/rtv/media/media_files/2025/03/31/xh6iaNuDH1c1zdrhaiab.jpg)
Anand Mahindra
ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో ఎల్లప్పుడూ కొత్త కొత్త విషయాలు పంచుకుంటారు. తాజాగా సోమవారం ఓ స్పూర్తిదాయక సందేశాన్ని షేర్ చేశారు. నా మండే మోటివేషన్ ఆయనే అంటూ ఐఏఎస్ అధికారి డి.కృష్ణ భాస్కర్ కథనాన్ని పంచుకున్నారు. ఆ అధికారి నుంచి తాను ఎంతగానో స్పూర్తి పొందుతున్నట్లు తెలిపారు. '' వ్యవసాయం రంగంపై మనకు కొంత అవగాహన ఉంటుంది. భూగర్భ జలాల స్థాయిలను పెంచడం కోసం దేశం ఎలాంటి సవాళ్లు ఎదుర్కొంటుందో మనకు తెలుసు.
Also Read: ప్రధాని మోదీకి ప్రైవేట్ సెక్రటరీగా నిధి తివారీ!
ఇలాంటి సమయంలో ఈ యంగ్ ఐఏఎస్ అధికారి కృష్ణభాస్కర్ సాధించిన విజయాన్ని ఎంత ప్రశంసించినా కూడా తక్కువే. సమస్య ఎలాంటిదైనా కూడా దాన్ని అధిగమించగలమని మనలో విశ్వాసాన్ని నింపారు. దీనికి కావాల్సింది ధృడమైన సంకల్పమే అని రుజువు చేశారు. అందుకే నా సోమవారం మోటివేషన్ ఆయనే'' అంటూ ఆనంద్ మహీంద్రా రాసుకొచ్చారు.
Given our involvement in the Farm sector, we are all too aware of the challenge the country faces in restoring groundwater levels.
— anand mahindra (@anandmahindra) March 31, 2025
So no praise can be enough for this astonishing achievement by D.K.Bhaskar
He gives us hope that none of our problems are insurmountable.
All it… https://t.co/QVwxiS7x2R
ఇదిలాఉండగా తెలంగాణకు చెందిన ఐఏఎస్ అధికారి దేవరకొండ కృష్ణ భాస్కర్ రాజన్న సిరిసిల్లా జిల్లాకు కలెక్టర్ పనిచేసినప్పుడు చాలా విజయాలు సాధించారు. నీటి కొరత సమస్యను పరిష్కరించేందుకు ఆయన పలు చర్యలను చేపట్టారు. పైపుల ద్వారా నీటి సరఫరా, రిజర్వాయర్లకు భూమి సేకరణ, నీటి వనరుల కోసం పూడికతీత వంటి చర్యలు చేపట్టి నీటి నిల్వల సామర్థ్యాన్ని పెంచారు. ఆయన చేపట్టిన చర్యల వల్ల నాలుగేళ్లలోనే భూగర్భ జలాల స్థాయిలను ఆరు మీటర్ల వరకు పెంచగలిగారు.
Also Read: స్టాలిన్ ఉగాది పోస్టు వివాదం.. మేము ద్రవిడులం కాదంటున్న కన్నడ వాసులు..
క-ృష్ణ భాస్కర్‌కు సంబంధించిన స్పూర్తిదాయక కథనాన్ని గతేడాదే జూన్‌లో 'బెటర్ ఇండియా' వెబ్‌సైట్‌లో వచ్చింది. ఆ పోస్ట్‌నే తాజాగా ఆనంద్ మహీంద్రా ఎక్స్‌లో షేర్ చేశారు. నా మండే మోటివేషన్ ఆయనే అంటూ ఆ అధికారిపై ప్రశంసల వర్షం కురిపించారు. అయితే కృష్ణ భాస్కర్ సేవలకు 2019, 2020లో రెండుసార్లు ప్రజాపాలనలో ప్రధానమంత్రి అవార్డును కూడా అందుకున్నారు.
anand-mahindra | telugu-news | rtv-news | national-news