/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/amazon-jpg.webp)
Amazon
క్విక్ కామర్స్...అంటే నిమిషాల్లో వసతువులను డెలివరీ చేయడం. కరోనా తర్వాత డెలీవరీ ఇచ్చే సంస్థలకు విపరీతంగా ఆదరణ పెరిగిపోయింది. దీంతో వినియోగదారులను ఆకట్టుకునేందుకు ఇవి రకరకాల మార్గాలను ఎంచుకుంటున్నాయి. అందులో క్విక్ కామర్స్ ఒకటి. ఈ ఫార్ములా కూడా సూపర్ హిట్ అయింది. దాంతో ఎవరు ఎంత ఫాస్ట్ గా డెలివరీ చేస్తారనేది ఇప్పుడు పోటీగా మారింది. జెప్టో, బ్లింకిట్, జొమాటో, స్విగ్గీ ఇవన్నీ క్విక్ కామర్స్కు చెందిన సంస్థలే. జెప్టో సంస్థ అన్నింటికంటే ముందు దీన్ని మొదలుపెట్టింది. ఈ క్విక్ కామర్స్ కు విపరీతంగా క్రేజ్ పెరిగిపోవడంతో ఇప్పుడు దిగ్గజ సంస్థలు సైతం దీనివైపు మొగ్గు చూపుతున్నాయి. అందులో భాగంగానే అమెజాన్ కూడా క్విక్ కామర్స్ ను ప్రారంభించింది.
Also Read: UN: బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులు..1400 మంది మృతి-ఐక్యరాజ్యసమితి
అమెజాన్ నౌ అనే పేరుతో..
ఇప్పటివరకు ఈ కామర్స్ గా ఉన్న అమెజాన్ ఇక మీదట క్విక్ కామర్స్ గా మారబోతోంది. పది నిమిషాల్లో డెలవరీ చేసే విధంగా తన సేవలలో ఛేంజ్ తీసుకువచ్చింది. ప్రస్తుతానికి దీన్ని బెంగళూరులో ప్రారంభించింది. అమెజాన్ నౌ అనే పురుతో ఈ క్విక్ కామర్స్ సేవలను మొదలుపెట్టింది. త్వరలోనే దీన్ని మరిన్ని ప్రాంతాలకు విస్తరించాలని అనుకుంటోంది. క్విక్ కామర్స్ సేవల్లో భాగంగా 1,000-2,000 ఉత్పత్తులు డెలివరీలు చేయడానికి సిద్ధంగా ఉంది. దీని కోసం కొన్ని నెలలుగా ప్రణాళికలు వేస్తున్నామని అమెజాన్ అధికారులు చెప్పారు. దీని కోసం ప్రత్యేక రిక్రూట్ మెంట్ ను కూడా చేపట్టింది. కూరగాయలు, కిరణా వస్తువులు వంటి నిత్యావసరాలతో పాటు బ్యూటీ, గృహోపకరణాలను కూడా 10 నిమిషాల్లో డెలివరీ చేసేలా చర్యలు చేపడుతోంది.
Also Read: USA: ట్రంప్ శాంతి మంత్రం..యుద్ధానికి ముగింపు పలకాలని పుతిన్ కు ఫోన్