) వివాదం కూడా దుమారం రేపిన సంగతి తెలిసిందే. ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసి కేజ్రీవాల్ శీష్‌మహాల్‌ను పునర్నిర్మించుకున్నారని బీజేపీ తీవ్ర విమర్శలు చేసింది. దీంతో శీష్‌మహల్‌పై కూడా దర్యాప్తు ప్రారంభిస్తామని మంత్రి పర్వేశ్ వర్మ అన్నారు. సీఎం నివాసాన్ని పునరుద్ధరించేందుకు ప్రభుత్వ నిధులు ఎంత ఖర్చు చేశారో అనేది తేలుస్తామని తెలిపారు. మరోవైపు ఢిల్లీ మధ్య కుంభకోణం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే.
Also Read: వీడ్ని పట్టుకుంటే రూ.లక్ష మీ సొంతం.. పోలీసుల సంచలన ప్రకటన
ఈ నేపథ్యంలో బీజేపీ ప్రభుత్వం.. మద్యం విధానానికి సంబంధించి కాగ్ నివేదికను పీఏసీకి పంపించడం ప్రాధాన్యం సంతరించకుంది. లిక్కర్ పాలసీ వల్ల రాష్ట్ర ఆదాయానికి రూ.2 వేల కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని కాగ్ నివేదిక చెప్పింది. ఈ నేపథ్యంలోనే దీనిపై ప్రభుత్వం మరింత లోతుగా దర్యాప్తు చేయిస్తోంది. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ మూడు నెలల్లో తమ నివేదికను ప్రభుత్వానికి సమర్పించనుంది. ఆ తర్వాత ఇందులో అవకతవకలపై పాల్పడిన వారిలో మరిన్ని చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది.