BIG BREAKING: మమతా బెనర్జీకి మరో ఊహించని షాక్.. సొంత పార్టీ నేత ఎంత పని చేశాడంటే..

పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఒక ఆసక్తికరమైన,ఊహించని పరిణామం చోటుచేసుకుంది. 'పుష్ప.. తగ్గేదే లే' (ఝుకేగా నహీ) అంటూ గతంలో సంచలన వ్యాఖ్యలు చేసిన తృణమూల్ కాంగ్రెస్ (TMC) అభ్యర్థి జహంగీర్ ఖాన్, అనూహ్యంగా ఎన్నికల బరి నుంచి తప్పుకున్నారు.

New Update
FotoJet - 2026-05-19T153505.611

Jahangir Khan

BIG BREAKING: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఒక ఆసక్తికరమైన,ఊహించని పరిణామం చోటుచేసుకుంది. 'పుష్ప.. తగ్గేదే లే' (ఝుకేగా నహీ) అంటూ గతంలో సంచలన వ్యాఖ్యలు చేసిన తృణమూల్ కాంగ్రెస్ (TMC) అభ్యర్థి జహంగీర్ ఖాన్, అనూహ్యంగా ఎన్నికల బరి నుంచి తప్పుకున్నారు. రాష్ట్రంలోని ఫాల్టా అసెంబ్లీ నియోజకవర్గానికి మే 21న రీ పోలింగ్‌ (Re-polling) జరగాల్సి ఉండగా, దానికి కేవలం 48 గంటల ముందే ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం తీవ్ర చర్చనీయాంశమైంది.

అరెస్ట్ భయంతోనే వెనకడుగు?

ఎన్నికల రేస్ నుండి తప్పుకోవడానికి ముందు జహంగీర్ ఖాన్ కలకత్తా హైకోర్టును ఆశ్రయించారు. పోలింగ్‌కు ముందే పోలీసులు తనను అరెస్టు చేసే అవకాశం ఉందంటూ ఆయన ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. పోలీసులు తనపై కల్పిత ఆరోపణలతో తప్పుడు ఎఫ్‌ఐఆర్ (FIR)లు నమోదు చేశారని ఖాన్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా తనపై ఎన్ని కేసులు నమోదయ్యాయి, వాటిలో ఉన్న ఆరోపణలు ఏంటో స్పష్టం చేయాలని ఆయన కోర్టును కోరారు. జస్టిస్ సౌగత్ భట్టాచార్య నేతృత్వంలోని సింగిల్ జడ్జి బెంచ్ ఈ పిటిషన్‌ను స్వీకరించి, తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.

 
ఎన్నికల నుంచి తప్పుకుంటున్నట్లు జహంగీర్ ఖాన్ స్వయంగా ప్రకటిస్తున్న ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. అయితే, ఈ వీడియోకు సంబధించి అధికారిక నిజా నిజాలను ఇంకా నిర్ధారించాల్సి ఉంది.

'మాకూ తెలియదు' అంటున్న టీఎంసీ (TMC)

తన సొంత అభ్యర్థి ఇలా ఓటింగ్ సమయానికి పోటీ నుంచి తప్పుకోవడంపై టీఎంసీ అధిష్టానం విస్మయం వ్యక్తం చేసింది. పార్టీ అధికార ప్రతినిధి అరూప్ చక్రవర్తి ఈ విషయంపై మాట్లాడుతూ..."ఫాల్టా ఉపఎన్నిక బరి నుంచి జహంగీర్ ఖాన్ తప్పుకుంటున్నట్లు మాకు సమాచారం అందింది. కానీ, ఆయన అంతటి తీవ్రమైన నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందనే దానికి సంబంధించిన స్పష్టమైన కారణాలు మాకు ఇంకా తెలియదు." అని పేర్కొన్నారు.

'పుష్పను వంచుతాం' అన్న బీజేపీ

గతంలో ప్రచార పర్వంలో జహంగీర్ ఖాన్ సినిమా డైలాగులను వాడుతూ తాను తగ్గేదే లేదని ప్రగల్భాలు పలికారు. దీనిపై ఫాల్టా నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి ఘాటుగా స్పందిస్తూ, "మే 4వ తేదీ తర్వాత జహంగీర్ ఖాన్‌ను జైల్లో పెడతాం.. ఆ పుష్పను ఎలా వంచాలో మాకు తెలుసు" అంటూ గతంలో వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే అరెస్ట్ భయంతో ఖాన్ పోటీ నుంచి తప్పుకున్నారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది.

Advertisment
తాజా కథనాలు