/rtv/media/media_files/2025/03/29/SU4hzsJgW80q0HLyHrYn.jpg)
Anganwadi worker, teacher fight like school kids
ఉత్తరప్రదేశ్‌లోని మథురలో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఓ ప్రభుత్వ పాఠశాలలోని ఓ లేడీ టీచర్, అంగన్‌వాడీ వర్కర్ తీవ్రంగా కొట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఆ వీడియోలో ఇద్దరు మహిళలు కిందపడి జుట్లు పట్టుకుని తన్నుకున్నారు. ఈ సంఘటన విద్యాశాఖ అధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో అధికారులు దీనిపై దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేశారు. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
Also Read: భారతీయ రైల్వేకు రోజుకు ఎన్ని కోట్లు వస్తాయో తెలుసా ?
ఇక వివరాల్లోకి వెళ్తే మథురలోని ఓ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ప్రతీ తివారీ అసెస్టెంట్ టీచర్‌గా.. చంద్రవాతి అంగన్‌వాడీ కార్యకర్తగా పనిచేస్తున్నారు. అయితే మార్చి 26న వీళ్లిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. చివరికి ఇది తీవ్ర ఘర్షణకు దారి తీసింది. ఈ క్రమంలోనే వాళ్లిద్దరూ కిందపడి ఒకరి జుట్టు మరొకరు పట్టుకొని కొట్టుకున్నారు. తన్నుకున్నారు. టీచర్‌కు మద్దతుగా కొందరు విద్యార్థులు అంగన్‌వాడీ కార్యకర్తను కాలితో తన్నారు. విషయం తెలుసుకొని అక్కడికి వచ్చిన స్కూల్ సిబ్బంది వాళ్లిద్దరినీ విడిపించారు.
*मथुरा*: 😎
— जन स्वदेश पिटारा (@pradipy81315327) March 27, 2025
आंगनवाड़ी सहायिका और शिक्षिका के बीच मारपीट, बच्चों के सामने हुआ हंगामा !
मथुरा के छाता क्षेत्र में एक आंगनवाड़ी केंद्र पर एक घटना सामने आई,, जिसकी वीडियो सोशल मीडिया पर वायरल हो रही है ।🧐 pic.twitter.com/u3zgJXLzB2
Also Read: జేఈఈ మెయిన్స్ రెండో విడత పరీక్షలు వాయిదా..! కారణం ఏంటంటే?
అయితే ఈ పోట్లాటలో అంగన్‌వాడీ కార్యకర్త చంద్రావతికి తీవ్రంగా గాయాలయ్యాయి. దీంతో ఆమెను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. దీనిపై విద్యాశాఖ అధికారులు స్పందించారు. దీనిపై విచారణ జరిపి రిపోర్టు ఇవ్వాలని బ్లాక్ అధికారులను ఆదేశించారు. టీచర్ ప్రీతి తివారి ఇంతకు ముందు కూడా కొందరితో ఘర్షణ పడినట్లు అక్కడున్న స్కూల్ సిబ్బంది ఆరోపణలు చేస్తున్నారు.
Also Read: ఆస్పత్రిలో పురిటినొప్పులతో ఉండగా భూకంపం.. చివరికి
Also Read: షేక్ హసీనాకు బిగ్ షాక్.. కేసు నమోదు చేసిన సీఐడీ
telugu-news | national-news | uttar-pradesh