Bengaluru: నటి రన్యారావుకు షాక్..నో బెయిల్..

గోల్డ్ స్మగ్లింగ్ కేసులో నటి రన్యారావుకు కోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ఆమె బెయిల్ పిటిషన్ ను కోర్టు తిరస్కరించింది.  ఆమెపై ఉన్న అభియోగాలు తీవ్రమైనవని న్యాయమూర్తి విశ్వనాథ్ సీ గౌడర్ అన్నారు.

New Update
KS

Actoress Ranya Rao

నటి రన్యారావు బెయిల్ పిటిషన్ రెండోసారి కూడా కోర్టు కొట్టేసింది. ఇప్పటికే ఒకసారి మేజిస్ట్రేట్ కోర్టు ఆమె బెయిల్ ను తిరస్కరించింది. ఇప్పుడు ఆర్థిక నేరాల ప్రత్యేక కోర్టు కూడా నర్యనావుకు బెయిల్ ఇవ్వడం కుదరదంటూ తేల్చి చెప్పేసింది.  ఆమెపై ఉన్న అభియోగాలు తీవ్రమైనవని న్యాయమూర్తి విశ్వనాథ్ సీ గౌడర్ అన్నారు. దీంతో పాటూ రన్యారావును జ్యూడీషియల్ కస్టడీలోనే ఉంచాలనే ప్రాసిక్యూషన్ వాదనలతో ఏకీభవించారు. అయితే నటి తరుఫు న్యాయవాదులు మాత్రం మళ్ళీ సెషన్స్ కోర్టులో బెయిల్ పిటిషన్ వేసేందుకు సిద్ధమవుతున్నారు. 

దుబాయ్ నుంచి అక్రమంగా బంగారాన్ని రవాణా చేస్తూ బెంగళూరు ఎయిర్ పోర్ట్ లో దొరికిపోయింది నటి రన్యారావు. ఈ వ్యవహారం తీవ్ర సంచలనం సృష్టించింది. రన్యారావు బంగారం తీసుకొచ్చిన విధానం, ఆమె అనుసరించిన మార్గాలు అందరినీ అవాక్కయ్యేలా చేశాయి. ఎయిర్ పోర్ట్ లో ఆమెను కస్టడీలోకి తీసుకున్న డీఆర్ఐ అధికారులు అప్పటి నుంచీ విచారిస్తూనే ఉన్నారు. అయితే మొట్టమొదటిసారిగా నిన్న రన్యారావు పోలీసులు ముందు నోరు విప్పిందని..స్టేట్ మెంట్ ఇచ్చిందని కథనాలు వెలువడుతున్నాయి. తాను బంగారం స్మగ్లింగ్ చేయడం ఇదే మొదటిసారని..ఇదంతా ఎలా చేయాలో యూట్యబ్ చూసి నేర్చుకున్నానని ఆమె పోలీసులకు చెప్పిందని తెలుస్తోంది.  ఎవరికీ కనబడకుండా బంగారాన్ని ఎలా దాచాలో తాను యూట్యూబ్ లోనే చూసి తెలుసుకున్నానని రన్యారావు అధికారులకు చెప్పినట్లు సమాచారం.

సీబీఐ చేతిలో..

రన్యారావు కేసు ప్రస్తుతం సీబీఐ చేతిలో ఉంది. దీంతో ఈ కేసు శరవేగంగా దర్యాప్తు జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఈ బంగారం స్మగ్లింగ్‌ వ్యవహారంలో రన్యారావుతో పాటు ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయి అనేది గుర్తిచేందుకు సీబీఐ రకరకాల ప్రయత్నాలు చేస్తోంది. దీంతో కర్ణాటకలో చాలా మంది గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నట్టు తెలుస్తోంది.  ఈ కేసులో ప్రధాన సూత్రధారులను గుర్తించేందుకు సీబీఐ శరవేగంగా దర్యాప్తు జరుపుతోంది. ఇందులో ఆమె తండ్రి , సీనియర్ ఐపీఎస్ అధికారి కె. రామచంద్రరావు తో పాటూ పలువురు నేతలు, బ్యూరో క్రాట్లు ఉన్నట్లు అనుమానాలున్నాయి. కొందరు వ్యక్తులు సిండికేట్‌లా ఏర్పడి ఈ దందాను నడిపిస్తున్నట్లు గుర్తించిన డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ తదుపరి దర్యాప్తు నిమిత్తం సీబీఐకి ఫిర్యాదు చేసింది.

Also Read: Pakistan: పాకిస్తాన్ లో మరో దాడి..మసీదులో బాంబు

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు