/rtv/media/media_files/2025/02/23/5AuJv5umtCNN885bEtgX.jpg)
_Donald Sams Australia Photograph: (_Donald Sams Australia)
IND vs PAK: ఆస్ట్రేలియాకు చెందిన ఓ వ్యక్తికి భారత్ అంటే అత్యంత అభిమానం, ప్రేమ. డోనాల్డ్ సామ్స్ ఆస్ట్రేలియాలోని సిడ్నీకి చెందిన వ్యక్తి. అతను చనిపోయాక ఇండియాలోనే దహన సంస్కారాలు చేయాలని చివరి కోరికగా కుటుంబసభ్యులకు చెప్పాడు. భారతదేశం పట్ల ఎంతో ప్రేమతో అతడు తన వీలునామాలో అంతిమ కోరికను పేర్కొన్నాడు. తన మృతదేహాన్ని భారత్‌లో ఖననం చేయాలని రాసుకొచ్చాడు. 91 ఏళ్ల డోనాల్డ్ సామ్స్ తన భార్య ఆలిస్ సామ్స్‌తో సహా 42 మంది బృందంతో కలిసి ఇటీవల 12వ సారి భారత్‌కు వచ్చారు. ఆయన అనారోగ్యంతో మరణించగా.. దీంతో ఆయన చివరి కోరికను అతడి భార్య నెరవేర్చింది.
Also Read: మైనర్ బాలికలు శృంగారం చేస్తే తప్పుకాదు.. హైకోర్టు సంచలన వ్యాఖ్యలు!
#बिहार :: #मुंगेर में आस्ट्रेलिया के पर्यटक डोनाल्ड सम्स की हार्ट अटैक से मृत्यु हो गयी। मुंगेर में अंतिम संस्कार किया गया। विदेशी सैलानियों के साथ हल्दिया से वाराणसी जा रहे क्रूज में सवार थे आस्ट्रेलियाई दंपती। सुल्तानगंज के पास बिगड़ी तबीयत।
— आकाशवाणी समाचार, पटना (@airnews_patna) February 23, 2025
रिपोर्ट @ प्रशांत कुमार। pic.twitter.com/yD7Sha5cNx
శనివారం చురంబాలోని క్రైస్తవ స్మశానవాటికలో డోనాల్డ్ సామ్స్ మృతదేహాన్ని క్రైస్తవ ఆచారాలతో ఖననం చేశారు. ఆయన చివరి కోరికను నెరవేర్చేందుకు సహకరించాలని భార్య ఆలిస్ సామ్స్ ఆస్ట్రేలియా ఎంబసీని అభ్యర్థించింది. అనుమతి పొందడంతో ముంగేర్ జిల్లా యంత్రాంగం ఆ మేరకు ఏర్పాట్లు చేసింది. డోనాల్డ్ సామ్స్ ఆస్ట్రేలియన్ హైకమాండ్ అధికారిగా రిటైర్డ్ అయ్యారు. సామ్స్ తండ్రి కూడా బ్రిటీష్ పాలనలో అస్సాంలో పనిచేశారు.
Also Read: అమరావతి ఓఆర్‌ఆర్‌పై బిగ్ అప్‌డేట్.. ఐదు జిల్లాల మీదుగా నిర్మాణ
డోనాల్డ్ సామ్స్ భారత్‌కు వచ్చినప్పుడల్లా తన తండ్రికి నివాళిగా అస్సాంను సందర్శించేవారు. కోల్‌కతా నుంచి పాట్నాకు గంగా నదిలో బోటులో ప్రయాణించే వారు. భారత్‌తో అనుబంధం పెంచుకున్న ఆయన తన వీలునామాలో ప్రత్యేకంగా అభ్యర్థించారు. తన మృతదేహాన్ని భారత్‌లోని స్మశానవాటికలో ఖననం చేయాలని చివరి కోరికగా పేర్కొన్నారు. యథావిధిగా అస్సాంను ఆయన సందర్శించారు. ఎప్పటి మాదిరిగానే కోల్‌కతా నుంచి పాట్నాకు గంగా నది ద్వారా క్రూయిజ్‌లో ప్రయాణించారు. అయితే ఫిబ్రవరి 21న బోటులో ఉండగా ఆయన ఆరోగ్యం క్షిణించింది. దీంతో ముంగేర్‌లోని కేంద్ర ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు.