/rtv/media/media_files/2025/01/18/A9bLeCakd1kx0gmaRUhv.jpg)
Rahul Gandhi
ఢిల్లీ కాలుష్యం, ధరల పెరుగుదల, అవినీతిపై తమ పోరాటం కొనసాగుతుందని కాంగ్రెస్ ముఖ్యనేత ట్వీట్ చేశారు. ఢిల్లీ ఎన్నికల రిజల్ట్ పై ఆయన స్పందించారు. ఢిల్లీ ప్రజల తీర్పును గౌరవిస్తామని.. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, మద్దతుగా నిలిచిన ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు.
दिल्ली का जनादेश हम विनम्रता से स्वीकार करते हैं।
— Rahul Gandhi (@RahulGandhi) February 8, 2025
प्रदेश के सभी कांग्रेस कार्यकर्ताओं को उनके समर्पण और सभी मतदाताओं को उनके समर्थन के लिए दिल से धन्यवाद।
प्रदूषण, महंगाई और भ्रष्टाचार के विरुद्ध - दिल्ली की प्रगति और दिल्लीवासियों के अधिकारों की यह लड़ाई जारी रहेगी।
ఢిల్లీలో కాంగ్రెస్ హ్యాట్రిక్ అపజయాలను సొంతం చేసుకుంది. వరుసగా 2015, 2019, 2025ల్లో జరిగిన మూడు ఎన్నికల్లో గెలవలేదు. ఈసారి అయితే అసలు ఖాతానే తెరవలేదు. ఇండియా కూటమిలో అలైన్స్ పార్టీలు అయిన ఆప్, కాంగ్రెస్ లు ఢిల్లీ ఎన్నికల్లో విడివిడిగానే పోటీ చేశాయి. దీంతో ఈ పార్టీల మధ్యనా ఓట్లు చీలిపోయి...రెండూ ఓడిపోయాయి. 11 స్థానాల్లో బీజేపీ అభ్యర్థుల ఆధిక్యం కంటే కాంగ్రెస్ అభ్యర్థులకు ఎక్కువ ఓట్లు వచ్చాయి. దీన్ని బట్టి రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తే ఫలితం బీజేపీకి వ్యతిరేకంగా ఉండేదనే వాదన వినిపిస్తోంది.
అతి విశ్వాసమే దెబ్బ కొడుతోంది..
సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ 99 సీట్లు గెలిచి ప్రతిపక్షంగా నిలబడింది, పరువు నిలబెట్టుకుంది. కానీ తరువాత వరుసగా ఓడిపోతూ వస్తోంది. కాంగ్రెస్ కు కంచుకోట అనుకున్న హర్యానాలో కూడా ఆ పార్టీ ఓటమి పాలయింది. అలాగే మహారాష్ట్రలో, ఇప్పుడు ఢిల్లీల్లో కూడా ఓడిపోయింది. దీనికి కారణం కాంగ్రెస్ అతి విశ్వాసం..టైమ్ తో పాటూ పార్టీ సిద్ధాంతలనూ మార్చుకోకపోవడం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇంకా నెహ్రూ, ఇందిరాగాంధీ కాలంనాటి పాత పద్ధతులనే పట్టుకుని వేళ్ళాడుతున్నారని..శక్తికి మించిన హామీలు ఇస్తామని ప్రకటిస్తూ అభాసు పాలవుతున్నారని చెబుతున్నారు.
Also Read: AP: ఢిల్లీకి, ఏపీకి పోలిక ఉంది..బీజేపీ చారిత్రాత్మక విజయంపై ఏపీ సీఎం చంద్రబాబు కామెంట్స్