/rtv/media/media_files/2025/02/09/QGYioXTkAFSOip4smMNw.jpg)
Amit Shah Responds after Attack on Maoists
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపుర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో 31 మంది మావోయిస్టులు మృతి చెందారు. మృతుల సంఖ్య మరింత పెరిగే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే దీనిపై తాజాగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పందించారు. భద్రతా దళాలు దేశాన్ని నక్సల్స్ రహిత దేశంగా మార్చే దిశలో భారీ విజయం సాధించినట్లు పేర్కొన్నారు. వచ్చే ఏడాది మార్చి నాటికి నక్సలిజం లేకుండా చేస్తామని ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు.
Also Read: సూర్యాస్తమయం తర్వాత మహిళలను అరెస్టు చేయొచ్చు.. హైకోర్టు సంచలన తీర్పు
'' ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఆపరేషన్‌లో భద్రతా దళాలు 31 మంది మావోయిస్టులను హతమార్చాయి. భారీగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నాయి. మానవత్వానికి వ్యతిరేకంగా ఉన్న నక్సలిజాన్ని అంతం చేసే ప్రయత్నంలో భాగంగా మనం ఇద్దరు జవాన్లను కోల్పోయాం. ఈ అమరవీరులకు దేశం ఎప్పటికీ రుణపడి ఉంటుంది. 2026 మార్చి 31 నాటికి దేశంలో నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలిస్తాం. దేశంలో ఏ పౌరుడు కూడా దానివల్ల ప్రాణాలు కోల్పోకూడదని'' అమిత్ షా ఎక్స్‌లో రాసుకొచ్చారు.
नक्सल मुक्त भारत बनाने की दिशा में सुरक्षा बलों ने छत्तीसगढ़ के बीजापुर में बड़ी सफलता हासिल की है। इस ऑपरेशन में 31 नक्सलियों को ढेर करने के साथ ही भारी मात्रा में हथियार और विस्फोटक सामग्री भी बरामद की गयी है।
— Amit Shah (@AmitShah) February 9, 2025
मानवता विरोधी नक्सलवाद को समाप्त करने में आज हमने अपने दो बहादुर…
Also Read: మెక్సికోలో విషాదం.. బస్సు-ట్రక్కు ఢీ.. 41 మంది సజీవ దహనం
మరోవైపు ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయ్... భద్రతాబలగాల ధైర్యసాహసాలను ప్రశంసించారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నక్సల్స్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్నామని తెలిపారు. ఇక ఈ భారీ కాల్పుల్లో మరో ఇద్దరు జవాన్లకు తీవ్రంగా గాయాలయ్యాయి. వాళ్లని రాయ్‌పూర్‌కు తరలించి చికిత్స అందిస్తు్న్నారు. ఛత్తీస్‌గఢ్ చరిత్రలో ఇది రెండో భారీ ఎన్‌కౌంటర్ అని చెబుతున్నారు.
Also Read: బీజేపీ విజయంపై పురంధేశ్వరి సంచలన కామెంట్స్.. విధ్వంసాలు, కక్షలతోనే అంటూ!
Also Read: వెస్ట్ బెంగాల్‌లో అనుమానస్పద రేడియో సిగ్నల్స్.. ఉగ్రకుట్రనా ?