Lucknow Murder: నా తల్లి, 4గురు చెల్లెళ్లను అందుకే చంపేశా: వీడియో రిలీజ్ చేసిన కొడుకు!

న్యూఇయర్ వేళ లక్నోలో వెలుగుచూసిన తల్లి, 4గురు చెల్లెళ్ల మర్డర్ ఘటనలో కీలకవిషయం బయటకొచ్చింది. కొందరువ్యక్తులు తన చెల్లెళ్లను ఇతరులకు విక్రయించడానికి ప్రయత్నించారని నిందితుడు తెలిపాడు. అందువల్లే తన తండ్రితో కలిసి ఈ ఘోరానికి ఒడిగట్టానని వీడియో రిలీజ్ చేశాడు.

New Update
man killed his mother and four sisters

man killed his mother and four sisters

కొత్త సంవత్సరం మొదటి రోజే ఉత్తర ప్రదేశ్ రాజధాని లక్నోలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ యువకుడు తన తల్లితో పాటు నలుగురు చెల్లెళ్లకు విషం పెట్టి చంపేశాడు. ఈ కేసులో కీలక విషయాలు బయటకొచ్చాయి. తన తల్లి, చెల్లెళ్లను చంపడానికి గల కారణాలను ఆ నిందితుడు అర్షద్ ఓ వీడియో ద్వారా వెల్లడించాడు. తన చెల్లెళ్లను కొందరు ఇతరులకు అమ్మేయాలని చూస్తున్నారని.. అందువల్లే తన తండ్రితో కలిసి ఈ ఘోరానికి ఒడిగట్టానని తెలిపారు. ఈ మేరకు విడుదలైన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 

Also Read: మన ఆఫీసులో పులిగారున్నారు..మీరు ఇంటి నుంచే పని చేయండి!

వీడియో ప్రకారం.. పొరుగున్న కొందరు వ్యక్తుల నుంచి తమకు వేధింపులు వచ్చాయన్నాడు. దాని కారణంగానే తీవ్ర నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నాడు. అందువల్లనే తన తల్లి, చెల్లెళ్లను చంపేసినట్లు తెలిపాడు. కాగా తమ ఇల్లు కబ్జా చేయాలని కొందరు చూశారని.. వారిని అడ్డుకునేందుకు తాను తన తండ్రి ఎంతో కష్టపడ్డామని అన్నాడు. 

15 రోజులుగా చలిలో తిరిగామని.. ఫుట్‌పాత్ మీదే నిద్రపోతున్నామని అన్నాడు. తమ ఇంటి పత్రాలు తమవద్దే ఉన్నా.. సగం ఇల్లు వారి చేతిలోకి వెళ్లిపోయిందన్నాడు. అందువల్లనే తన తల్లి, చెల్లెళ్లకు మొదట విషం పెట్టి ఆ తర్వాత చేతి మణికట్టు నరాలు కోసి.. ఊపిరాడకుండా చేసి చంపినట్లు చెప్పాడు. అనంతరం మృతదేహాలను వీడియోలో చూపించాడు. 

అలాగే తమ కుటుంబ పరిస్థితికి కారణమైన కొందరి పేర్లను కూడా చెప్పుకొచ్చాడు. తమను ఈ పరిస్థితికి తీసుకొచ్చిన వారంతా లాండ్ మాఫియాలో భాగం అని అన్నాడు. తన తండ్రిని, తనను తప్పుడు కేసులో ఇరికించి.. ఆ తర్వాత తన చెల్లెళ్లను ఇతరులకు అమ్మేయాలనుకున్నారని ఆ వీడియోలో చెప్పుకొచ్చాడు. 

Also Read: రాబోయే 5 రోజులు జర భద్రం.. వాతావరణ శాఖ హెచ్చరికలు

తమ చెల్లెళ్లను హైదరాబాద్ తీసుకెళ్లి అమ్ముతుంటే చూస్తూ ఉండాలా? అని అన్నాడు. అలాంటి పరిస్థితి తమకు రాకూడదనే.. తల్లి చెల్లెళ్లను చంపేశా అని చెప్పుకొచ్చాడు. ఉదయం అయ్యే సరికల్లా తాను కూడా బతికి ఉండకపోవచ్చన్నాడు. తాను చనిపోయిన తర్వాత ఇంటి స్థలాన్ని ప్రార్థనా మందిరానికి కేటాయించాలని కోరాడు. అలాగే ఇంట్లోని వస్తువులను అనాథాశ్రమానికి ఇవ్వాలని ఆ వీడియోలో చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం అతడు పోలీసుల అదుపులో ఉన్నాడు.

అసలు ఏం జరిగిందంటే?

ఓ యువకుడు తన తల్లితో పాటు నలుగురు చెల్లెళ్లకు విషం పెట్టి చంపేశాడు. ఈ దారుణ ఘటన  ఉత్తర్ ప్రదేశ్ రాజధాని లక్నోలో బుధవారం తెల్లవారుజామున ఈ విషాద ఘటన జరిగింది. కుటుంబ కలహాలతోనే నిందితుడు.. ఐదుగుర్ని హత్య చేసినట్టు పోలీసులు తెలిపారు. ఆగ్రాకు చెందిన అర్షద్ (24) తన తల్లి అస్మా, నలుగురు చెల్లెళ్లు అలీషా (19), రహ్మీన్ (18), అక్సా (16), అలియాలు  తినే ఆహారంలో విషం కలిపి, తర్వాత చేతి మణికట్టుపై కత్తితో కోసి చంపినట్టు పోలీసులు తెలిపారు.

నకా ప్రాంతంలోని హోటల్ శరణ్‌జిత్‌లో బాధిత కుటుంబం డిసెంబరు 30న దిగినట్టు వివరించారు. తల్లి సహా ఐదుగుర్ని హత్యచేసిన అర్షద్.. అక్కడ నుంచి పారిపోయాడు. పోలీసులు రంగంలోకి దిగి అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. లక్నో డీసీసీ రవీనా త్యాగి మాట్లాడుతూ.. ‘నిందితుడ్ని అర్షద్ (24)గా గుర్తించారు. కుటుంబంలోని ఐదుగుర్ని హత్య చేశాడు.. అత్యంత క్రూరమైన చర్యకు పాల్పడిన నిందితుడ్ని స్థానిక పోలీసులు వెంటనే అరెస్ట్ చేశారు’ అని చెప్పారు. ఘటనా స్థలికి ఫోరెన్సిక్ నిపుణులు చేరుకుని.. ఆధారాలు సేకరిస్తున్నారని వివరించారు. 

Also Read: ఏపీలో పలువురు ఐఏఎస్‌,ఐపీఎస్‌ లకు పదోన్నతులు!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Punjab: ఐఎస్ఐ ఉగ్ర కుట్ర భగ్నం..భారీగా ఆయుధాలు స్వాధీనం

పాకిస్తాన్ గూఢచారి సంస్థ ఐఎస్ఐ మద్దతు ఇస్తున్న బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ విదేశాల నుంచి నిర్వహిస్తున్న రెండు టెర్రర్ మాడ్యల్స్ ను పంజాబ్ పోలీసులు భగ్నం చేశారు. దీనికి పాల్పడుతున్న 13మంది అరెస్ట్ చేశారు. ఇందులో ఒక మైనర్ కూడా ఉన్నట్టు సమాచారం.

author-image
By Manogna alamuru
New Update
Pakistan: బస్సులో నుంచి 9 మంది కిడ్నాప్ చేసి చంపేసిన ఉగ్రవాదులు

పాకిస్తాన్ ఉగ్రవాది సంస్థ ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్ మళ్ళీ ఇండియాలో దాడులు చేసేందుకు కుట్ర పన్నింది. దీని మద్దతు కలిగిన బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ రెండు టెర్రర్ మాడ్యూల్స్ ను ప్రయోగించేందుకు సిద్ధమైంది. దీన్ని పంజాబ్ పోలీసులు ఛేదించారు. ఈ కుట్రలో పాల్గొన్న 13 మందిని అరెస్ట్ చేశారు. వీరిలో ఒక మైనర్ కూడా ఉన్నాడని సమాచారం.  దీంతో పాటూ టెర్రరిస్టుల నుంచి పోలీసులు భారీగా ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నారు.  రెండు రాకెట్ ప్రొపెల్డ్ గ్రెనేడ్స్(ఆర్పీజీ), ఒక రాకెట్ లాంచర్, రెండు ఐఈడీలను, హ్యాండ్ గ్రెనేడ్స్, ఆర్డీఎక్స్, పిస్టల్స్, కమ్యూనికేషన్ పరికరాలను, పెద్ద మొత్తంలో ఆయుధాలను, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.

రెండు ప్రత్యేక ఆపరేషన్ల ద్వారా..

ఈ రెండు కుట్రలను భగ్నం చేయడానికి పంజాబ్ పోలీసులు రెండు ప్రత్యేకమైన ఆపరేషన్లను చేపట్టారు. ఇందులో కౌంటర్ ఇంటెలిజెన్స్ బలంధర్, బటాలా జిల్లా పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. వీటికి పంజాబ్ డీజీపీ గౌరవ్ యాదవ్ నాయకత్వం వహించారు. ఈ రెండు టెర్రర్ మాడ్యుల్స్‌ని ఫ్రాన్స్‌కు చెందిన సత్నామ్ సింగ్ అలియాస్ సత్తా, గ్రీస్‌కు చెందిన జస్వీందర్ సింగ్ అలియాస్ మన్ను అగ్వాన్ నిర్వహిస్తున్నట్లు తేలింది. అరెస్టయిన ఇతర వ్యక్తులను పవన్‌ప్రీత్ సింగ్, బల్బీర్ కుమార్ అలియాస్ వరుణ్, గోమ్జీ అలియాస్ గొట్టా, గుర్‌ప్రీత్ సింగ్ అలియాస్ గోపి, అజయ్‌పాల్ సింగ్, రాహుల్ అలియాస్ భైయా, జోహన్సన్ మరియు జతీందర్‌గా గుర్తించారు.

today-latest-news-in-telugu | isi | pakistan | terrorist 

Also Read: IPL 2025: 14 ఏళ్ళకే ఐపీఎల్ ప్రవేశం..చరిత్రలో నిలిపోయే వైభవ సూర్యవంశీ

Advertisment
Advertisment
Advertisment