ఆప్ అధినేత, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కాన్వాయ్‌పై పలువురు దుండగులు రాళ్ల దాడి చేశారు. ఎన్నికల ప్రచారం చేస్తున్నప్పుడు ఈ ఘటన జరిగింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి కేజ్రీవాల్ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ఇంటింటికి వెళ్లి ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే శనివారం కేజ్రీవాల్ కాన్వయ్‌పై కొంతమంది దుండగులు రాళ్లు విసిరారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.
हार के डर से बौखलाई BJP, अपने गुंडों से करवाया अरविंद केजरीवाल जी पर हमला‼️
— AAP (@AamAadmiParty) January 18, 2025
BJP प्रत्याशी प्रवेश वर्मा के गुंडों ने चुनाव प्रचार करते वक्त अरविंद केजरीवाल जी पर ईंट-पत्थर से हमला कर उन्हें चोट पहुंचाने की कोशिश की ताकि वो प्रचार ना कर सकें।
बीजेपी वालों, तुम्हारे इस कायराना… pic.twitter.com/QcanvqX8fB
Also Read: చలికి తట్టుకోలేక మంట వేయడంతో.. భార్యాభర్తలు మృతి
కేజ్రీవాల్‌పై కాన్వయ్‌పై జరిగిన దాడిపై ఆప్ తీవ్రంగా స్పందించింది. ఇది బీజేపీ కుట్రేనని ఆగ్రహం వ్యక్తం చేసింది. '' బీజేపీకి ఓటమి భయం పట్టుకుంది. ఎన్నికలు దగ్గరికొస్తున్న వేళ ఆ పార్టీ ఆందోళన చెందుతోంది. అందుకే కేజ్రీవాల్ ఎన్నికల ప్రచారాన్ని అడ్డుకునేందుకు యత్నిస్తోంది. ఆయన ప్రచారం చేస్తుండగా కొందరు బీజేపీకి చెందిన కొందమంది కాన్వాయ్‌పై రాళ్లతో దాడి చేశారు. ఇలాంటి చర్యలకు ఆప్ భయపడదు. ప్రజలు ఎన్నికల్లో బీజేపీకి కచ్చితంగా బుద్ధి చెబుతారని'' పేర్కొంది.
మరోవైపు ఈ ఘటనపై బీజేపీ కూడా స్పందించింది. ఆప్ ఆరోపణలను తిప్పికొట్టింది. బీజేపీ నేత పర్వేశ్ వర్మ దీనిపై ఎక్స్‌లో పోస్టు చేశారు. '' కేజ్రీవాల్ కాన్వాయ్ ఇద్దరు వ్యక్తులను ఢీకొట్టింది. వీళ్లను ఆస్పత్రికి తీసుకెళ్లారు. రాబోయే ఓటమి గురించి ఆలోచిస్తూ ప్రజల ప్రాణాలకుండే విలువను ఆయన మర్చిపోయారని తెలిపింది. బాధితులను కలిసేందుకు ఆస్పత్రికి వెళ్తున్నానని'' పర్వే్ వర్మ పేర్కొన్నారు.
Also Read: మెడికల్ స్టూడెంట్ పై హత్యాచారం చేసింది అతడే.. కోల్‌కతా కోర్టు సంచలన తీర్పు!
ఇదిలాఉండగా.. ఢిల్లీలో ఫిబ్రవరి 5న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. 8న ఫలితాలు విడుదల కానున్నాయి. ఆప్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య గట్టి పోటీ నెలకొంది. మరోవైపు పార్టీలు ఓటర్లను ఆకట్టుకునేందుకు ఎన్నికల హామీలు ప్రకటిస్తున్నాయి. ముఖ్యంగా అధికారంలో ఉన్న ఆప్‌ను గద్దె దించాలని బీజేపీ, కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే తాజాగా ఇలా కేజ్రీవాల్ కాన్వాయ్‌పై దాడి జరగడం రాజకీయంగా చర్చనీయాంశమవుతోంది.