/rtv/media/media_files/2025/04/09/BcT4JqxTgRNgWRAGs6vx.jpg)
13 killed in lightning strikes in four districts of Bihar
బీహార్‌లో పలు జిల్లాల్లో వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. బలమైన ఈదురు గాలులు వీచాయి. బుధవారం ఉదయం నాలుగు జిల్లాల పరిధిలో పిడుగులు పడి 13 మంది ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపింది. దర్‌బంగా, బెగూసరాయ్ జిల్లాల్లో తొమ్మిది మంది పిడుగుపాటుకు గురై మృతి చెందారు. మధుబనీ జిల్లాలో ముగ్గురు చనిపోయారు. వీళ్లలో ఇద్దరూ ఒకే ఫ్యామిలీకి చెందిన తండ్రి, కూతురు. ఇక సమస్తిపుర్‌లో ఒక వ్యక్తి పిడుగుపాటు వల్ల మృతి చెందాడు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కార్యాలయం అధికారికంగా వెల్లడించింది.
Also Read: ముగ్గురు పిల్లల తల్లికి ఇంటర్ స్టూడెంట్‌తో మూడో పెళ్లి
ఈ ఘటనపై సీఎం నితీశ్ కుమార్ సంతాపం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. విపత్తు నిర్వహణ అధికారులు జారీ చేసే సూచనలను పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అయితే బిహార్ ఆర్థిక సర్వే ప్రకారం చూసుకుంటే 2023లో పిడుగుపాటు వల్ల 275 మంది ప్రాణాలు కోల్పోయారు.
Also read: పెళ్లికి ముందు కాబోయే అల్లుడితో అత్త జంప్..
ఇదిలాఉండగా భారత వాతావరణ శాఖ (IMD) కీలక ప్రకటన చేసింది. ఏప్రిల్ 9 నుంచి 12వ తేదీ దక్షిణాది రాష్ట్రాల్లో వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు చెప్పింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలుల విస్తాయని.. పలు ప్రాంతాల్లో పిడుగులు కూడా సంభవించే ఛాన్స్ ఉందని హెచ్చరించింది. కేరళ, కర్ణాటక, తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది.
Also read: బీహార్ లో దారుణం కేంద్రమంత్రి మనమరాలి దారుణ హత్య
అంబేడ్కర్ Vs దేవుడు.. అమిత్‌షాపై దుమ్మెత్తిపోస్తున్న ప్రతిపక్షాలు
'అంబేద్కర్ అని చెప్పుకోవడం ఫ్యాషన్‌గా మారింది. ఇన్నిసార్లు దేవుడి పేరు తలుచుకుంటే స్వర్గంలో చోటు దక్కేది' అంటూ రాజ్యసభలో అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. అమిత్ షా వెంటనే క్షమాపణలు చెప్పి రాజీనామా చేయాలంటూ విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
National: అంబేడ్కర్‌ను ఉద్దేశిస్తూ రాజ్యసభలో అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగుతోంది. అమిత్ షా వెంటనే క్షమాపణలు చెప్పాలంటూ పార్లమెంటు ఆవరణలో విపక్షాలు నిరసన చేపట్టాయి. బీజేపీ కులతత్వ, దళిత వ్యతిరేక మనస్తత్వానికి నిదర్శనమంటూ మమతా బెనర్జీ మండిపడ్డారు. మిస్టర్ షా దళితుల చిహ్నాన్ని అవమానించారని కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీల నాయకులు ఆరోపణలు చేశారు. హోం మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు అంబేడ్కర్‌ను కాంగ్రెస్ ఎలా పక్కన పెట్టిందనే విషయాన్ని కాకుండా.. ఈ చిన్న వీడియో క్లిప్‌ను కాంగ్రెస్ ప్రసారం చేస్తోందని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
ప్రియాంక గాంధీ..
‘అంబేడ్కర్ కోట్లాది మంది దళితులు, అణగారిన వర్గాల ప్రజల ఆత్మగౌరవాలకు ప్రతీక. ఆయన పేరు ప్రస్తావించడాన్ని ఎంతో గౌరవంగా భావిస్తాం. అలాంటి వ్యక్తిని బీజేపీ కించపరుస్తోందంటూ ప్రియాంక మండిపడ్డారు.
మమతా బెనర్జీ..
'అంబేడ్కర్ మార్గదర్శకత్వం, స్ఫూర్తిబాటలో నడిచే లక్షలాది మందికి అమిత్ షా వ్యాఖ్యలు అవమానకరం. ఈ వ్యాఖ్యలతో బీజేపీ ముసుగు వీడిపోయింది. ప్రజాస్వామ్య దేవాలయంలోనే అంబేడ్కర్‌పై అవమానకర వ్యాఖ్యలు చేయడం దారుణం. ద్వేషంతో నిండిపోయిన పార్టీ నుంచి ఇంకేమి ఆశించగలం' అని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అమిత్ షా ఏమన్నారంటే..
‘బీఆర్ అంబేద్కర్ పేరుని చెప్పడం ప్రతిపక్షాలకు ఫ్యాషన్ అయిపోయింది. అంబేద్కర్ , అంబేద్కర్ , అంబేద్కర్ , అంబేద్కర్ అని చెప్పుకోవడం ఫ్యాషన్ గా భావిస్తున్నారు. ఇన్నిసార్లు దేవుడి పేరు తలుచుకుంటే స్వర్గంలో చోటు దక్కేది' అని అమిత్ షా అన్నారు.
మోదీ విమర్శలు..
ఈ వివాదంపై ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. కాంగ్రెస్‌తో పాటు ప్రతిపక్షాలపై మండిపడ్డారు. అంబేడ్కర్ వారసత్వాన్ని తుడిచిపెట్టడానికి, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలను కించపరిచేందుకు కాంగ్రెస్ ఎలాంటి విధివిధానాలను ఆచరిస్తోందో ప్రజలు చూస్తూనే ఉన్నారన్నారు. ‘కాంగ్రెస్ పార్టీ, దాని కుళ్లిన పర్యావరణ వ్యవస్థ రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్‌ను అవమానించడాన్ని ద్వేషపూరిత అబద్దాలు దాచగలవని భావిస్తే వారంతా పొరపాటుపడ్డట్లే. దేశ ప్రజలు ఓ రాజవంశం నాయకత్వంలోని పార్టీ ఎలాంటి విధివిధానాలను ఆచరిస్తోంది? అంబేద్కర్ వారసత్వాన్ని తుడిచిపెట్టడానికి, SC/STలను అవమానపరిచేందుకు అవసరమైన ప్రతీ అవకాశాన్ని వదులుకోకపోవడాన్ని గమనిస్తున్నారు' అని విమర్శించారు.
ఉద్ధవ్ ఠాక్రే
బీజేపీ మిత్రపక్షాలు అమిత్ షా వ్యాఖ్యలతో ఏకీభవిస్తాయా? అంటూ శివసేన (యూబీటీ) అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే ప్రశ్నించారు. అంబేడ్కర్ పేరును బీజేపీ, కాంగ్రెస్‌లు రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నాయని మండిపడ్డారు. ఆయన సేవలను గౌరవించడంలో విఫలమవుతూనే ఉన్నాయని బీఎస్పీ అధినేత్రి మాయావతి సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు.
భారీ వర్షం.. పిడుగులు పడి 13 మంది మృతి
బీహార్‌లో పలు జిల్లాల్లో వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. బుధవారం ఉదయం నాలుగు జిల్లాల పరిధిలో పిడుగులు పడి 13 మంది ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపింది. క్రైం | Short News | Latest News In Telugu | నేషనల్
Viral news: ముగ్గురు పిల్లల తల్లికి ఇంటర్ స్టూడెంట్‌తో మూడో పెళ్లి
ఆమె వయసు 30ఏళ్లు. ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. క్రైం | Short News | Latest News In Telugu | నేషనల్
Marriage: పెళ్లికి ముందు కాబోయే అల్లుడితో అత్త జంప్..
తన కూతురి పెళ్లికి మరో 9 రోజుల సమయం ఉందనగా.. ఓ మహిళ కాబోయే అల్లుడితో లేచిపోవడం కలకలం రేపింది. పెళ్లి షాపింగ్‌కు వెళ్తున్నామని చెప్పి అత్తా, అల్లుడు.. 2.5 లక్షల నగదు, బంగారంతో జంప్ అయ్యారు. Short News | Latest News In Telugu | నేషనల్
ఏపీకి గుడ్‌న్యూస్.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు, తిరుపతి మీదుగా తమిళనాడులో వెల్లూరు వరకు రైల్వేలైన్‌లో మరో అదనపు రైల్వేలైన్‌కు శ్రీకారం చుట్టింది. Short News | Latest News In Telugu | నేషనల్
Union Minister Grand Daughter Shot Dead : బీహార్ లో దారుణం కేంద్రమంత్రి మనమరాలి దారుణ హత్య
కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీ మనవరాలు సుష్మా దేవి బుధవారం హత్యకు గురయ్యారు. ఆమెను భర్త రమేశ్ సింగ్ కాల్చి చంపాడు. : క్రైం | Short News | Latest News In Telugu | నేషనల్
Air India flight: విమానంలో పక్క ప్యాసింజర్‌పై మూత్రం పోసిన వ్యక్తి
ఢిల్లీ నుంచి బ్యాంకాక్ వెళ్తున్న ఎయిర్ ఇండియా ఫ్లైట్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. Short News | Latest News In Telugu | బిజినెస్ | నేషనల్
USA: వెనక్కు తగ్గిన ట్రంప్ సర్కార్, చైనా తప్ప మిగతా దేశాలపై 90 రోజుల పాటూ..
GT VS RR: గుజరాత్ ఖాతాలో వరుసగా నాలుగో విజయం
Badminton: ఆసియా ఛాంపియన్ షిప్ లో పీవీ సింధు మొదటి విజయం
USA: చైనా అయిపోయింది ఇప్పుడు ఈయూ వంతు..
భారీ వర్షం.. పిడుగులు పడి 13 మంది మృతి