/rtv/media/media_files/2025/02/15/vcxH4irdohrr0ZFbqtif.jpg)
Akhilesh Yadav Requests Uttar Pradesh Government to Extend Date of Prayagraj Maha Kumbh Mela 2025
ఉత్తర ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ మహా కుంభ్ నగర్‌లో మహా కుంభమేళా జరుగుతోంది. దాదాపు 144 ఏళ్లకు ఒకసారి ఈ ఆధ్యాత్మిక వేడుక జరుగుతుండటంతో కోట్లాది భక్తులు పోటెత్తుతున్నారు. గంగా, యమునా, సరస్వతి నదులు కలిసే త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఈ ఏడాది జనవరి 23న ప్రారంభమైన ఈ వేడుక ఫిబ్రవరి 26తో అంటే మహా శివరాత్రితో ముగియనుంది.
Also Read : మరో బ్యూటీతో లలిత్ మోదీ రాసలీలలు.. లవర్స్ డే స్పెషల్ పోస్ట్.. ఆ అందగత్తే ఎవరో తెలుసా!
ఇక ఈ వేడుక ముగిసే సమయం దగ్గర పడుతుండటంతో భక్తులు రోజు రోజుకూ పెరుగుతున్నారే తప్ప తగ్గడం లేదు. 45 రోజుల పాటు సాగే ఈ ఆధ్యాత్మిక వేడుకకు దాదాపు 40 కోట్ల నుంచి 45 కోట్ల మంది భక్తులు వస్తారని యూపీ ప్రభుత్వం అంచనా వేసింది. కానీ వారి అంచనాలకు మించి భక్తులు మహా కుంభమేళాకు చేరుకున్నారు. కేవలం 34 రోజుల్లోనే 50 కోట్ల మందికి పైగా భక్తులు అక్కడ పుణ్యస్నానాలు ఆచరించారు.
Also Read: ఆ విషయంలో భర్త బలవంతం చేసినా తప్పుకాదు: హైకోర్టు
కుంభమేళా గడువు పెంచాలి
ఈ తరుణంలోనే కుంభమేళాకు వచ్చే భక్తుల సంఖ్య తగ్గకపోవడంతో యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ స్పందించారు. ఈ వేడుక ముగియడానికి మరికొద్ది రోజులే ఉందని.. ఇంకా భక్తుల తాకిడి తగ్గలేదని.. అందువల్ల మహా కుంభమేళాను మరిన్ని రోజులు పొడిగించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గతంలో 75 రోజులు నిర్వహించిన దాఖలాలు ఉన్నాయని ఆయన గుర్తు చేశారు.
Samajwadi Party Chief Akhilesh Yadav says, "DURATION of the #MahaKumbh2025 should be EXTENDED so that old people can take a holy dip"
— BhikuMhatre (@MumbaichaDon) February 15, 2025
Is he naturally born like "THIS" or has done special couse?😂😂
Anyway, how can HE know about Hindu Traditions & Panchang? pic.twitter.com/84NFd7Z3Ij
Also Read : ట్రంప్, మస్క్ కలిసి ఉద్యోగాలు పీకేస్తున్నారు..ఇప్పటికి 10వేల మంది అవుట్
దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ కుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరించాలని చూస్తున్నారని.. కానీ వెళ్లలేకపోతున్నారని అన్నారు. అందువల్ల ఈ మహా కుంభమేళా నిర్వహణ గడువును మరికొద్ది రోజులు పెంచాలని యూపీ ప్రభుత్వాన్ని కోరారు. 144 ఏళ్లకు ఒకసారి వచ్చే ఈ మహా కుంభమేళాను పొడిగిస్తే.. మరికొంత మంది వచ్చి పుణ్య స్నానాలు చేస్తారని తెలిపారు.